కేరళలో క్రైస్తవ మత పెద్దలతో మోదీ భేటీ

ఉత్తర భారతదేశంలో వరుస ఎన్నికల్లో విజయాలు సాధించిన భారతీయ జనతా పార్టీ దక్షిణంలో సత్తా చాటేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచిస్తోంది. త్వరలో కర్ణాటకలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని రకాలుగా పనులను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా సోమవారం కొచ్చిలో 8 మంది క్రైస్తవ మత పెద్దలతో నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అన్ని మతల యెక్క విశ్వాసాలను పరిరక్షిస్తామని, క్రైస్తవులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లు […]

Share:

ఉత్తర భారతదేశంలో వరుస ఎన్నికల్లో విజయాలు సాధించిన భారతీయ జనతా పార్టీ దక్షిణంలో సత్తా చాటేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచిస్తోంది. త్వరలో కర్ణాటకలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని రకాలుగా పనులను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా సోమవారం కొచ్చిలో 8 మంది క్రైస్తవ మత పెద్దలతో నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అన్ని మతల యెక్క విశ్వాసాలను పరిరక్షిస్తామని, క్రైస్తవులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చినట్లు తెలుస్తొంది.

ఇదిలా ఉండగా కేరళ రాష్ట్రంలోని మైనారిటీ వర్గాల నుంచి మరింత మద్దతును పొందేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోంది. కేరళలో భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో సత్తా చాటాలని భావిస్తోంది.ఇందులో భాగంగానే క్రైస్తవ మత పెద్దలతో ప్రధాని మోదీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. మార్తోమా, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా మినహా రాష్ట్రంలోని దాదాపు 90 శాతం క్రైస్తవ సమాజాన్ని కవర్ చేసే చర్చిలోని అన్ని తెగల ప్రతినిధులు, ప్రధాని మంత్రి మోదీతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. CSI చర్చి దాని నాయకులకు సంబంధించిన కొన్ని ఆర్థిక విషయాల కారణంగా సమావేశానికి ఆహ్వానం అందుకోలేదు. అయితే మార్తోమా చర్చి నిర్వాహకులు ప్రారంభంలో అంగికారం తెలిపినా, ఆ తర్వాత తెలియని కారణాల వల్ల ఆహ్వానాన్ని తిరస్కరించారు. మత మార్పిడి విషయాల్లో సంఘ్ పరివార్‌తో ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందున పెంటెకోస్టల్ చర్చిలను కూడా ఆహ్వానించలేదు.

కాగా ప్రధాని మోదీ, క్రైస్తవ మత పెద్దలతో సమావేశం కావడం ఇదే మొదటిసారి. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ కెఎస్ రాధాకృష్ణన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన గత తొమ్మిది నెలలుగా చర్చిలతో కలిసి పనిచేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ కూడా ఈ సమావేశానికి హాజరైయ్యారు. కాగా కేరళ బీజేపీ నేతలు మాత్రం ఇది స్నేహపూర్వక సమావేశమని అన్నారు.

ప్రధానమంత్రి మోదీ స్వయంగా మత పెద్దలను కలవడం క్రైస్తవ సమాజానికి చేరువయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో రాష్ట్ర బీజేపీకి పెద్ద కలిసొస్తుందని అంటున్నారు. అదేవిధంగా కొచ్చిలో బీజేపీ యువజన విభాగం భారతీయ జనతా యువమోర్చా నిర్వహిస్తున్న ‘యువం’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ లక్ష మంది హవాయిలతో కూడా సంభాషించారు. మోదీ సోమ‌వారం కొచ్చిలోని వెందురుతి బ్రిడ్జి నుండి సేక్రేడ్ హార్ట్ కాలేజ్ తేవ‌ర వ‌ర‌కు 1.8 కిలోమీట‌ర్ల రోడ్‌షో కూడా నిర్వ‌హించారు. ఇందులో భాగంగా 2 వేల మంది పోలీసులతో యాత్రకు కేరళ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏప్రిల్ 25న కొచ్చిలో ఆసియాలోనే తొలి వాటర్ మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది కాకుండా తిరువనంతపురం మరియు కాసర్‌గోడ్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

అటు జాకోబైట్ చర్చి బిషప్ జోసెఫ్ మాట్లాడుతూ.. గోవా మరియు ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవ సమాజం బిజెపి అనుకూల వైఖరిని మోడీ హైలైట్ చేసారని, అయితే బిషప్‌లతో ప్రధాని సమావేశం కేరళలో పార్టీ ఓట్లను పొందగలదా అని అనుమానం వ్యక్తం చేశారు. “బిషప్‌ల ఆదేశానుసారం ప్రజలు ఓటు వేయరు. ప్రజలు తమ ఓటు వేసే ముందు ప్రభుత్వ పనితీరును అంచనా వేస్తారు. ప్రజలు జ్ఞానోదయం పొందారు. అయితే, సమావేశంలో మేము (అనేక) సమస్యలను లేవనెత్తవచ్చు, ”అని ఆయన అన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ రంగ సంక్షోభం, దళిత క్రైస్తవుల హక్కులు, తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధికి సంబంధించిన సమస్యలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.