తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లు

అమ్మ అని పిలిపించుకోవడం కోసం ప్రతి స్త్రీ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది. గర్భధారణ సమయంలో మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీలు పోషకాహారం తీసుకోవాలి. పోషకాహార లోపం, ఎనీమియా కారణంగా ఎంతో మంది స్త్రీలు వారి మాతృత్వానికి దూరమవుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిత్యం కృషి చేస్తూనే ఉంది. గర్భిణీల్లో పోషకాహార లోపం, రక్తహీనత లేకుండా కాపాడేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. గత ఏడాది 9 జిల్లాలో […]

Share:

అమ్మ అని పిలిపించుకోవడం కోసం ప్రతి స్త్రీ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటుంది. గర్భధారణ సమయంలో మహిళలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీలు పోషకాహారం తీసుకోవాలి. పోషకాహార లోపం, ఎనీమియా కారణంగా ఎంతో మంది స్త్రీలు వారి మాతృత్వానికి దూరమవుతున్నారు. ఈ సమస్యను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిత్యం కృషి చేస్తూనే ఉంది. గర్భిణీల్లో పోషకాహార లోపం, రక్తహీనత లేకుండా కాపాడేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. గత ఏడాది 9 జిల్లాలో ప్రారంభించిన కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని ఈ ఏడాది అన్ని జిల్లాలకు విస్తరించింది. ఈ మేరకు తాజా బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయించింది. ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల మంది గర్భిణీలకు ప్రయోజనం కలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే మాతాశిశు మరణాల నివారణకు ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక కార్యక్రమాలను ఆచరణలోకి తీసుకువచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని విస్తరించి, అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రక్తహీనత ను అధిగమించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కార్యక్రమాన్ని ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 6.84 లక్షల మంది గర్భిణీలకు 1046 కేంద్రాల ద్వారా మొత్తంగా 13.08  లక్షల కిట్స్ పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఒక్కొక్కటి 2000 రూపాయలు. 

ఎనిమియా నివారణకు ప్రత్యేకంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని రూపొందించారు. గత ఏడాది డిసెంబర్ 21న ఆర్థిక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కామారెడ్డి వేదికగా కిట్స్ పంపిణీ చేశారు. మొదటి దశలో రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీల సంఖ్య ఎక్కువగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదిలాబాద్, భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్, భూపాలపల్లి, జోగులాంబ, గద్వాల్, కామారెడ్డి, కుంమరంభీం, అసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలో పంపిణీ ఏర్పాటు చేశారు. 13 నుంచి 27 వారాల మధ్య జరిగే   ఏఎన్.సి చెకప్ సమయంలో మొదటిసారి, 28 నుంచి 34 వారాల మధ్య చేసే మూడో ఏఎన్ సి చెకప్ సమయంలో రెండోసారి ఈ కిడ్నీ పంపిణీ చేస్తారు ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ ఐరన్ వంటి పోషకాలను అందించి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడమే ఈ కిట్ల ముఖ్య ఉద్దేశం. సానుకూల ఫలితాలు వస్తుండడంతో ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరింప చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

రక్తహీనత గర్భిణీల పాలిట శాపంగా మారకుండా ఉండేందుకు, ప్రసవానంతరం సమస్యలు రాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ను గర్భిణీలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. మాతృ, శిశు మరణాలను తగ్గించడంలో ఈ కిట్ గొప్ప వృద్ధిని నమోదు చేసింది.  మాతాశిశు సంరక్షణకు పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా మరో విప్లవాత్మకమైన పథకానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ ఇప్పటికే 9 జిల్లాల్లో అమలు అవుతుండగా, ఇప్పుడు ఆ కిట్స్ ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల్లో పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. గర్భిణీగా ఉన్నప్పుడు న్యూట్రిషన్ కిట్, బాలింతగా ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ లబ్ధిదారులకు వరంగా మారింది. మాతృ మరణాలు తగ్గించడంలో దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం మూడవ స్థానంలో నిలిచింది. ఈ మరణాల సంఖ్యను మరింత తగ్గించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పథకానికి రూపకల్పన చేశారు. ఈ న్యూట్రిషన్ కిట్స్ ప్రయోజనం పొందిన వారందరూ కూడా సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈ పథకం మిగతా రాష్ట్రాలలో కూడా రావాలని పలువురు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.