పాలమూరులో డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ళు కోసం బీజేపీ ర్యాలీ

కోట్ల రూపాయాలు వెచ్చించి 10 ఎకరాల్లో బుల్లెట్‌ ప్రూఫ్‌ ఇల్లు కట్టుకున్న సీఎం కేసీఆర్‌.. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలకు డబుల్ బెడ్రూమ్‌ ఇళ్లు నిర్మించడంలో నిర్లక్ష్యం వహించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. పాలమూరులో డబుల్ బెడ్రూమ్‌ ఇళ్లు మంజూరు చేయని బీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి 10 […]

Share:

కోట్ల రూపాయాలు వెచ్చించి 10 ఎకరాల్లో బుల్లెట్‌ ప్రూఫ్‌ ఇల్లు కట్టుకున్న సీఎం కేసీఆర్‌.. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజలకు డబుల్ బెడ్రూమ్‌ ఇళ్లు నిర్మించడంలో నిర్లక్ష్యం వహించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి మండిపడ్డారు. పాలమూరులో డబుల్ బెడ్రూమ్‌ ఇళ్లు మంజూరు చేయని బీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి 10 ఎకరాలు, బీఆర్‌‌ఎస్‌ పార్టీ కార్యాలయ నిర్మాణానికి 11 ఎకరాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, కానీ, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని ఫైర్‌‌ అయ్యారు.రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలందరికీ ఇళ్లు నిర్మించారని, అయితే, పేదలకు ఇంతవరకు ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.  

ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇళ్లు నిర్మిస్తే, తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్న సీఎం కేసీఆర్ ఎందుకు ఇవ్వలేదని కిషన్రెడ్డి నిలదీశారు. కేంద్రం తన వాటా ఇస్తామని చెప్పినా. సీఎం కేసీఆర్ డబుల్ ఇళ్ల స్కీమ్‌ను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన రేషన్ కార్డులే తప్ప.. పేదవాళ్లకు కొత్తగా రేషన్ కార్డులు ఇంతవరకు ఇవ్వలేకపోయారని ధ్వజమెత్తారు. ఈ ర్యాలీలో పార్టీ ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. 

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ప్రతిపక్షాలపై ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మివర్శలకు దిగుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ పాలనకు వ్యతిరేకంగా, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ ప్రభుత్వంపై అటాక్ చేస్తున్నాయి. కిషన్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రజల్లో ఎక్కువగా ఉంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఆందోళనలను ఉధృతం చేశారు. కేంద్ర మంత్రిగా ఉంటూనే రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు.  

కిషన్ రెడ్డి  ప్రస్తానం..

కిషన్ రెడ్డి 2019లో సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆయనకు కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం ఇచ్చింది . ఆ తర్వాత కేంద్ర పర్యాటక మంత్రిగా చాన్స్ ఇచ్చింది. 2014లో తెలంగాణ శాసనసభలో బీజేపీకి ఫ్లోర్‌‌ లీడర్‌‌గా పనిచేశారు. ఆ తర్వాత 2014  నుంచి 2016  వరకు తెలంగాణకు మొట్టమొదటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మళ్లీ 2023లో స్టేట్ బీజేపీ చీఫ్ గా ఆయనను కేంద్ర నాయకత్వం నియమించింది. అంతకుముందు 2010 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 

1977లో బీజేపీ యువనాయకుడిగా రాజకీయ జీవితాన్ని కిషన్‌రెడ్డి ప్రారంభించారు. 1980లో బీజేపీని స్థాపించిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో పార్టీలో చేరారు. ఆ తర్వాత అంచలంచెలుగా కేంద్ర మంత్రిగా ఎదిగారు. 2014 నుంచి 2018 వరకు ఆయన అంబర్‌‌పేట్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా, రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్‌‌ లీడర్‌‌గా ఉన్నారు.2019లో అంబర్ పేట్ లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన ఆయన.. సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా గెలిచారు. 22 రోజుల తెలంగాణ పోరు యాత్రలో భాగంగా 3,500 కిలోమీటర్ల యాత్రలో భాగంగా 986 గ్రామాలు, 88 అసెంబ్లీ  నియోజకవర్గాల్లో ప్రారంభిచారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను ప్రజలకు ఆయన వివరించారు.