Manifesto: బిఆర్ఎస్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి

ఇప్పటికే చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల జోరు మొదలైంది. నాయకులు తమ మేనిఫెస్టో (Manifesto) గురించి ప్రజలకు హామీ ఇస్తూ సన్నాహాలు జరిపిస్తున్నారు. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ (Telangana) మరియు మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ తేదీలు ఖరారు చేసింది. అయితే ఇటీవల తెలంగాణ (Telangana) బిఆర్ఎస్(BRS) చేసిన మేనిఫెస్టో (Manifesto) రిలీజ్ చేసిన తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కెసిఆర్.  BRS మేనిఫెస్టో, కెసిఆర్ ఇచ్చిన హామీలు: సౌభాగ్యలక్ష్మి […]

Share:

ఇప్పటికే చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల జోరు మొదలైంది. నాయకులు తమ మేనిఫెస్టో (Manifesto) గురించి ప్రజలకు హామీ ఇస్తూ సన్నాహాలు జరిపిస్తున్నారు. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ (Telangana) మరియు మిజోరం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ తేదీలు ఖరారు చేసింది. అయితే ఇటీవల తెలంగాణ (Telangana) బిఆర్ఎస్(BRS) చేసిన మేనిఫెస్టో (Manifesto) రిలీజ్ చేసిన తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి కెసిఆర్. 

BRS మేనిఫెస్టో, కెసిఆర్ ఇచ్చిన హామీలు:

సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా అర్హులైన నిరుపేద మహిళలందరికీ నెలకు 3000 అందజేయడం.

1. అన్ని అర్హత కలిగిన BPL కుటుంబాలకు 400 గ్యాస్ సిలిండర్.

2. ఆసరా పింఛన్లను 5000లకు పెంచడంతోపాటు వార్షిక పెంపుదల 500.

3. ఆరోగ్యశ్రీ భీమా పథకం కవరేజీని 15 లక్షలకు పెంచేందుకు కేసీఆర్ (KCR) ఆరోగ్య రక్ష పథకం.

4. రైతు బంధు పథకం ప్రారంభ పెంపు 11000తో ఎకరానికి సంవత్సరానికి 16000 పెంచబడుతుంది.

5. ప్రభుత్వం 100% ప్రీమియం చెల్లించి బీపీఎల్ కార్డుదారులందరికీ, 5 లక్షల బీమా పథకాన్ని అందజేస్తామని కేసీఆర్ (KCR) భీమా ప్రతి ఇంటికి ధీమా వ్యక్తం చేశారు.

6. గృహలక్ష్మి పథకం కింద హైదరాబాద్‌లో 1లక్ష, 2బిహెచ్‌కె ఇళ్లను నిర్మిస్తున్నారు.

7. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం 119 రెసిడెన్షియల్ పాఠశాలలు,

మైనారిటీ జూనియర్ కాలేజీలను రెసిడెన్షియల్ కాలేజీలుగా మార్చాలి.

8. మహిళా స్వశక్తి గ్రూపులకు సొంత భవనాలు.

9. వారిని రాష్ట్ర పిల్లలుగా అరిగినలోకి తీసుకుని తెలంగాణ (Telangana) ప్రభుత్వం అనాథ పిల్లల పథకాన్ని అమలు చేయడం.

10. అసైన్డ్ భూములపై ఆంక్షల తొలగింపు.

11. సీనియర్ అధికారుల కమిటీ ఏర్పాటుతో ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ నుంచి ఓపీఎస్ పెన్షన్లపై ప్రత్యేక రీసెర్చ్.

12. రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం అందించేందుకు తెలంగాణ (Telangana) అన్నపూర్ణ పథకం అమలు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ ఖరారు: 

తెలంగాణ (Telangana) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. మిజోరంలో నవంబర్ 7న, ఛత్తీస్‌గఢ్‌లో నవంబర్ 7న అంతేకాకుండా నవంబర్ 17న, మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23న రాజస్థాన్ ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది మరియు డిసెంబర్ 5 నాటికి పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మాత్రమే రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించనున్నారు. 

కేసీఆర్ (KCR) రాజకీయ ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 9 వరకు జరిగే 24 రోజుల పాటు సాగే 41 బహిరంగ సభల్లో బీఆర్‌ఎస్ చీఫ్ ప్రసంగించనున్నారు. బిఆర్ఎస్(BRS) చీఫ్ పార్టీ మేనిఫెస్టో (Manifesto) విడుదల కోసం ఆదివారాన్ని ఎంచుకోవడానికి, అదేవిధంగా రాబోయే తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల 2023 కోసం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి ఆదివారం తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాల ప్రారంభ సందర్భంగా, ఇది చాలా పవిత్రమైన దినము కాబట్టి, పనులు మొదలు పెట్టడం మంచిదని భావించింది పార్టీ. అంతేకాకుండా అక్టోబర్ 15వ తేదీని కలిపితే కేసీఆర్ (KCR) లక్కీ నెంబర్ ఆరు అవుతుంది.

తెలంగాణ పోలింగ్ వివరాలు: 

గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ – నవంబర్ 3

నామినేషన్ దాఖలుకు చివరి తేదీ – నవంబర్ 10

నామినేషన్ల పరిశీలన తేదీ – నవంబర్ 13

నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ – నవంబర్ 15

పోలింగ్ తేదీ – నవంబర్ 30

కౌంటింగ్ తేదీ – డిసెంబర్ 3