కుర్రాడిని టార్చ‌ర్ చేస్తున్నారు.. ఉద‌య‌నిధికి క‌మ‌ల్ హాస‌న్ స‌పోర్ట్

తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్, సనాతన ధర్మం గురించి మాట్లాడి ఒక టార్గెట్ గా మారిపోయాడని మరోసారి ప్రస్తావించాడు కమల్ హాసన్. మక్కల్ నీది మయం చీఫ్ క‌మ‌ల్ హాస‌న్ శుక్రవారం నాడు తమిళనాడు యూత్ వెల్ఫేర్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి మాట్లాడి టార్గెట్ గా మారిపోయాడంటూ ప్రస్తావించారు. పార్టీ మీటింగ్ గురించి మాట్లాడుతూ, ఉదయనిధి, బిజెపి మరియు ఏ ఇతర పార్టీలను ఎత్తిచూపకుండా, ఒక చిన్న పిల్లవాడు సనాతన ధర్మం […]

Share:

తమిళనాడు ముఖ్యమంత్రి తనయుడు ఉదయనిధి స్టాలిన్, సనాతన ధర్మం గురించి మాట్లాడి ఒక టార్గెట్ గా మారిపోయాడని మరోసారి ప్రస్తావించాడు కమల్ హాసన్. మక్కల్ నీది మయం చీఫ్ క‌మ‌ల్ హాస‌న్ శుక్రవారం నాడు తమిళనాడు యూత్ వెల్ఫేర్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి మాట్లాడి టార్గెట్ గా మారిపోయాడంటూ ప్రస్తావించారు. పార్టీ మీటింగ్ గురించి మాట్లాడుతూ, ఉదయనిధి, బిజెపి మరియు ఏ ఇతర పార్టీలను ఎత్తిచూపకుండా, ఒక చిన్న పిల్లవాడు సనాతన ధర్మం గురించి మాట్లాడే టార్గెట్ గా మారిపోయాడు అంటూ మాట్లాడారు. 

ఇంతకుముందు కూడా ప్రస్తావన జరిగింది: 

కోయంబత్తూర్ పార్టీ మీటింగ్ కోసం మాట్లాడిన కమల్ హాసన్ సనాతన ధర్మం గురించి ఉదయనిది స్టాలిన్ యూత్ వెల్ఫేర్ మినిస్టర్, తమిళ్ యాక్టర్ చేసిన వాక్యాలను మరొకసారి ప్రస్తావించారు. పేరుని ప్రస్తావించకుండా ఒక యువకుడు చిన్న పిల్లవాడు సనాతన ధర్మం గురించి మాట్లాడి ఏ విధంగా టార్గెట్ గా మారేడు ఆయన వివరించారు. అంతేకాకుండా సనాతన ధర్మం గురించి మాట్లాడటం ఇదే మొదటిసారి కాదని చాలామంది నాయకులు సనాతన ధర్మం గురించి మాట్లాడిన ఆనవాళ్లు ఉన్నాయని ముఖ్యంగా ద్రవిడియన్ మూవ్మెంట్ లో ఉదయనిది ముత్తాత డీఎంకే జాతిపిత ఎం కరుణానిధి కూడా సనాతన ధర్మం గురించిన మాట్లాడిన ఆనవాళ్లు ఉన్నాయని మరోసారి గుర్తు చేశారు కమల్ హాసన్. 

పెరియార్ ఆలయ నిర్వాహకుడిగా ఉన్నప్పటికీ, కాశీలో పూజలు కూడా చేసినప్పటికీ, వాటన్నింటిని విడిచిపెట్టి, తన జీవితమంతా ప్రజల సేవకే అంకితం చేశారని హాసన్ అన్నారు. సామాజిక రుగ్మతలపై, నాయకుడు పెరియార్ వి రామసామికి లోపల ఎంత ఆగ్రహం ఉందో, ఆ నాయకుడి జీవితం ద్వారా అర్థం చేసుకోవచ్చు అంటూ హాసన్ అన్నారు. పెరియార్ వల్లనే తనలాంటి వారు సనాతన అనే పదాన్ని అర్థం చేసుకున్నారని మరోసారి మాట్లాడారు కమల్ హాసన్. 

క్లారిఫికేషన్ ఇచ్చిన ఉదయనిది: 

తమిళ సినిమాకు చెందిన పలువురు సినీ ప్రముఖులు ఉదయనిధి స్టాలిన్‌కు మద్దతుగా నిలిచారు. కమల్ హాసన్‌తో పాటు మరి సెల్వరాజ్ మరియు పా రంజిత్ తదితరులు మామన్నన్, ఉదయనిధి మీద వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా స్పందించారు. తన వ్యాఖ్యలను ఇతరులు తప్పుగా అర్థం చేసుకోవడం సబబు కాదని, తన వైపు నుంచి మరొకసారి క్లారిటీగా చెప్పారు. 

సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిని పక్కదారి పట్టించేందుకు తాను ఎప్పుడూ మాట్లాడలేదని, అయితే కేవలం సనాతన ధర్మం గురించి తాను మాట్లాడాడని, సనాతన ధర్మం అనేది ముఖ్యంగా ప్రజల మధ్య కుల, మతల అంశాలను రేపి విడదీసే ఒక అంశంతో ముందుకు వెళుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తాను మాట్లాడిన దానిమీద తను కచ్చితంగా నిలబడతానని, అంతేకాక ముఖ్యంగా తను చెప్పిన మాటలలో ఏమాత్రం తప్పులేదని తనను సమర్ధించుకున్నారు ఉదయనిధి. 

అయితే సనాతన ధర్మం గురించి తెలియని వారికి మరింత లోతుగా తెలిసేందుకు తన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని మనుషుల్ని విడదీసే క్రమంలో సనాతన ధర్మం ఎలా పనిచేస్తుందో అంబేద్కర్, అదేవిధంగా పెరియర్ వంటి వారు రచించిన ఎన్నో పుస్తకాలు ద్వారా తెలుసుకోవచ్చని ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా సనాతన ధర్మం సమాజం మీద దుష్ప్రభావాన్ని ఎలా చూపిస్తుందో తనకి బాగా తెలుసు అని అన్నారు. 

సనాతన ధర్మాన్ని కరోనా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చడానికి గల కారణం సనాతన ధర్మం సమాజంలో ఎటువంటి దుష్ప్రభావాలకు దారితీస్తుందో దాన్ని చెప్పడానికి ఆయన ఉదాహరణగా తీసుకున్నట్లు తెలిపారు. మరి ముఖ్యంగా, తాను ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు ఉదయినిది. తప్పుడు ప్రచారాన్ని మాత్రం చేయొద్దని, తాను ఎక్కడైనా, అది కోర్టులోనైనా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.