కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేసేందుకు కుమారస్వామికి చుక్కెదురు

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన  తాను త్వరలో శాసనసభ స్పీకర్‌కు తన రాజీనామాను సమర్పిస్తానని చెప్పారు. కాగా నిన్న రాత్రి ప్రకటించిన 23 మంది అభ్యర్థులతో కూడిన బీజేపీ రెండో జాబితాలో ముదిగెరె అభ్యర్థిగా తన పేరు కాకుండా దీపక్ దొడ్డయ్య పేరు ఉండటంతో నిరాశ చెందాడు. ముదిగెరె బీజేపీ ఎమ్మెల్యే ఎంపి కుమారస్వామి గురువారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు టిక్కెట్ నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. […]

Share:

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన  తాను త్వరలో శాసనసభ స్పీకర్‌కు తన రాజీనామాను సమర్పిస్తానని చెప్పారు. కాగా నిన్న రాత్రి ప్రకటించిన 23 మంది అభ్యర్థులతో కూడిన బీజేపీ రెండో జాబితాలో ముదిగెరె అభ్యర్థిగా తన పేరు కాకుండా దీపక్ దొడ్డయ్య పేరు ఉండటంతో నిరాశ చెందాడు.

ముదిగెరె బీజేపీ ఎమ్మెల్యే ఎంపి కుమారస్వామి గురువారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తనకు టిక్కెట్ నిరాకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. మరోవైపు తనను నామినేట్ చేయనందుకు జాతీయ ప్రధాన కార్యదర్శి సి.టి. రవిపై విమర్శలు గుప్పించారు.

ఇక మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను త్వరలో శాసనసభ స్పీకర్‌కు కూడా తన రాజీనామా లేఖ సమర్పిస్తానని పేర్కొన్నారు. నిన్నరాత్రి ప్రకటించిన 23 మంది అభ్యర్థులతో కూడిన బీజేపీ రెండో జాబితాలో ముదిగెరె అభ్యర్థిగా దీపక్ దొడ్డయ్య పేరు పెట్టారు.

టికెట్ రాకపోవడంతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవిపై కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు, తన మద్దతుదారులు మరియు తన నియోజకవర్గ ప్రజలతో చర్చించిన తర్వాత తన తదుపరి చర్యపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తనకు, రవికి మధ్య ఉన్న వ్యక్తిగత వైరమే తనకు టికెట్ రాకపోవడానికి కారణమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇక ఎస్సీ వర్గానికి చెందిన నాయకుడు జేడీ(ఎస్)లో చేరవచ్చని కొందరంటే మరికొందరేమో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయవచ్చని అనుమానిస్తున్నారు. 

“నేను నా రాజీనామాను పార్టీ కార్యాలయానికి పంపాను మరియు త్వరలో (ఎమ్మెల్యే పదవికి రాజీనామా) స్పీకర్‌కు కూడా అందజేస్తాను. నా మద్దతుదారులు మరియు ఓటర్లతో చర్చించి నా తదుపరి చర్యను రెండు రోజుల్లో నిర్ణయిస్తాను”అని ఆయన అన్నారు.

“సి.టి.రవి వ్యక్తిగత కారణాల వల్ల నాకు టిక్కెట్టు రాకుండా చేశారు, ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు ఆ శక్తి ఉంది. ఆయన స్థానంలో నేనూ, నేను ఆ స్థానంలో ఉంటే.. నేను కూడా అలాగే చేసేవాడినేమోనని పేర్కొన్న అయన.. మరోవైపు పార్టీని నాశనం చేస్తానని రవి బీజేపీని హెచ్చరించారని ఆయన తెలిపారు.

ఇక బీజేపీ సీనియర్‌ నేత బీఎస్‌ యడ్యూరప్ప వారం రోజుల పాటు తన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేస్తే..  ఆ పార్టీ కనీసం 50 సీట్లు కూడా గెలవదని కుమారస్వామి అన్నారు. యడ్యూరప్ప లేకుంటే ప్రజలు బీజేపీ సమావేశాలకు కూడా రారని అన్నారు.  తనకు టికెట్ నిరాకరించడానికి కారణమేంటని ప్రశ్నించారు. “నాకు వయస్సు మరియు సామర్థ్యం ఉన్నాయి.” అన్నారు. 

కాగా.. ఇటీవల యడ్యూరప్ప ఒక మీటింగ్‌కి వచ్చినప్పుడు నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలు కుమారస్వామిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.

కర్ణాటక శాసనసభలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు 10 మే 2023న ఎన్నికలు జరగనున్నాయి. 13 మే 2023న ఫలితాలు ప్రకటించబడతాయి. ప్రస్తుత కర్ణాటక శాసనసభ పదవీకాలం 24 మే 2023న ముగియనుంది. 

రాష్ట్రంలో మొత్తం 5,21,73,579 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.  అందులో పురుషులు 2.62 కోట్లమంది ఉండగా, మహిళలు 2.59 కోట్లు, ట్రాన్స్‌జెండర్లు 4,699 మంది ఉన్నారు. 16,976 మంది శతాధిక వృద్ధులు ఉండగా, 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 12.15 లక్షల మంది ఉన్నారు.