మొట్టమొదటి సొరంగమార్గపు మెట్రో ట్రయల్

రైల్వే సంస్థ ప్రజలకు ఎన్ని విధాలుగా సహాయపడుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  సామాన్య ప్రజలను తక్కువ ధరకే తమ గమ్యస్థానాలకు చేర్చడమే కాదు సురక్షితంగా వారిని తమ గమ్యాలకు చేర్చుతోంది. మరొకవైపు అలుపు లేని ప్రయాణం.. రైల్వే ప్రయాణం.. అందుకే చాలామంది సుదీర్ఘ ప్రయాణాలను చేసేటప్పుడు ఎక్కువగా రైళ్లను ఉపయోగిస్తూ ఉంటారు. మరొకవైపు రైళ్లు ఎంతలా మనకు ఉపయోగపడతాయి అంటే ఇతర భారీ వస్తువులను వాహనాలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ట్రాన్స్‌పోర్ట్ చేయడంలో […]

Share:

రైల్వే సంస్థ ప్రజలకు ఎన్ని విధాలుగా సహాయపడుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  సామాన్య ప్రజలను తక్కువ ధరకే తమ గమ్యస్థానాలకు చేర్చడమే కాదు సురక్షితంగా వారిని తమ గమ్యాలకు చేర్చుతోంది. మరొకవైపు అలుపు లేని ప్రయాణం.. రైల్వే ప్రయాణం.. అందుకే చాలామంది సుదీర్ఘ ప్రయాణాలను చేసేటప్పుడు ఎక్కువగా రైళ్లను ఉపయోగిస్తూ ఉంటారు. మరొకవైపు రైళ్లు ఎంతలా మనకు ఉపయోగపడతాయి అంటే ఇతర భారీ వస్తువులను వాహనాలను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ట్రాన్స్‌పోర్ట్ చేయడంలో కూడా రైల్వే సంస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది.

ఇకపోతే నగరాలలో మెట్రో ట్రైన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలకు ప్రయాణం మరింత సులభతరం అయింది. లోకల్ బస్ స్టాప్ లాగే ఇప్పుడు లోకల్ మెట్రో ట్రైన్స్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం గమనార్హం. తక్కువ ఖర్చు.. పైగా సురక్షితంగా గమ్యాలకు  చేరడంతోపాటు రిస్క్ లేని ప్రయాణం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా రైలు ప్రయాణం చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు . అయితే ఇప్పుడు సొరంగ మార్గాన్ని కూడా ఈ మెట్రో ట్రైన్ ట్రయల్ జరుగుతుంది. అదెక్కడో కాదు కోల్‌క తా నగరం హుగ్లీ నది కింద.. ఈ మెట్రో ట్రైన్‌పై ప్రధాన నరేంద్ర మోడీ శనివారం సంతోషం వ్యక్తం చేశారు..కోల్‌కతా మెట్రో యొక్క మొదటి రేక్ హౌరా మైదాన్ కు చేరుకుంది.

మరియు దీనిని ప్రయోగాత్మకంగా హుగ్లీ నది కింద సొరంగం ద్వారా నిర్వహించినట్లు అధికారులు బుధవారం మీడియాతో తెలియజేశారు. వైపు ట్విట్టర్ ద్వారా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైలు నీటి అడుగున ప్రయాణిస్తుంది మరో ఇంజనీరింగ్ అద్భుతం ద్వారా రైలు ట్రయల్ రన్.. హుగ్లీ నది కింద మెట్రో రైలు సొరంగం స్టేషన్ సక్సెస్ఫుల్గా పూర్తయ్యాయి అంటూ స్పందించారు రైల్వే మంత్రి వైష్ణవి చేసిన ఈ ట్వీట్ కి ప్రతిస్పందనగా ప్రధానమంత్రి ఇలా ట్వీట్ చేయడం గమనార్హం.. కోల్కత్తాకు గొప్ప వార్త ఇది అలాగే భారత దేశంలో ప్రజా రవాణాకు ప్రోత్సాహకరమైన ధోరణి.. అంతేకాదు కోల్‌కతా మెట్రో మరో చరిత్ర సృష్టించింది సుదీర్ఘ నిరీక్షణ తర్వాత దేశం యొక్క మొదటి మెట్రో బుధవారం హుగ్లీ నది కింద నడిచింది. ఇది నిజంగా ప్రశంసనీయం అంటూ ఆయన అభినందించారు.

అనేక అడ్డంకులను అధిగమించి హుగ్లీ నది కింద రేకులను నడపడంలో మేము విజయం సాధించాము మెట్రో రైల్వేకు ఇది చారిత్రాత్మక ఘట్టం అని కోల్‌కతా మెట్రో చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ కౌశిక్ మిత్రా తెలిపారు. ఇకపోతే కోల్‌కతా మరియు దాని శివారు ప్రాంతాల ప్రజలకు ఆధునిక రవాణా వ్యవస్థను అందించడంలో ఇది ఓకే విప్లవాత్మకమైన అడుగు. నిజంగా బెంగాల్ ప్రజలకు భారతీయ రైల్వేలు అందించిన ప్రత్యేక నూతన సంవత్సర కానుక అని ఆయన తెలిపారు. ఇకపోతే హౌరా మైదాన్ నుండి ఎస్ప్లానేడ్ వరకు 4.8 కిలోమీటర్ల భూగర్భ విభాగంలో ఈ ట్రయల్ రన్ త్వరలోనే ప్రారంభం అవుతుంది. ఉపరితలానికి 33 మీటర్ల దిగువన హుగ్లీ నది కింద 520 మీటర్ల మేర మెట్రో 45 సెకండ్లలో చేరుకోనుంది. నది కింద ఉన్న ఈ సొరంగం నీటిమట్టానికి 32 మీటర్ల దిగువన ఉంటుంది. త్వరలోనే వాణిజ్య సేవలను ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.