కేరళలో రికార్డ్ స్థాయిలో లిక్కర్ అమ్మకాలు

కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం ఓనం సంబరాలు అంబరాన అంటుతున్నాయి. ఈ మేరకు పది రోజుల్లోనే లిక్కర్ అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు కేరళ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ వెల్లడించింది. అంతేకాకుండా గత పది రోజుల్లోనే లిక్కర్ అమ్మకాలు రూ.759 కోట్లు జరిగినట్లు సమాచారం. అంటే ఇటీవల ఇస్రో పంపించిన చంద్రయాన్-3 మిషన్ బడ్జెట్ కన్నా రూ.159 కోట్లు ఎక్కువ అన్నమాట.  లాభాలలో కేరళ లిక్కర్ వ్యాపారం:  గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లిక్కర్ అమ్మకాలు 8.5% పెరిగినట్లు […]

Share:

కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం ఓనం సంబరాలు అంబరాన అంటుతున్నాయి. ఈ మేరకు పది రోజుల్లోనే లిక్కర్ అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు కేరళ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ వెల్లడించింది. అంతేకాకుండా గత పది రోజుల్లోనే లిక్కర్ అమ్మకాలు రూ.759 కోట్లు జరిగినట్లు సమాచారం. అంటే ఇటీవల ఇస్రో పంపించిన చంద్రయాన్-3 మిషన్ బడ్జెట్ కన్నా రూ.159 కోట్లు ఎక్కువ అన్నమాట. 

లాభాలలో కేరళ లిక్కర్ వ్యాపారం: 

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది లిక్కర్ అమ్మకాలు 8.5% పెరిగినట్లు సమాచారం. ఓనం సందర్భంగా కేరళలోని లిక్కర్ వ్యాపారులు సంబరాలు జరుపుకుంటున్న వైనం కనిపిస్తుంది. కేరళ ప్రముఖ పండుగ ఓనం సందర్భంగా, గత పది రోజులలో సుమారు రూ.759 కోట్ల లిక్కర్ కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే ఇంత మొత్తంలో కొనుగోళ్లు జరగడం ఇదే మొదటిసారి అని వెల్లడించింది కేరళ స్టేట్ బేవరేజ్ కోపరేషన్. 

అయితే లిక్కర్ కొనుగోలులో అత్యధికంగా కేరళలో పాపులర్ బ్రాండ్ గా ఉన్న జవాన్ ఎక్కువగా అమ్ముడుపోయినట్లు వెల్లడించింది. కేవలం పది రోజులు వ్యవధిలోనే 70,000 కేసుల సరుకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అయితే అత్యధికంగా తిరువూరు మల్లాపురంలో ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు, తరువాత రెండో స్థానంలో అత్యధికంగా త్రిసూర్ జిల్లాలో ఇరింజలకూడా ఊరిలో అమ్మకాలు జరిగినట్లు సమాచారం. ఇరింజలకూడా ఊరిలో ఒక్క రోజులోనే కోటిన్నర అమ్మకాలు జరిగాయి. కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభంలో, కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి, లిక్కర్ కొనుగోలు కొంతవరకు ఉపశమనం కలిగించింది.

అతి తక్కువ చంద్రయాన్-3 బడ్జెట్: 

గత పది రోజుల్లోనే కేరళ రాష్ట్రంలోని లిక్కర్ అమ్మకాలు రూ.759 కోట్లు జరిగినట్లు సమాచారం. అంటే ఇటీవల ఇస్రో పంపించిన చంద్రయాన్-3 మిషన్ బడ్జెట్ కన్నా రూ.159 కోట్లు ఎక్కువ అన్నమాట. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం ఇస్రో శాస్త్రవేత్తల చేత తయారు చేయబడిన చంద్రయాన్-3 బడ్జెట్ చాలా తక్కువ అంటూ ప్రస్తావించారు మాజీ ఇస్రో చీఫ్ మాధవన్. ఇంకా చెప్పాలంటే మునుపు తయారు చేసిన చంద్రయాన్-2 బడ్జెట్ విషయానికి వస్తే సుమారు 978 కోట్లు ఖర్చు అయిందని, మరి ఇక చంద్రయాన్-3 విషయానికి వస్తే కేవలం 620 కోట్లు ఖర్చు అయినట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో ప్రపంచ దేశం గర్వించదగ్గ మిషన్ తయారు చేశారు అంటూ భారతదేశ శాస్త్రవేత్తలను మెచ్చుకున్నారు మాజీ ఇస్రో చీఫ్. 

ఇంకా చెప్పాలంటే, మన దేశ శాస్త్రవేత్తలు ఎప్పుడూ కూడా తమ శాలరీలు గురించి ఆలోచించలేదు అని, తాము ఎప్పుడూ కూడా తమకి వచ్చిన దానితోనే సంతృప్తి చెందారని, వారి శాలరీలు గురించి ఎప్పుడూ ఆలోచించకుండా ఇస్రో గురించి పని చేయడం శాస్త్రవేత్తల గొప్పతనం అని ఆయన మరొకసారి గుర్తు చేశారు. భారతదేశంలో శాస్త్రవేత్తలకు వచ్చే శాలరీ ఇతర దేశాల శాస్త్రవేత్తల శాలరీతో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ అని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా లో బడ్జెట్ మిషన్ తయారీలో తమ శాస్త్రవేత్తలు అన్ని దేశాల కన్నా ముందు ఉన్నారని ప్రస్తావించారు. ప్రపంచ దేశాల్లో ధనిక శాస్త్రవేత్త, ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్ చంద్రయాన్-3 బడ్జెట్ విన్న తర్వాత షాక్ అయినట్లు, తాము తయారు చేసిన క్రిస్టోఫర్ నొలాన్ ఇంటర్ స్టెల్లర్ తయారీ విషయంలో సుమారు 13,000 కోట్లు ఖర్చయినట్లు తాను చేసిన పోస్టులో ఎలోన్ మస్క్ వెల్లడించాడు.