BRS అభ్యర్థుల జాబితాను ప్రకటించిన కేసీఆర్

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, BRS తమ అభ్యర్థులను ఎన్నుకోవడంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నట్లే తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 నియోజకవర్గాల భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను సోమవారం ప్రకటించడం జరిగింది. ఇంకో నాలుగు స్థానాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, అభ్యర్థుల మొదట జాబితాలో పెద్దగా మార్పులు చేయలేనట్టు వెల్లడించింది. కేవలం ఏడు స్థానాల అభ్యర్థులకు సంబంధించిన మార్పు ప్రకటించింది. తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు కామారెడ్డి […]

Share:

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, BRS తమ అభ్యర్థులను ఎన్నుకోవడంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నట్లే తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 నియోజకవర్గాల భారత రాష్ట్ర సమితి అభ్యర్థులను సోమవారం ప్రకటించడం జరిగింది. ఇంకో నాలుగు స్థానాల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, అభ్యర్థుల మొదట జాబితాలో పెద్దగా మార్పులు చేయలేనట్టు వెల్లడించింది. కేవలం ఏడు స్థానాల అభ్యర్థులకు సంబంధించిన మార్పు ప్రకటించింది. తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌తో పాటు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనున్నారు.

అభ్యర్థుల జాబితా ప్రకటన: 

అయితే నాగపంచమి తిది సందర్భంగా అభ్యర్థుల లిస్ట్ ప్రకటించడం జరిగిందని చెప్పుకోవాలి. 2009లో గెలుపొందిన కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్వయంగా, కామారెడ్డి నుంచి పోటీ చేయాల్సిందిగా అభ్యర్థించినట్లు కేసీఆర్ సోమవారం తెలిపారు. నిజామాబాద్‌తోపాటు మరికొన్ని జిల్లాల నుంచి కూడా ఇలాంటి అభ్యర్థనలు వచ్చాయని, అయితే చివరకు కామారెడ్డిని ఎంచుకున్నారని సీఎం చెప్పడం జరిగింది. అక్టోబర్ 16న వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు సీఎం తెలిపారు. నాంపల్లి, నర్సాపూర్, గోషామహల్, జనగాం నాలుగు నియోజకవర్గాల అభ్యర్థులను పెండింగ్‌లో ఉంచామని, తర్వాత ప్రకటిస్తామన్నారు.

ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధించి 95 నుంచి 105 స్థానాల్లో విజయం సాధిస్తుందని తమ వైపు నుంచి ధీమా వ్యక్తం చేశారు. తేదీలు ఇంకా ప్రకటించలేదు కానీ డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలు ఎదుర్కొన్న చిక్కులను ముఖ్యంగా దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తులో తమకు ఎలాంటి రాజకీయ సంక్షోభం రాకుండా చూసుకోవాలని కేసీఆర్ అభ్యర్థుల సెలక్షన్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన సీనియర్ పార్టీ నాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యేకు అనుకూలంగా చేసిన అభ్యర్థనలు ఏవి కూడా దృష్టిలో పెట్టుకోకుండా, పార్టీ అభ్యర్థిని ఎంపిక చేయాలని కేసీఆర్, అలాగే కేటీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

అవకాశాన్ని సద్వినియోగం: 

బోథ్, ఖానాపూర్, వైరా, కోరుట్ల, ఉప్పల్, ఆసిఫాబాద్, మెట్‌పల్లి నియోజకవర్గాలకు బీఆర్‌ఎస్ కొత్త అభ్యర్థులను ప్రకటించింది. ఒక్కో సీటుకు చాలామంది పోటీ పడినట్లు గమనించిన కేసీఆర్, టికెట్ రాని వారు పార్టీ కోసం నిరంతరం పనిచేయాలని, వారికి అవకాశాలు తప్పకుండా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అభ్యర్థులందరూ విజయం సాధించాలని తన వైపు నుంచి కోరుకుంటూ, ఆగస్టు 21 నాగపంచమి నాడు, మధ్యాహ్నం 2.38 గంటల తర్వాత శుభ ముహూర్తన జాబితాను విడుదల చేసినట్లు కెసిఆర్ చెప్పారు. 

బిఆర్‌ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి సాయన్న, ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఫిబ్రవరిలో మరణించారు. రాజకీయాల్లో ఆసక్తి చూపించే ఆయన కుమార్తె లాస్య నందిత 2016లో హైదరాబాద్‌లోని కవాడిగూడ నుంచి మున్సిపల్ కార్పొరేటర్‌గా ఎన్నికైనప్పటికీ, డిసెంబర్ 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయారు. సాయన్నపై గౌరవంతోనే, ఆయన కుమార్తె అయన లాస్యను నామినేట్ చేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. 

కర్నాటక గురించి మాట్లాడుతూ, కర్ణాటకలో విజయం సాధించడంతో కాంగ్రెస్ సంబరాలు జరుపుకుంటున్నప్పటికీ, తెలంగాణకు కర్ణాటకకు సంబంధం లేదని కేసీఆర్ చెప్పారు. అంతేకాకుండా, కర్ణాటకలో ఇప్పుడు ఏమి జరుగుతుందో ప్రజలు స్పష్టంగా చూస్తున్నారని, బెంగుళూరు నగరంలో మళ్లీ పవర్ కట్ మొదలవుతుంది అని తాము ఊహించలేదని, చెప్పారు కేసీఆర్. అంతేకాకుండా కర్ణాటకలో ఇప్పటికే ప్రభుత్వం చేసిన అనేక వాగ్దానాలు కాంగ్రెస్ మర్చిపోయింది అని మరొకసారి నొక్కి చెప్పారు కేసీఆర్.