కిడ్నాప్ కేసుని 24 గంటల్లో ఛేదించిన తెలంగాణ పోలీసులు

నాలుగు సంవత్సరాలు అమ్మాయిని పోలీసులు వాళ్ల తల్లిదండ్రులకు 24 గంటల్లో అప్పగించారు. స్థానికుల సహాయంతో పోలీసులు ఈ కేసును చేధించారు.  సికింద్రాబాద్ లో దొరికిన నిందితుడు: పాప కిడ్నాప్ అయిన 24 గంటల్లోనే కేసుని పోలీసులు సాల్వ్ చేశారు. హైదరాబాద్ కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాజీపేటలో నిందితుడు పోలీసులకు దొరికాడు. కొంతమంది స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం అమ్మాయిని సురేష్ ఏ కిడ్నాప్ చేశాడని పోలీసుల అనుమానించారు. పోలీసులకు ఈ కేస్ పెద్ద తలనొప్పి […]

Share:

నాలుగు సంవత్సరాలు అమ్మాయిని పోలీసులు వాళ్ల తల్లిదండ్రులకు 24 గంటల్లో అప్పగించారు. స్థానికుల సహాయంతో పోలీసులు ఈ కేసును చేధించారు. 

సికింద్రాబాద్ లో దొరికిన నిందితుడు:

పాప కిడ్నాప్ అయిన 24 గంటల్లోనే కేసుని పోలీసులు సాల్వ్ చేశారు. హైదరాబాద్ కి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాజీపేటలో నిందితుడు పోలీసులకు దొరికాడు. కొంతమంది స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం అమ్మాయిని సురేష్ ఏ కిడ్నాప్ చేశాడని పోలీసుల అనుమానించారు. పోలీసులకు ఈ కేస్ పెద్ద తలనొప్పి క్రియేట్ చేసింది ఎందుకంటే దగ్గర్లో సీసీటీవీ కెమెరాలు కూడా లేవు. పాపని కిడ్నాప్ చేసిన పర్సన్ దగ్గర ఫోన్ కూడా లేదు. రాత్రంతా కష్టపడి స్థానికుల సహాయంతో ఈ కేసుని సాల్వ్ చేసామని రాచకొండ కమిషనర్ డీఎస్ చౌహన్ తెలిపారు.  స్థానికులు రైల్వే స్టేషన్లో సమాచారం సేకరించి సురేష్ కాజిపేట్ వెళ్లాడని తెలుసుకున్నారు. 

వాళ్ళు ఇచ్చిన సమాచారంతో తను కాజీపేటా నుంచి సికింద్రాబాద్ వస్తుండగా అరెస్ట్ చేశారు. అమ్మాయిని సేఫ్ గా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు. ఇలా అప్పగించినందుకు తమకు ఆనందంగా ఉందని చౌహాన్ వెల్లడించాడు. 

పాపను ఎందుకు కిడ్నాప్ చేసాడో వివరాలు తెలియలేదు. నిందితుడు పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఇంకా పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయి. 

పెరుగుతున్న నేరాలు కారణాలేంటి?:

ఈ మధ్యకాలంలో నేరాలు బాగా పెరిగాయి. చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళను కూడా కిడ్నాప్ చేయడం ఎక్కువైంది. అసలు ఇలా జరగకూడదంటే  మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఆ పిల్లల మీద ఎవరైనా నిఘా వేస్తున్నారా అని గమనించుకోవాలి. ఎవరి మీద అయినా అనుమానం వస్తే వెంటనే మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా చేస్తే కనీసం కొంతవరకైనా మనం పిల్లల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం.  మన పిల్లల్ని కొత్త వ్యక్తుల దగ్గరికి వెళ్ళనివ్వకూడదు. ఇంకా కొత్త వ్యక్తులు ఏమైనా ఇస్తే తీసుకోవద్దని ముందే నేర్పాలి. వాళ్లకి సొసైటీ లో ఎలాంటి వాళ్ళు ఉంటారో చెప్పాలి. అలా చెప్పడం వల్ల వాళ్ళు తగిన జాగ్రత్తలో ఉంటారు. ఇంకా చిన్న పిల్లలను బయట ఆడుకోవడానికి పంపకూడదు. ఒకవేళ ఆడుకుంటామని మారాం చేసినా మనం తగు జాగ్రత్తలతో వాళ్ళని బయటకు తీసుకువెళ్లి ఆడించాలి. కాస్త వయసు వచ్చాక వాళ్లకు తగు జాగ్రత్తలు చెప్పి బయటకు పంపించాలి. ఇలా చేయడం వల్ల వాళ్లకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా దగ్గర వాళ్లే ఎక్కువగా ఇలాంటివి చేస్తున్నారు. అందుకే ఎవరిని నమ్మకుండా జాగ్రత్తలో మనం ఉండాలి. మనం ఇలా ఉండడం వల్ల మనవాళ్లు సేఫ్ గా ఉంటారు. ఈ హైదరాబాద్ ఘటనలో జరిగింది ఇదే దగ్గరివాడై అని వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల తను ఇలా చేయగలిగాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే నేరస్తులను కఠినంగా శిక్షించాలి. ముఖ్యంగా పోలీసులు అంటే నేరస్తులకు ఒక రకమైన భయం కలిగేలా చేయాలి. అప్పుడు నేరాలు చాలా వరకు తగ్గుతాయి. నేరాలు తగ్గితే మన రాష్ట్రం అన్ని విషయాల్లో ముందుకు వెళ్తుంది. పోలీసులు ఈ విషయాల మీద దృష్టి సారించి నేరాలను తగ్గిస్తారని ఆశిద్దాం. నేరాలు తగ్గాక మనందరం హ్యాపీగా ఉండొచ్చు.