ఈ అస్సాం గ్రామంలో ఒకే కుటుంబం నివసిస్తోంది

అస్సాం ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి అందమైన వాతావరణంలో పాటుగా ఎన్నో రకాల పక్షులు జంతువులు గుర్తొస్తాయి కదా. అయితే అక్కడ కొన్ని ప్రాంతాలలో పరిస్థితి అంతంత మాత్రమే ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా రోడ్డు రవాణా వ్యవస్థ పూర్తిగా కనుమరుగైందని చెప్పుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి బిష్ణురామ్ మేధి, నల్బరీ జిల్లాకు జిల్లాలో ఉన్న ఒక గ్రామానికి రహదారి ప్రారంభించేందుకు దశాబ్దాల క్రితం నంబర్ 2 బర్ధనారాను సందర్శించారు. అయితే ఆ తర్వాత నుంచి ఒకరి కూడా […]

Share:

అస్సాం ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి అందమైన వాతావరణంలో పాటుగా ఎన్నో రకాల పక్షులు జంతువులు గుర్తొస్తాయి కదా. అయితే అక్కడ కొన్ని ప్రాంతాలలో పరిస్థితి అంతంత మాత్రమే ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా రోడ్డు రవాణా వ్యవస్థ పూర్తిగా కనుమరుగైందని చెప్పుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి బిష్ణురామ్ మేధి, నల్బరీ జిల్లాకు జిల్లాలో ఉన్న ఒక గ్రామానికి రహదారి ప్రారంభించేందుకు దశాబ్దాల క్రితం నంబర్ 2 బర్ధనారాను సందర్శించారు. అయితే ఆ తర్వాత నుంచి ఒకరి కూడా ఇక్కడ రహదారి వేసేందుకు మక్కువ చూపించలేనట్లు అక్కడ ఉంటే నా కుటుంబం వెల్లడించింది.

ఆ గ్రామంలో ఒకే కుటుంబం నివసిస్తోంది: 

అస్సాంలోని నల్బరీ జిల్లాలోని ఒక గ్రామం, చాలా సంవత్సరాల క్రితం మాజీ ముఖ్యమంత్రి ప్రారంభించిన రహదారి పనులు ఇప్పటికీ పూర్తవ్వకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఇప్పుడు అక్కడ ఓకే కుటుంబం నివసిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 2011లో కేవలం 16 మంది మాత్రమే ఉన్నందున గత శతాబ్దంలో సంపన్న గ్రామంగా ఉన్న నం.2 బర్ధనారా గ్రామంలో, సరైన రహదారి లేకపోవడంతో ప్రస్తుతం ఐదుగురు సభ్యులతో ఉన్న ఒకే కుటుంబం ఈ గ్రామంలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.

కష్టాలలో ఈదుతూ చదువుకుంటున్న పిల్లలు: 

బిమల్ దేకా, అతని భార్య అనిమా మరియు వారి ముగ్గురు పిల్లలు – నరేన్, దిపాలి మరియు స్యుతీ – దీపాలి మరియు నరేన్ గ్రాడ్యుయేట్లు కాగా, సెయూటీ హయ్యర్ సెకండరీలో ఉన్నారు. ఘోగ్రాపరా సర్కిల్‌లోని ఈ గ్రామంలో నివాసితులు, ప్రధాన కార్యాలయం పట్టణం నల్బరి నుండి ఆ గ్రామానికి సుమారు 12 కి.మీ ఉంటుంది. అయితే అక్కడ పాఠశాల మరియు కళాశాలకు వెళ్లేందుకు వారు సమీపంలోని ఉన్న మరో రహదారికి చేరుకోవడానికి, నీటి మార్గాల ద్వారా, బురద మార్గాల ద్వారా 2 కి.మీ ప్రయాణించాల్సి ఉంటుందట. ఇక వర్షాకాలంలో, వారు ఒక కంట్రీ బోట్ ఉపయోగించి ప్రయాణం చేయాలి అని ఆ కుటుంబంలో కాలేజీకికి వెళ్లి చదువుతున్న దీపాలి చెప్పడం జరిగింది.

అనిమా తన పిల్లలను స్కూల్ కి డే పెట్టేటప్పుడు మళ్ళీ తీసుకువచ్చేటప్పుడు కచ్చితంగా తానే స్వయంగా బోటు నడుపుతాను అని చెప్పుకొచ్చింది. అయితే రోడ్డు రహదారి లేనప్పటికీ పరిస్థితులు అనుగుణంగా లేనప్పటికీ వారు 12 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉన్నప్పటికీ, తమ ముగ్గురు పిల్లలకి మంచి విద్యను అందిస్తున్నారు తల్లిదండ్రులు.

అంతేకాకుండా వారు తమ గ్రామంలో కనీసం కరెంటు సదుపాయం లేకపోవడంతో, పిల్లలు కిరోసిన్ దీపాల వెలుగులో చదువుకుంటున్నారు. వర్షం వచ్చినప్పుడు గ్రామంలోని దారులన్నీ మునిగిపోవడంతో కుటుంబానికి పడవ ఏకైక రవాణా మార్గం అవుతుంది. 162 హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ రెవెన్యూ గ్రామం పరిస్థితి కొన్ని దశాబ్దాల క్రితం వరకు సంపన్నంగా ఉండేదని, ముఖ్యంగా వెళ్లే దారులు కూడా ఓ మోస్తారు లో ఉండేవని, సమీప ప్రాంతాల ప్రజలు పేర్కొన్నారు. స్థానిక అధికారులు ఈ ప్రాంతాన్ని బాగు చేసేందుకు ఇష్టపడకపోవడం, దీంతో గ్రామస్థులు ఇంక చేసేదేమీ లేక గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారని అనిమా చెప్పారు. ముఖ్యంగా జిల్లా పరిషత్, గావ్ పంచాయతీ లేదా బ్లాక్ డెవలప్‌మెంట్ కార్యాలయం వంటి స్థానిక ఏజెన్సీలు ఇక్కడ ఏ పనిని నిర్వహించడానికి ఆసక్తి చూపడం లేదు అని ఆమె పేర్కొన్నారు. అయితే ఇక ఆ గ్రామంలో ప్రత్యేక వ్యవసాయం మరియు జంతువుల పెంపకం తమకు ప్రధాన ఆధారం.

స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు పృథిభూషణ్ దేకా మాట్లాడుతూ ఈ గ్రామం ఒకప్పుడు సంపన్నంగా ఉండేదని, కానీ పునరావృతమయ్యే వరదల వల్ల ఈ గ్రామం ఎడారిగా మారిందని అన్నారు. ప్రభుత్వం రహదారిని నిర్మించి, కనీస సౌకర్యాలు కల్పిస్తే, వ్యవసాయ సామర్థ్యాలు మళ్లీ పుంజుకోవడం ద్వారా, వలస వెళ్లిన ప్రజలు గ్రామానికి తిరిగి వస్తారు అంటూ అన్నారాయన.