బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల

కర్ణాటక రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పట్టుదలతో ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం విదితమే. మే 10న పోలింగ్, 13న ఫలితాలు రానున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుంది. ప్రచార పర్వానికి అభ్యర్థులు, బీజేపీ నాయకులు తెర లేపారు. నియోజకవర్గాలలో బీజేపీ నేతలు, అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు బీజేపీ […]

Share:

కర్ణాటక రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పట్టుదలతో ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ రాష్ట్రంలో ఈసీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం విదితమే. మే 10న పోలింగ్, 13న ఫలితాలు రానున్నాయి. ఇప్పటికే బీజేపీ రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తి అవుతుంది. ప్రచార పర్వానికి అభ్యర్థులు, బీజేపీ నాయకులు తెర లేపారు. నియోజకవర్గాలలో బీజేపీ నేతలు, అభ్యర్థులు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు బీజేపీ అగ్రనేతలు రోడ్ షోలతో ప్రచారవేగాన్ని మరింత పెంచనున్నారు. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం 40 మంది పేర్లతో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ఆసక్తి కరంగా ఉంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల

చేసింది. ఈ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో  మొత్తం 40 మందికి ఈ జాబితాలో చోటు కల్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ప్రహ్లాద్ జోషి, నిర్మ లా సీతారామన్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్, మన్సూక్ మాండవీయ, భగవంత్ ఖూబా, ముఖ్యమంత్రులు బస్వరాజ్ బొమ్మై ,యోగీ ఆదిత్యనాథ్ సింగ్, హిమంతబిశ్వ శర్మ, శివరాజ్ సింగ్ చౌహాన్, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్న వీస్ ఉన్నారు. ఈ జాబితాలో తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు అన్నా మలైకి చోటు కల్పిం చారు. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు స్టార్ క్యాం పెయినర్ జాబితాలో చోటు కల్పించారు. ఇప్పటికే డీకే అరుణ కర్ణాటక సహ ఇన్ చార్జీగా బాధ్యతలు చేపడుతున్నారు. కర్ణాటక ఎన్ని కల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కొద్దిరోజులుగా పూర్తిగా కర్ణాటకకే పరిమితమై ప్రజలకు చేరువవుతున్నారు. ఇక స్టార్ క్యాంపెయినర్లలో పేర్కొన్న వారంతా మే 10 జరగబోయే ఎన్నికల కోసం బీజేపీ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొననున్నారు.

బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, వివిధ రాష్ట్రాలు, కేంద్ర నుంచి పలువురు సీనియర్ నేతలు ఉన్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు కూడా ఉన్నారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో బీజేపీ యువ నేత, ఎంపీ తేజస్వి సూర్య పేరులేకపోవటం బీజేపీ పార్టీ శ్రేణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 32 ఏళ్ల తేజస్వి సూర్య, బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడు. బెంగళూరు సౌత్ పార్లమెంట్ సభ్యుడు. పార్టీ ఎజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే నేత. ప్రతిపక్ష పార్టీలపై, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలపై విమర్శలకు ప్రసిద్ధి చెందిన నేత. అలాంటి వ్యక్తి పార్టీ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ లో ఎందుకు లేరన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి వాళ్ళు స్టార్ క్యాంపెయిన్ లో లేకపోవడం బీజేపీకి నష్టమే. కానీ ఇందుకు ప్రధాన కారణాలు ఉన్నట్లు బీజేపీ నేతలు పేర్కొంటున్నారు.