Murder: గర్ల్ ఫ్రెండ్ గొంతు కోసిన విద్యార్థి

కర్ణాటక లో దారుణం..

Courtesy: Twitter

Share:

Murder: ఎక్కడ చూసినా హత్య (Murder)లు, కుట్రలు కుతంత్రాలు బయట పడుతున్నాయి. ఒకరు ప్రేమ ఒప్పుకోలేదని, ప్రేమించిన వాళ్ళు మోసం చేశారని, పెళ్లి చేసుకోవడానికి నిరాకరించారంటూ, భర్త సరిగ్గా చూడట్లేదు అని, భార్య మాట్లాడలేదని ఇలా ఎక్కడ చూసినా ఒకరి మీద ఒకరు పగతో ప్రతీకారాలు తీర్చుకోవడానికి హత్య (Murder)లు చేయడానికి కూడా వెనకాడట్లేదు. ఇలాంటి ఒక దారుణమైన సంఘటన కర్ణాటక (Karnataka)లో వెలుగులోకి వచ్చింది. 

గర్ల్ ఫ్రెండ్ గొంతు కోసిన విద్యార్థి: 

కర్ణాటక (Karnataka)లో 21 ఏళ్ల యువతిని హత్య (Murder) చేసిన 23 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు (Police). నిందితులు, బాధితురాలు వాగ్వాదానికి దిగిన ఘటన, కర్ణాటక (Karnataka)లోని రాష్ట్రంలోని హసన్ జిల్లాలో చోటుచేసుకుంది.

నిందితుడు తేజస్‌, బాధితురాలు కర్ణాటక (Karnataka)లోని ఇంజినీరింగ్‌ కళాశాలలో చదువుకుని ప్రేమాయణం సాగిస్తున్నారు. ఇద్దరూ తరచూ గొడవలు పడుతుండేవారని, దీంతో ఆ విద్యార్థి తన ప్రేయసిని చంపేశారని ఆరోపించారు.

ప్రశాంతంగా మాట్లాడుకుని గొడవలు సరిదిద్దుకుందాం అంటూ ఏకాంత ప్రదేశానికి పిలిచి, నిందితుడు తేజస్‌ బాధితురాలిని గొంతు కోసి హత్య (Murder) చేసినట్లు నిర్ధారించిన పోలీసులు (Police)..అతడిని అదుపులోకి తీసుకున్నామని, కేసు తదుపరి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు (Police) తెలిపారు. 

ఇలాంటి ఒక సంఘటన కేరళలో: 

కేరళలో ఒక తండ్రి తన కూతుర్ని, విష్ణు అనే అబ్బాయి నిర్బంధిస్తున్నాడని, తన మీద తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ కోర్టు (Court)లో తమ వైపు నుంచి పిటిషన్ దాఖలు చేశాడు. ఈ క్రమంలోనే ఆ అమ్మాయి తీసుకున్న నిర్ణయానికి.. ఆ అమ్మాయితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటున్న విష్ణు అనే అబ్బాయి ఆత్మహత్యాయత్నం (Suicide) చేసుకున్నాడు. అసలు విషయం ఏమిటంటే, కేరళకు చెందిన విష్ణు అనే అబ్బాయి, ఒక అమ్మాయి తో ఒక నెల రోజుల నుంచి కలిసి ఉంటున్నాడు. ఇదే క్రమంలో ఆ అమ్మాయి తండ్రి, విష్ణు మీద కోర్టు (Court)లో హబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేస్తాడు. 

దీనికి సంబంధించిన విచారణ, ఈ సోమవారం నాడు జరగగా, బెంచ్ అమ్మాయి నిర్ణయాన్ని అడగడం జరిగింది. అయితే ఆ అమ్మాయికి విష్ణు మీద అసలు ఎటువంటి ఫీలింగ్స్ లేవని, విష్ణుని కేవలం ఒక సోదర భావంతోనే చూశానని, ఆ అమ్మాయి చెప్పడం జరిగింది.

అయితే కేవలం, ఆ అమ్మాయి తనతో కలిసి ఉండకపోతే చనిపోతాను అని బెదిరించడం కారణంగానే.. ఆ అమ్మాయి విష్ణుతో కలిసి ఉండటానికి ఒప్పుకున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా, ఆ అమ్మాయి చెప్పిన విషయాలు ప్రకారం, విష్ణుకి ఇంతకుముందే వేరే అమ్మాయితో వివాహం జరిగిపోయిందని, తమ భార్యాభర్తల బంధం కాస్త అటు ఇటుగా ఉందని.. ఇప్పుడు ఈమె మాత్రమే తనకి ముఖ్యమని విష్ణు చెప్పినట్లు, అమ్మాయి వెల్లడించింది.

అంతేకాకుండా ప్రస్తుతం తాను తన తల్లిదండ్రులతోనే ఉండేందుకు ఆ అమ్మాయి నిర్ణయం తీసుకుంది. అయితే కోర్టు (Court)లో జరిగిన వాదనలు అనంతరం, విష్ణు తన మణికట్టున కోసుకుంటుండగా పోలీసులు (Police) ఆపి, తనని వెంటనే లోకల్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. దేశంలో ఇదే విధమైన ధోరణితో, భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని హైకోర్టు (Court) తన ఉత్తర్వులో పేర్కొంది. వివాహ బంధంలో భాగస్వామి విశ్వాసం మరియు స్వేచ్ఛగా జీవించడం ప్రగతిశీల సమాజానికి చిహ్నాలుగా మారతాయని.. యువత మాత్రం తాత్కాలికంగా ఉండే ఆనందం కోసం చూస్తుందని, దీర్ఘకాలంలో ఏర్పడే సమస్యలను పట్టించుకోకపోవడం మరో సమస్యగా మారుతుందని, హైకోర్టు (Court) తేల్చి చెప్పింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడున్న యువత పెద్దగా చదువుకుని మంచి స్థానాల్లోకి వెళ్తున్నప్పటికీ, ఇటువంటి లివ్-ఇన్ రిలేషన్షిప్ వైపు ఆకర్షితులవుతూ తమ బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారని చెప్పుకోవాలి. ఇటువంటి బంధాలు అనేవి సమాజంలో గౌరవప్రదంగా ఉండవని కూడా యువత అర్థం చేసుకోవాలని కోర్టు (Court) కోరింది.