కన్నడలో ప్రత్యక్షమైన ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ న్యూస్ రీడర్

ప్రస్తుతం అన్నీ రంగాలలో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వాడకం ఒక రేంజ్ లో ఉంటుంది. ప్రతీ ఒక్కరికి ఈ టెక్నాలజీ ద్వారా పనులు చాలా సులువుగా అయిపోతున్నాయి. ఈ టెక్నాలజీ ప్రారంభం లోనే ఈ రేంజ్ లో ఉంటే, ఇక భవిష్యత్తులో ఈ దీని  వాడకం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక మీడియా రంగం లో కూడా ఈ టెక్నాలజీ ని వాడడం మొదలు పెట్టారు. కన్నడ లోని ఒక ప్రముఖ న్యూ ఛానల్ సౌందర్య […]

Share:

ప్రస్తుతం అన్నీ రంగాలలో ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వాడకం ఒక రేంజ్ లో ఉంటుంది. ప్రతీ ఒక్కరికి ఈ టెక్నాలజీ ద్వారా పనులు చాలా సులువుగా అయిపోతున్నాయి. ఈ టెక్నాలజీ ప్రారంభం లోనే ఈ రేంజ్ లో ఉంటే, ఇక భవిష్యత్తులో ఈ దీని  వాడకం ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక మీడియా రంగం లో కూడా ఈ టెక్నాలజీ ని వాడడం మొదలు పెట్టారు. కన్నడ లోని ఒక ప్రముఖ న్యూ ఛానల్ సౌందర్య అనే పేరు తో ఆర్టిఫీషియల్ న్యూస్ రీడర్ వార్తలు చదవడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అచ్చం అసలు సిసలు న్యూస్ రీడర్ లాగ అక్షరం పొల్లు పోకుండా వార్తలు చదవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మరోపక్క ఈ ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ దెబ్బకి యాంకర్స్ మరియు న్యూస్ రీడర్స్ లో గుబులు మొదలు అయ్యింది.

కన్నడలో మొట్టమొదటి ఏఐ యాంకర్:

ఎందుకంటే ఖర్చు తక్కువ , ఆదాయం ఎక్కువ , మనుషులకంటే వేగవంతంగా పని చెయ్యడం ఈ లక్షణాలే కారణం. కేవలం న్యూస్ లు చదివేందుకు వాయిస్ ఓవర్ ఒక్కటి అందిస్తే చాలు, మిగతాది మొత్తం ఈ ఏఐ యాంకర్ చూసుకుంటుంది. ఇది ఇలా ఉండగా కన్నడ న్యూస్ ఛానల్ పవర్ టీవీ లో ఈ సౌందర్య పేరిట తయారు చెయ్యబడ్డ ఏఐ యాంకర్ వార్తలకు సోషల్ మీడియా లో మంచి క్రేజ్ వచ్చింది. ‘హలో కన్నడిగులు, నేను మీ న్యూస్ రీడర్ సౌందర్య, పవర్ టీవీ కి స్వాగతం, నేను మొట్టమొదటి ఏఐ యాంకర్ ని, అంటే రోబో యాంకర్ ని అన్నమాట’ అంటూ సౌందర్య మాట్లాడిన మాటలు చాలా క్యూట్ గా అనిపించాయి. ఇక ఆ తర్వాత ఆమె మీడియా రంగం గురించి పలు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అచ్చు గుద్దినట్టు మణిశలాగే కళ్ళు ఆర్పుతూ, ముఖ కవళికలు కూడా డిట్టో దింపించేసి తయారు చేసిన ఈ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ వీడియో ని చూసి మిగిలిన మీడియా చానెల్స్ ఈ టెక్నాలజీ ని అడాప్ట్ చేసుకోవడానికి అమితాసక్తిని చూపిస్తున్నాయి.

తెలుగు లో ఆక్షరిస్తున్న మాయ ఆర్టిఫీషియల్ న్యూస్ రీడర్ :

ఇక తెలుగు మీడియా చానెల్స్ కూడా ఇలాంటి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ యాంకర్ ని క్రియేట్ చేశారు. బిగ్ టీవీ అనే ప్రముఖ మీడియా ఛానల్ మాయ అనే పేరుతో ఒక క్రియేట్ చేసారు. ‘హలో!..నా పేరు మాయ, బ్రహ్మ మిమల్ని తయారు చేస్తే, నన్ను తయారు చేసింది మాత్రం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ అంటూ స్వచ్ఛమైన తెలుగు భాషతో వార్తలు చదివేస్తుంది ఈ రోబో యాంకర్. మామూలు న్యూస్ యాంకర్స్ కూడా ఇంత క్యూట్ గా ,ఇంత అనర్గళంగా తెలుగుని మన టీవీ యాంకర్స్ కూడా మాట్లాడలేరేమో అని అనిపించింది. ఈ వాడకం కాస్త వృద్ధిలోకి వస్తే తెలుగు మీడియా మొత్తం ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ ని వాడేస్తుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినీ రంగం లో ఇక నుండి ఈ టెక్నాలజీ వాడకం బాగా ఉంటుందట . చాలా వరకు రిస్కీ స్తంట్స్ కోసం మేకర్స్ దూప్స్ ని వాడుతుంటారు. అయితే ఇక నుండి ఆ అవసరం లేదు, హీరో ముఖానికి సంబంధించి 360 డిగ్రీల కోణాల్లో ఫోటోలు తీస్తారు .దానికి ఆర్టిఫీషియల్ బాట్ ని క్రియేట్ చేసిన తర్వాత అచ్చు గుద్దినట్టు ఆ హీరో పోలికలతో ఉన్నట్టుగా ఉంటాయి. మహేష్ – రాజమౌళి సినిమాలో ఈ టెక్నాలజీ ని వాడడం అని అనుకుంటున్నారు.