క్ష‌మించు తల్లీ: బాలిక‌కు కేర‌ళ పోలీసుల క్ష‌మాప‌ణ‌

దేశంలో బాలికలపై రోజు రోజుకీ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, పసి పిల్లలు అని కూడా చూడకుండా కీచకులు అమాయకులైన బాలికలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. కేరళ రాష్ట్రంలో అయిదేళ్ల బాలిక పై లైంగిక దాడి జరగడం అందరినీ దిగ్భ్రాంతి కి గురి చేసింది. కేరళ రాష్ట్రంలోనీ ఎర్నాకులం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఐదు సంవత్సరాల బాలికను అపహరించిన ఒక వ్యక్తి బాలికపై అఘాయిత్యం చేసి దారుణంగా చంపేశాడు.  కొద్ది రోజుల క్రితమే ఆ వ్యక్తి బాలిక నివసిస్తున్న అపార్ట్మెంట్ […]

Share:

దేశంలో బాలికలపై రోజు రోజుకీ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, పసి పిల్లలు అని కూడా చూడకుండా కీచకులు అమాయకులైన బాలికలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు. కేరళ రాష్ట్రంలో అయిదేళ్ల బాలిక పై లైంగిక దాడి జరగడం అందరినీ దిగ్భ్రాంతి కి గురి చేసింది. కేరళ రాష్ట్రంలోనీ ఎర్నాకులం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఐదు సంవత్సరాల బాలికను అపహరించిన ఒక వ్యక్తి బాలికపై అఘాయిత్యం చేసి దారుణంగా చంపేశాడు. 

కొద్ది రోజుల క్రితమే ఆ వ్యక్తి బాలిక నివసిస్తున్న అపార్ట్మెంట్ లోకి వచ్చినట్టు తెలిసింది. తప్పి పోయిన బాలిక కోసం కేరళ పోలీసులు అన్ని దిశలలో గాలించారు. ఆ రాత్రికి ఎర్నాకులం డంప్ సైట్ లో బాలిక మృతదేహం లభ్యం అయ్యింది. ఈ ఘటన పై పోలీసులు విచారం వ్యక్తం చేస్తూ “బాలికను ప్రాణాలతో తల్లి తండ్రులు దగ్గరకు తీసుకుని రావడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు, బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశాం” అని తెలిపారు. 

బాలికను కాపాడలేక పోయిన పోలీసు అధికారులు విచారం వ్యక్తం చేస్తూ ” సారీ డాటర్ ( Sorry Daughter) ” అని ట్వీట్ చేశారు.  ఈ ఘటన పై విపక్షాలు మండి పడ్డాయి, పోలీసులు వెంటనే స్పందించక పోవడం వల్లనే బాలిక చనిపోయింది అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. సోషల్ మీడియాలో కూడా అలజడి చెలరేగింది. 

వెంటనే స్పందించక పోవడం వల్లనే బాలిక చనిపోయింది అనే ఆరోపణలను కేరళ పోలీసులు ఖండించారు. మధ్యాహ్నం 3 గంటలకు బాలిక కనిపించకుండా పోయింది, సాయంత్రం 5:30 గంటలకు ఆమెపై లైంగిక దాడి చేసి హతమార్చారు. రాత్రి 7:10 గంటలకు బాలిక అదృశ్యం గురించి తల్లి తండ్రులు ఫిర్యాదు చేశారు, రాత్రి 8 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. నిందితుడిని రాత్రి 9:30 గంటలకు అరెస్ట్ చేసాము అరెస్ట్ చేసిన సమయంలో అతను ఏ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేని అంతగా మద్యం మత్తులో ఉన్నాడు. అయినా పోలీసులు ఆలస్యం చేస్తున్నారు అని ఆరోపించడం దురదృష్టకరం అని పోలీసు అధికారులు( Kerala Police) అన్నారు. 

నిందితులు బాలికను కిడ్నాప్ చేశారు అని తెలిసినా కూడా చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలం అయ్యారు అని ప్రతిపక్ష నేత వీడి సతీషన్ అసెంబ్లీలో వ్యాఖ్యానించారు. బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలి అని కేరళ కాంగ్రెస్ చీఫ్ కె. సుధాకరన్ విజ్ఞప్తి చేశారు. 

నిందితుడిని తీవ్రంగా శిక్షించాలి అని నిర్భయ చట్టం కింద అతనికి ఉరిశిక్ష విధించాలని సోషల్ మీడియాలో పలువురు ట్వీట్ చేస్తున్నారు. కఠినమైన శిక్ష అమలు పరచక పోవడం వల్లనే దేశంలో ఆడవారిపై అఘాయిత్యాలు రోజురోజుకి పెచ్చరిల్లిపోతున్నాయి అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి పై కఠిన చర్యలు తీసుకోవాలి అని ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేశాయి, బాలిక తల్లి తండ్రులకు అండగా ఉంటాం అని పోలీసులు, విపక్షాలు తెలిపారు.

బాలిక త‌ల్లిదండ్రుల స్వ‌స్థ‌లం బిహార్ అని బ‌తుకుతెరువు కోసం కేర‌ళ వ‌చ్చార‌ని పోలీసులు తెలిపారు. బాలిక‌పై అత్యాచారం చేసిన వ్య‌క్తి కూడా బిహార్‌కు చెందిన‌వాడే. బాలిక త‌ల్లిదండ్రులు ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే మొద‌టి అంత‌స్థులో ఉంటున్నాడు. ఎప్ప‌టినుంచో బాలికపై క‌న్నేసాడు. ఎప్పుడు ఒంట‌రిగా దొరుకుతుందా అని ఎదురుచూస్తుండేవాడు. అలా ఆ నీచుడికి ముక్కుప‌చ్చ‌లార‌ని పిల్ల బ‌లైపోయింద‌ని పోలీసులు ఆవేదన వ్య‌క్తం చేసారు.