పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం

ప్రజలకి రక్షణ గా ఉండి వారికీ న్యాయం చేయాల్సిన పోలీస్ వారు ప్రజలని మోసం చేస్తూ వారికీ మరింత భయంని కలుగుచేస్తున్న సంఘటనలను ఇది వరకు చాలానే చూసాము.  ఇప్పుడు  ప్రజలకి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అంటే న్యాయం జరగడం పక్కన పెట్టి వారిని ఇబ్బంది పెడతారు అనే భయంతో పోలీస్ వాళ్ళ దగ్గరకి వెళ్ళాలి అంటేనే భయపడుతున్నారు. అయితే అక్షరాస్యతలో, టూరిజంలో ప్రధమ స్థానంలో ఉన్న కేరళ రాష్ట్రం లో ఇటీవల కాలంలో జరిగిన […]

Share:

ప్రజలకి రక్షణ గా ఉండి వారికీ న్యాయం చేయాల్సిన పోలీస్ వారు ప్రజలని మోసం చేస్తూ వారికీ మరింత భయంని కలుగుచేస్తున్న సంఘటనలను ఇది వరకు చాలానే చూసాము.  ఇప్పుడు  ప్రజలకి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి అంటే న్యాయం జరగడం పక్కన పెట్టి వారిని ఇబ్బంది పెడతారు అనే భయంతో పోలీస్ వాళ్ళ దగ్గరకి వెళ్ళాలి అంటేనే భయపడుతున్నారు. అయితే అక్షరాస్యతలో, టూరిజంలో ప్రధమ స్థానంలో ఉన్న కేరళ రాష్ట్రం లో ఇటీవల కాలంలో జరిగిన ఒక సంఘటన అందరిని భయబ్రాంతులకు గురిచేసింది. ప్రేమ ,పెళ్లి పేరుతో తన ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి శారీరకంగా వాడుకుని తనని మోసం చేసాడు అని ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మీద మహిళా చేసిన పిర్యాదు పోలీస్ శాఖ వారికీ కనువిప్పు కలిగేలా ఉంది. 

కేరళ లోని కుట్టిపురం అనే పోలీస్ స్టేషన్ లో క్రైమ్ బ్రాంచ్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేసిన ప్రమోద్ మీద ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసారు. ప్రమోద్ గత ఏడాది ప్రమోషన్ లో భాగంగా త్రిసూర్ కి క్రైమ్ బ్రాంచ్ లో ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్నారు, కానీ తాను కుట్టిపురంలో పని చేస్తున్న సమయంలో తన మీద ప్రేమ ఉంది అని మోసం చేసి పలు మార్లు అత్యాచారానికి పాల్పడడ్దు అని సదరు మహిళా తన కంప్లైంట్ లో తెలియచేసారు.. ఇక ఇదే విషయమై డీఎస్పీ అయినా బెన్నీ వెల్లప్పల్లిల్ మాట్లాడుతూ.. తమకి రెండు రోజుల క్రితమే ప్రమోద్ మీద పిర్యాదు వచ్చింది అని పూర్తి స్థాయి లో విచారణ కి అనుమతి తీసుకుని, త్వరలోనే నిందితుడి మీద సరైన యాక్షన్ తీసుకుంటాము అని వెల్లడించారు.

ఇక పిర్యాదు ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన సదరు బాధితురాలు.. ప్రమోద్ కుట్టిపురం లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో తనకి పరిచయం అయ్యారు అని, నాకు ఉన్న సమస్యలను ఆయనకు చెప్పి క్లియర్ చేయమని అడిగితే మొదట తన కోరికను తీర్చాలని అడిగారు అని, ఆ తర్వాత తనకి ఎప్పుడు కలవాలి అని అంటే అప్పుడు నన్ను శారీరకంగా వాడుకున్నారు అని ఆమె  చెప్పారు. నేను బయట చెప్తాను అని చెప్తే నువ్వు అంటే ఇష్టం, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసి పలు మార్లు నా మీద అత్యాచారం చేసారు అని బోరున విలపించింది.

క్రైమ్ బ్రాంచ్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న సమయం లోనే ప్రమోద్ మీద పలువురు మహిళలు ఇది వరకే కొన్ని పిర్యాదులు ఇచ్చినట్లు ప్రాధమిక విచారణలో తెలిసింది అన్నారు. కుట్టిపురం లో పని చేసి గత సంవత్సరం త్రిసూర్ కు ప్రమోషన్ మీద బదిలీ అయినా తర్వాత ఆయన మీద వాయనాడ్ ,కుట్టిపురం ,పయ్యనూర్ ఇంకా మరి కొన్ని ప్రాంతాలలో ఉన్న కొంతమంది నిందితులు మహిళా పైన దాడి చేసినట్లు అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ లో ఉన్న మరొక అధికారి తెలియచేసారు. అయితే ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా ఇంతవరకు నిందితులని అరెస్ట్ చేయకపోవడం వెనుక ఏమైనా రాజకీయా కోణం ఉందా అనే వాదనలు కూడా తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పోలీస్ వారు తగు చర్యలు తీసుకోవాలి.