DSC నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు?

అయితే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని డీఎస్సీ నోటిఫికేషన్ గురించి ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం వారం రోజుల్లోగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే, యువతతో కలిసి ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ కు లేఖ:  ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు బహిరంగ లేఖ రాస్తూ, పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలే ఉద్యమ ప్రధానాంశాలుగ ఉన్నప్పటికీ ఎన్నో సమస్యలు వస్తూనే ఉన్నాయని. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు […]

Share:

అయితే కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని డీఎస్సీ నోటిఫికేషన్ గురించి ప్రశ్నించారు. అయితే ప్రస్తుతం వారం రోజుల్లోగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయకపోతే, యువతతో కలిసి ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

కేసీఆర్ కు లేఖ: 

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుకు బహిరంగ లేఖ రాస్తూ, పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలే ఉద్యమ ప్రధానాంశాలుగ ఉన్నప్పటికీ ఎన్నో సమస్యలు వస్తూనే ఉన్నాయని. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులు కూడా అలాగే వదిలేశారని వాక్యానించారు. వృథా ఖర్చులతో రాష్ట్రం అప్పులపాలు అయిందని, ఉద్యోగాల గురించి చెప్పాల్సిన అవసరం లేదని, అసలు తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో ఎన్ని నోటిఫికేషన్ల విషయంలో నిర్లక్ష్యమే కనిపిస్తుందని స్పష్టం చేశారు.

ఉద్యోగాలు కోసం ఎదురుచూస్తున్న యువత: 

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్‌ల కోసం ఎదురుచూస్తున్న యువత ఎంతమంది ఉన్నారో వాఖ్యానించారు, “టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. 

మొదటి టెట్ మే 22, 2016 న జరిగింది. పేపర్-1కి 88,158 మంది హాజరుకాగా, 48,278 మంది ఉత్తీర్ణులయ్యారు. పేపర్-2 రాసిన 2,51,924 మందిలో 63,079 మంది ఉత్తీర్ణులయ్యారు. 

రెండో టెట్ జూలై 23, 2017లో నిర్వహించగా, పేపర్-1లో 98,848 మంది పరీక్ష రాయగా, 56,708 మంది ఉత్తీర్ణులయ్యారు. పేపర్-2లో 2,30,932 మంది పరీక్ష రాస్తే 45,045 మంది ఉత్తీర్ణులయ్యారు. 

మూడో టెట్ జూన్ 12, 2020న జరిగింది. 3.18 లక్షల మంది పరీక్షకు హాజరైన వారిలో 1,04,578 మంది ఉత్తీర్ణులయ్యారు. పేపర్-2 2,50,897 మంది వ్రాసారు మరియు 1,24,535 మంది దానిని క్లియర్ చేసారు. 

ప్రతి సంవత్సరం 12,500 మంది DEd చదువుతున్నారు, 15,000 మంది BEd కోర్సును పూర్తి చేస్తున్నారు.

2020 డిసెంబర్‌లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినా ఇప్పటికీ నోటిఫికేషన్ రాకపోవడం గమనార్హం అన్నారు ఎంపీ. ఐదేళ్లుగా ఉపాధ్యాయ నియామకాలు కాలేదు. సమైక్య రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్‌ పరీక్ష నిర్వహించి రెండేళ్లకు ఒకసారి డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా జారీ చేసింది. అసలు యువత పరీక్షలకు ప్రిపేర్ అవడమే తప్పిస్తే ఉద్యోగాలు చేసేది ఎప్పుడు అంటూ నిలదీశారు. యువతకు వయసు అయిపోతుంది కానీ నోటిఫికేషన్లు మాత్రం విడుదల కావట్లేదు అని వాపోయారు ఎంపీ. రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొని నోటిఫికేషన్లు జారీ చేయాలని, వారంలోగా నోటిఫికేషన్ విడుదల చేయకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. 

చిన్న చిన్న ఉద్యోగాలకు అలవాటు పడిపోతున్నారు: 

ప్రస్తుతం చాలామంది డీఎస్సీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పటికీ ఇప్పటివరకు నోటిఫికేషన్ రాకపోవడంతో వారు తమ కుటుంబాలను పోషించేందుకు చిన్నచిన్న జాబులు చేసుకుని కాలాన్ని గడుపుతున్నారు. అసలు నోటిఫికేషన్ విడుదల అవుతుందో లేదో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు యువత. సరిగ్గా ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అనిపించుకుని నెల రోజుల ముందు నోటిఫికేషన్ విడుదల చేస్తే, యువత తమకు కచ్చితంగా ఓట్లు వేస్తారని రాజకీయ నాయకులు భావిస్తున్నట్లు, కొంతమంది పబ్లిక్ కూడా మాట్లాడుతున్నారు. తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, యువతని ఇలా హింసించడం ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నారు కొందరు. ఏది ఏమైనాప్పటికీ, సరైన సమయం లో నోటిఫికేషన్లు జారీ చేయకపోవడం కరెక్ట్ కాదు. ఇప్పటికే చాలామంది ఆందోళనకు సిద్ధపడగా ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ కోమిటి రెడ్డి కూడా యువతకు తమ వంతు సహకారం అందిస్తామంటున్నారు.