బీజేపీ, కాంగ్రెస్‌తోనే నా పోటీ: గాలి జనార్దన్ రెడ్డి

కోట్లాది రూపాయల అక్రమ మైనింగ్ కేసులో నిందితుడైన బీజేపీ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి 2015 నుంచి బెయిల్‌పై బయట ఉన్నారు.  2011లో సీబీఐ అరెస్టు చేసినప్పటి నుంచి దాదాపు 12 ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన కళ్యాణ రాజ్య ప్రగతి పక్షా అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. కాగా ఈయన బళ్లారిలోని కొప్పల్ జిల్లా గంగావతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.  బీజేపీ ఓట్లను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన అరుణ్ […]

Share:

కోట్లాది రూపాయల అక్రమ మైనింగ్ కేసులో నిందితుడైన బీజేపీ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి 2015 నుంచి బెయిల్‌పై బయట ఉన్నారు.  2011లో సీబీఐ అరెస్టు చేసినప్పటి నుంచి దాదాపు 12 ఏళ్లపాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన కళ్యాణ రాజ్య ప్రగతి పక్షా అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. కాగా ఈయన బళ్లారిలోని కొప్పల్ జిల్లా గంగావతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.

 బీజేపీ ఓట్లను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన అరుణ్ దేవ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జానార్ధన  రెడ్డి తన ఎన్నికల వాగ్దానాలకు మద్దతు ఇచ్చే ఎవరికైనా నా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని జనార్దన్‌ రెడ్డి తెల్చి చెప్పారు.

మా పార్టీ గుర్తు ఫుట్‌బాల్‌. ఇంతకు ముందు నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు నా సొంతవారు, శత్రువులు, మిత్రులు అని తేడా లేకుండా అందరూ నన్ను ఫుట్‌బాల్‌లా చూసేవారన్నారు. కానీ ఇప్పుడు నేను కూడా అందరితో ఫుట్‌బాల్ ఆడగలను అని నిరూపించుకోవడానికి ఎన్నికల బరిలోకి దిగానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. కాగా నేను స్వతంత్రంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. ప్రధానంగా నా పోటీ కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలతో ఉంటుందని చెప్పారు. కాగా 55 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టామని చెప్పారు. ఆయా స్థానాల్లో తప్పకుండా గెలుస్తామని గాలి జనార్దన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

మా పార్టీ తరుపున ఏదైనా సీట్లు గెలిచినట్లయితే మా పార్టీ మేనిఫెస్టోలో నేను ఇచ్చిన హామీలను ఎవరు ఒప్పుకుంటారో, వారికి నా పార్టీ మద్దతు కావాలంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అన్నారు.

 కాగా నా పార్టీ నుంచి పోటీ చేయమని ప్రజలను అడగాల్సిన అవసరం లేదన్నారు. నేను చేసిన మంచి పనులను గుర్తించిన ప్రజలు నా పార్టీ నుంచి పోటీ చేసేందుకు నా వద్దకు వచ్చారని తెలిపారు. కాగా మా పార్టీ నుండి పోటీ చేయడానికి మాకు మంచి అభ్యర్థులున్నారని తెలిపారు.

కాగా ఎన్నికల మెనిపెస్టోలో  5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు సంవత్సరానికి ₹ 15,000 ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు ప్రతిరోజూ 9 గంటల పాటు నిరంతర ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని హామి ఇచ్చారు. వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయల కంటే తక్కువ ఉన్నవారికి 2,500 రూపాయల ఆరోగ్య శ్రీ, ఆరోగ్య రక్షణ, ప్రకటించామన్నారు. ఇంటిని నడిపే మహిళలకు నెల ఆర్థిక సహాయం, ప్రతి ఇంటికి 250 యూనిట్ల ఉచిత విద్యుత్, నిరుద్యోగ యువతకు నెలకు 2,500 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇళ్లు లేని కుటుంబాలకు మహిళల పేరుతో 2BHK గృహాలు కట్టిస్తామన్నారు.

కాగా గతంలో ప్రజల కోసం నేను చేసిన మంచి పనులన్నీ నాకు ఓట్ల  రూపంలో వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.  ప్రజలు దాని గురించి బహిరంగంగా మాట్లాడకపోవచ్చు కానీ నేను ఎక్కడికి వెళ్లినా, నేను వారికి ఎలా సహాయం చేశానో అందరూ గుర్తు చేసుకుంటారని తెలిపారు.

“నాపై ఏడు కేసులు (అతని ఎన్నికల అఫిడవిట్ ప్రకారం) దాఖలయ్యాయి. ఈ కేసులు పదేళ్ల క్రితం నమోదయ్యాయి. ఈ కేసులను త్వరగా విచారించాలని, వాటిని రోజువారీగా విచారించాలని నేను కోర్టును ఆశ్రయించినా, వారు (దర్యాప్తు సంస్థలు) అందుకు అంగీకరించడం లేదు” అన్నారు. కాగా  నన్ను అక్రమంగా  అరెస్టు చేసి నాలుగేళ్లపాటు జైల్లో ఉంచారని.. ఇది కేవలం రాజకీయ కుట్రగానే నేను పరిగణిస్తున్నాని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు.