కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బీఎన్ చంద్రప్ప నియామకం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో మరో కీలక నియామకం చేసింది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి 5వ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోక్ సభ మాజీ ఎంపీ బీఎన్ చంద్రప్పను నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జరిపిన ఈ నియామకం తక్షణమే అమలులోకి వచ్చినట్లు ఆదివారం ఆయన ఓ అధికారిక ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ ఉండగా రామలింగారెడ్డి ఈశ్వర్ ఖండ్రే, సలీం […]

Share:

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలో మరో కీలక నియామకం చేసింది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి 5వ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా లోక్ సభ మాజీ ఎంపీ బీఎన్ చంద్రప్పను నియమించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జరిపిన ఈ నియామకం తక్షణమే అమలులోకి వచ్చినట్లు ఆదివారం ఆయన ఓ అధికారిక ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ తెలియజేసింది.

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ ఉండగా రామలింగారెడ్డి ఈశ్వర్ ఖండ్రే, సలీం అహ్మద్, సతీష్ జార్కి హోలీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.  ఐదవ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చంద్రప్ప తాజాగా నియమితులయ్యారు.  కెపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ ధృవ నారాయణ ఇటీవల చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రప్ప నియామకం జరిగింది.

బి ఎన్ చంద్రప్ప చిత్రదుర్గ నియోజకవర్గంలోని 16వ లోక్సభ అధ్యక్షుడు. ఈయన 1986లో చిక్కమంగళూరులో జిల్లా పరిషత్ మెంబర్ గా ఎన్నికయ్యారు. 1991లో వైస్ ప్రెసిడెంట్‌గా జిల్లా పరిషత్ చిక్క మంగళూరులో వ్యవహరించారు. 2001లో కర్ణాటక స్టేట్ లిడ్కర్ బోర్డ్ చైర్మన్‌గా వ్యవహరించారు.  2014లో ఎంపీగా 16వ లోక్ సభకు ఎన్నికయ్యారు. స్టాండింగ్ కమిటీ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్‌లో మెంబర్‌గా వ్యవహరించారు.  అదేవిధంగా కన్సల్టేటివ్ కమిటీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్‌లో కూడా మెంబర్‌గా వ్యవహరించారు. ఇప్పుడు ఈయననే కర్ణాటక నూతన వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం చేశారు.

 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 124 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను మార్చి 25న కాంగ్రెస్ విడుదల చేయనుంది.  డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఈ జాబితాలో ఉన్నారు.  సిద్ధరామయ్య కనకపురి నుంచి డీకే శివకుమార్ పోటీ చేయనున్నారు . ప్రస్తుత అసెంబ్లీలో బిజెపి కి 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్ కి 75 మంది, జేడిఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో జరగనుంది.  మే 13న ఓట్ల లెక్కింపు జరిపి తుది ఫలితాలు ప్రకటిస్తారు.

కర్ణాటక కాంగ్రెస్ మే 10న ఎన్నికలు జరగనున్నట్లు రాష్ట్ర అసెంబ్లీ తెలిపింది. 42 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్ రెండవ జాబితాలో 41 మంది అభ్యర్థులు పార్టీకి చెందినవారు, మరొకరు ప్రాంతీయ పార్టీ సర్వోదయ కర్ణాటక ఒక స్థానాన్ని కేటాయించింది. సర్వోదయ కర్ణాటక పార్టీకి చెందిన దర్శన్ పుట్టన్నయ్య కు కాంగ్రెస్ మేలుకోటి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కేటాయించింది. ఆ పార్టీ 124 స్థానాల్లో అభ్యర్థులను ముందుగా ప్రకటించింది. 

కర్ణాటక అసెంబ్లీలో 224 సీట్లు ఉన్నాయి. బిజెపికి 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్‌కి 75 దాని మిత్రపక్షం అయిన జెడికి 28 సీట్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం కూడా తిరిగి అధిష్టానంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తోంది.  ముస్లిం వర్గానికి మత ఆధారిత రిజర్వేషన్ను రద్దు చేయడం ద్వారా కన్నడిగుల సమస్య లింగాయత్, వొక్క, లీగ వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని చెబుతోంది.