ఢిల్లీ వరదలకి కారణం కేజ్రీవాల్: గౌతమ్ గంభీర్

గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, ఢిల్లీలో వరదలు రావడం చూస్తుంటే తనకి ఆశ్చర్యంగా అనిపించట్లేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గత తొమ్మిది సంవత్సరాలుగా ఢిల్లీ ముఖ్య మంత్రి ఢిల్లీ కోసం కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అన్నారు. ఢిల్లీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కేజ్రివాల్ అసలు శ్రద్ధ చూపలేదని, కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని, అందుకే ఇప్పుడు ఢిల్లీకి వరదలు వచ్చినప్పటికీ తనికి ఆశ్చర్యంగా అనిపించట్లేదని, ఢిల్లీ ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేశారు గౌతమ్ గంభీర్.  […]

Share:

గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, ఢిల్లీలో వరదలు రావడం చూస్తుంటే తనకి ఆశ్చర్యంగా అనిపించట్లేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గత తొమ్మిది సంవత్సరాలుగా ఢిల్లీ ముఖ్య మంత్రి ఢిల్లీ కోసం కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అన్నారు. ఢిల్లీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కేజ్రివాల్ అసలు శ్రద్ధ చూపలేదని, కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని, అందుకే ఇప్పుడు ఢిల్లీకి వరదలు వచ్చినప్పటికీ తనికి ఆశ్చర్యంగా అనిపించట్లేదని, ఢిల్లీ ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేశారు గౌతమ్ గంభీర్. 

గౌతమ్ గంభీర్ ఆరోపణలు: 

ఢిల్లీలో కేజ్రివాల్ పాలనలో ఢిల్లీకి అన్యాయం జరిగిందని ఆరోపించారు గౌతమ్ గంభీర్. అంతేకాకుండా ఢిల్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఢిల్లీ ముఖ్యమంత్రి కనీసం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఎత్తిచూపారు. అందుకాకుండా, ఢిల్లీకి వరదలు రావడానికి కేజ్రీవాల్ కారణం అని, ఇంఫ్రాస్ట్రక్చర్ బాగుంటే ఇలాంటి వరదలు వచ్చేవి కావు అని అన్నారు గౌతమ్ గంభీర్. ఇప్పుడు ఢిల్లీకి వరదలు వచ్చినప్పటికీ తనికి అందుకే ఆశ్చర్యంగా అనిపించట్లేదని పరోక్షంగా కేజ్రివాల్ మీద ఆరోపణలు చేశారు గౌతమ్. 

హర్యానా పై ఆరోపణలు: 

ఒకపక్క గౌతమ్ గంభీర్ ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తూ ఉంటే, మరోవైపు హర్యానా ప్రభుత్వం చేత బిజెపి కావాలని వరద నీటిని ఢిల్లీ వరకు మళ్ళీస్తుందని, ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. కావాలనే హత్నికున్ద్  బారేజీ ద్వారా నీటిని ఢిల్లీ వైపుకి మల్లిస్తుందని, హర్యానా మీద ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. మరో పక్క కొంతమంది అధికారులు, ఢిల్లీలో వర్షాలు లేనప్పటికీ వరదలు రావడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు సమానంగా నీటిని విడుదల చేసినట్లయితే ఇప్పుడు ఢిల్లీ పరిస్థితి ఇలా ఉండేది కాదు అని మరి కొంతమంది ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండగా కేజీ ఇవ్వాల్ చేసిన ఆరోపణలను హర్యానా కొట్టివేసింది. అంతేకాకుండా, తమ మీద ఇలాంటి ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని మందలించింది. ఇలాంటి ఆరోపణలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని పేర్కొంది. అంతేకాకుండా బ్యారేజీ లోకి వచ్చిన లక్ష క్యూసెక్కుల నీళ్లు ఇతర ప్రాంతాలకు మళ్లీంచేందుకు వీలు పడదు అని హర్యానా తన ప్రభుత్వాన్ని తోసుకొచ్చింది. 

ఢిల్లీ వరద పరిస్థితి: 

యమునా నది పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక మందిని ఇప్పటికే ఖాళీ చేయించింది. ఎక్కడ చూసినా రికార్డ్ స్థాయిలో నీరు ప్రవహిస్తూ కనిపిస్తుంది ఇళ్లల్లోకి, మెడికల్ షాపుల్లోకి, రోడ్లమీద ఎక్కడబడితే అక్కడ తలదాచుకోడానికి కూడా చోటు లేకుండా ప్రజలను ఇబ్బంది పెడుతోంది. 

అధికారులు జూలై 16 వరకు అన్ని స్కూళ్లకు మరియు కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా అనవసరమైన సేవలలో ఉన్న భారీ గూడ్స్ వాహనాల ప్రవేశాన్ని నిషేధించారు.యమునా నది నీటి మట్టం పెరగడం వల్ల వజీరాబాద్, చంద్రవాల్ మరియు ఓఖ్లా అనే మూడు వాటర్ ప్లాంట్స్ మూసి వేయడం జరిగింది. . దీని కారణంగా ఢిల్లీ ప్రభుత్వం నీటి సరఫరాను 25 శాతం తగ్గించాలని నిర్ణయించడంతో ఢిల్లీలో ప్రస్తుతం తాగునీటి కొరతను ఏర్పడింది. 

ఎక్కువ అవుతున్న వరదలు: 

ఏది ఏమైనప్పటికీ అకాల వర్షాలు, అధిక వర్షాలు ప్రస్తుత కాలంలో ఎక్కువ అయ్యాయని చెప్పుకోవాలి. దీనంతటికీ కారణం కేవలం పెరుగుతున్న కాలుష్యమే కారణం. అధిక వర్షాలు వచ్చినప్పుడు, వరదలు ముప్పు పొంచి ఉన్నప్పుడు తీసుకునే జాగ్రత్తలు వర్షాలు పడక ముందు కాలుష్యం తగ్గించే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని అంటున్నారు పబ్లిక్.