ఊపందకున్న ‘కర్నాటక’ ఎన్నికల ప్రచారం

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌ బుధవారం కర్ణాటక రాష్ట్రాంలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేతలు ఉత్తర, దక్షిణ కర్ణాటకలోని పలు ప్రాంతాలకు ఇప్పటికే చేరుకున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుంచి మైసూరు చేరుకుని మాండ్యాలో రోడ్‌షోలు, ప్రచారంలో పాల్గొంటారు. ఆయన మధ్యాహ్నానికి ఉత్తర కర్ణాటకలోని విజయపుర జిల్లాకు చేరుకుని బసవన్న బాగేవాడిలో ప్రచారం చేపట్టే ముందు బసవేశ్వర […]

Share:

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌ బుధవారం కర్ణాటక రాష్ట్రాంలో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. మే 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేతలు ఉత్తర, దక్షిణ కర్ణాటకలోని పలు ప్రాంతాలకు ఇప్పటికే చేరుకున్నారు.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నో నుంచి మైసూరు చేరుకుని మాండ్యాలో రోడ్‌షోలు, ప్రచారంలో పాల్గొంటారు. ఆయన మధ్యాహ్నానికి ఉత్తర కర్ణాటకలోని విజయపుర జిల్లాకు చేరుకుని బసవన్న బాగేవాడిలో ప్రచారం చేపట్టే ముందు బసవేశ్వర ఆలయాన్ని సందర్శించనున్నారు. అనంతరం యోగి ఇండీ పట్టణానికి చేరుకుని లక్నోకు తిరిగి వచ్చే ముందు బహిరంగ ర్యాలీలో ప్రసంగిస్తారు. ఆయన వొక్కలిగ, లింగాయత్‌ల‌ను ఉద్దేశించి మట్లాడనున్నారు.

అటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ బెళగావి, బాగల్‌కోట్ జిల్లాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అంతేకాకుండా కాకవాడ, బైలహొంగల్, బాగల్‌కోట్ జిల్లాల్లో కూడా ఆయన బహిరంగ సభల్లో పాల్గొంటారు. కలబురగిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు. ఆమె బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొంటారు. సీతారామన్ అలంద్‌లో జరిగే ఇంటరాక్షన్ కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. అనంతరం సాయంత్రం కలబుర్గి నగరంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బెలగావి జిల్లా హుక్కేరిలో బహిరంగ ర్యాలీలో పాల్గొననున్నారు. గోకాక్, రామదుర్గంలో బహిరంగ సభల్లో కూడా ప్రసంగించనున్నారు.

మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విజయపురలోని సిద్దేశ్వర ఆశ్రమాన్ని సందర్శించి విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. బబలేశ్వర్‌ పట్టణంలో ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాష్ట్రంలోనూ హడావిడి కనిపిస్తోంది. కన్నడనాట ప్రచారం చేయడానికి తెలంగాణ బీజేపీ నేతలు సిద్దమయ్యారు. తాజాగా బీజేపీ పార్టీ అధీష్టానం.. కర్నాటక ఎన్నికల ప్రచారం కోసం 40 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. ఈ లిస్టులో తెలంగాణ బీజేపీ నాయకురాలు డీకే అరుణ పేరు కూడా ఉంది. దీంతో కర్నాటక ఎన్నికల ప్రచారానికి తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలు తరలి వెళ్లనున్నారు.

స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సహా 40 మంది పేర్లు ఉన్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్, నిజామాబాద్ ఎంపీ అర్వింద్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు, వివేక్, జితేందర్ రెడ్డి, గరికపాటి, ఇంద్రసేనారెడ్డి, ఎస్.కుమార్ లకు ప్రచార బాధ్యతలను అప్పగించింది BJP అధిష్టానం.

కర్ణాటకలో తెలుగువారు ఉన్న ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించటానికి నియమించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే.. దక్షిణాదిలో కర్నాటకతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌పై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించినట్టు అనిపిస్తోంది. కర్ణాటకలో బీజేపీ పార్టీ విజయం సాధిస్తే.. తెలంగాణలో బీజేపీ దూకుడు పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అటు కాంగ్రెస్‌ తరపున రాహుల్‌గాంధీ కూడా సుడిగాలి ప్రచారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా బీసీ జనగణన చేపట్టాలని , రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని ఎత్తివేయాలని రాహుల్ బిజేపి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కర్నాటకలో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి.. రాహుల్‌గాంధీ కూడా  గత కొద్ది రోజులుగా పలు సభల్లో పాల్గొంటున్నారు.