Medigadda: కేసీఆర్ మీద కంప్లైంట్ ఫైల్ చేయాలి అంటున్న కిషన్ రెడ్డి

ఇటీవల మేడిగడ్డ (Medigadda) ప్రాజెక్ట్ (Project) బ్యారేజ్ (barrage) పిల్లర్స్ కు సంబంధించి వార్తలు వెలువడుతున్నాయి. బ్యారేజ్ (barrage) మధ్యలో ఉన్న రెండు మూడు పిల్లర్లు నీటిలో కృంగడం ప్రతి ఒక్కరినీ భయాందోళనకు గురిచేస్తుంది. అయితే కన్స్ట్రక్షన్ లోపాలు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, పూర్తి కేసీఆర్  (KCR) ప్రభుత్వం వైఫల్యం అంటూ నిలదీస్తున్నారు తెలంగాణ (Telangana) ప్రతిపక్ష నాయకులు. అంతేకాకుండా మరో పక్క బ్యారేజ్ (barrage) కి సంబంధించి లోపల విషయంలో కేసీఆర్ (KCR) మీద కంప్లైంట్ ఫైల్ […]

Share:

ఇటీవల మేడిగడ్డ (Medigadda) ప్రాజెక్ట్ (Project) బ్యారేజ్ (barrage) పిల్లర్స్ కు సంబంధించి వార్తలు వెలువడుతున్నాయి. బ్యారేజ్ (barrage) మధ్యలో ఉన్న రెండు మూడు పిల్లర్లు నీటిలో కృంగడం ప్రతి ఒక్కరినీ భయాందోళనకు గురిచేస్తుంది. అయితే కన్స్ట్రక్షన్ లోపాలు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, పూర్తి కేసీఆర్  (KCR) ప్రభుత్వం వైఫల్యం అంటూ నిలదీస్తున్నారు తెలంగాణ (Telangana) ప్రతిపక్ష నాయకులు. అంతేకాకుండా మరో పక్క బ్యారేజ్ (barrage) కి సంబంధించి లోపల విషయంలో కేసీఆర్ (KCR) మీద కంప్లైంట్ ఫైల్ చేయాలి అంటున్నారు కిషన్ రెడ్డి (Kishan Reddy). 

కేసీఆర్ మీద కంప్లైంట్ ఫైల్ చేయాలి అంటున్న కిషన్ రెడ్డి: 

కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు (Project) భవిష్యత్తుపై అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో కేసీఆర్‌  (KCR) విధ్వంసానికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ, న్యాయ విచారణ జరగాలి అని కేంద్రమంత్రి, బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఎంతో ఆర్భాటంగా నిర్మించిన ప్రాజెక్టు (Project) భవిష్యత్తుపై ఇప్పుడు అనుమానాలు తలెత్తుతున్నాయని, ప్రాజెక్ట్ (Project) లోపాల విషయంలో ముందుగా తెలంగాణ (Telangana) రాష్ట్ర సీఎంపై కేసు (Case) పెట్టాలన్నారు కిషన్ రెడ్డి (Kishan Reddy).

ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ (Medigadda) ప్రాజెక్టు (Project) బ్యారేజీ నిజానికి కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టు (Project)కు జీవనాడి అని, ఇక్కడ నష్టం వాటిల్లడం వల్ల నీటి పారుదలపై ప్రభావం పడుతుందని, మేడిగడ్డ (Medigadda) బ్యారేజీలో పిల్లర్లు కృంగిపోవడం నిజానికి తీవ్ర సమస్య అని, వాటి నాణ్యతపై అనుమానాలు లేవనెత్తుతున్నాయని ఆయన అన్నారు. నాణ్యత విషయంలో ప్రాజెక్టు (Project)పై అనుమానాలు లేవనెత్తారు. ప్రజాధనాన్ని దోచుకోవడమే ఏకైక లక్ష్యంగా దీన్ని నిర్మించారని..ఈ యాంటీ గ్రావిటీ ప్రాజెక్ట్ (Project) డిజైన్ (design) నిజంగా లోపాలతో కూడుకున్నదని, ఇంజనీర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేసినా, వాటిని పక్కన పెట్టి కేసీఆర్ (KCR) స్వయంగా ఈ ప్రాజెక్టు (Project) విషయంలో జోక్యం చేసుకొని, రూపొందించారని.. మరొకసారి గుర్తు చేశారు కిషన్ రెడ్డి (Kishan Reddy).

ఈ ప్రాజెక్టు (Project)ను ఏటీడబ్ల్యూ (ఎనీ టైమ్ వాటర్)గా కాకుండా కేసీఆర్ (KCR) కుటుంబానికి ఏటీఎం (ఎనీ టైమ్ మనీ)గా మార్చుకున్నారని.. వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు (Project) వృథాగా పోయిందని, దానిని తీవ్రమైన నేరంగా పరిగణించాలన్నారు బిజెపి (BJP) నాయకులు. నేరాన్ని కప్పిపుచ్చడానికి, సైట్‌ను సందర్శించడానికి ప్రజలను తీసుకెళ్లే పర్యాటక ప్రదేశంగా మార్చారని ఆరోపణ చేశారు. ఇది కాకుండా పూర్తిగా అప్పులు చేసి నిర్మించడం మరో పెద్ద నేరం అన్నారు. 15 నుంచి 21 వరకు ఉన్న పిల్లర్లు ప్రస్తుతం మునిగిపోయాయి. ఈ ఘటనపై ప్రజలే అధికారులకు ఫిర్యాదు చేశారని, బిజెపి (BJP) అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. 

ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు ఉపయోగం ఏమిటి?: 

జూన్ 21, 2019న బ్యారేజ్ (barrage) ప్రారంభించిన తర్వాత గత నాలుగేళ్లలో 154 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేసినట్లు వెల్లడించారు. మల్లన్నసాగర్, కొండపోచంపల్లి వంటి కొన్ని రిజర్వాయర్లలో నీటిని నింపి ప్రజలకు సీఎం ఫోటోలు చూపించారని.. పర్యాటక కేంద్రాలుగా పనిచేయడమే తప్ప నీటిపారుదల అవసరాలకు ఉపయోగపడలేదని.. కిషన్ రెడ్డి (Kishan Reddy) వాపోయారు 18.25 లక్షల ఎకరాలకు సాగునీరందించాల్సిన ఈ ప్రాజెక్టు (Project) వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు. కేవలం 57 వేల ఎకరాలకే సాగునీరు అందింది అంటూ మరొకసారి గుర్తు చేశారు కిషన్ రెడ్డి (Kishan Reddy).

గ్రావిటీతో ప్రవహించే నీటితో ఒకే చోట లిఫ్ట్ ఉండేలా ప్రాణహిత-చేవెళ్ల డిజైన్ (design)‌ను రూపొందించారు. రుణాలు పొంది ప్రజలను మోసం చేయడానికి ఈ ప్రాజెక్ట్ (Project) ఉపయోగించుకున్నారని.. దాని రూపకల్పన తప్పుగా ఉన్నందున ఇది చారిత్రక తప్పిదం అంటూ కేసీఆర్ (KCR) ప్రభుత్వం మీద మండిపడ్డారు బిజెపి (BJP) నాయకులు. అంతేకాకుండా తమ జేబులను నింపుకోవడానికి, ప్రాజెక్ట్ (Project) వ్యయాన్ని రూ.30,000 కోట్ల నుంచి రూ.1,30,000 కోట్లకు పెంచారని.. ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (Project) ఒక ఫ్రాడ్ అంటూ బిజెపి (BJP) అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) వాపోయారు.