‘దేవర’ పోరాటాలు మళ్లీ మొదలు

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌‌గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. కొమురం భీమ్‌గా తన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఏడాదిన్నరకు మళ్లీ మరో సినిమాను చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అదే ‘దేవర’. తనకు జనతా గ్యారేజ్‌ లాంటి సూపర్‌‌ హిట్ సినిమాను అందించిన కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మరో షెడ్యూల్ తాజాగా మొదలైంది. యాక్షన్ మొదలైంది.. ‘దేవర’ కొత్త షెడ్యూల్ ప్రారంభమైందంటూ సోషల్‌ మీడియా వేదికగా […]

Share:

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్‌‌గా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. కొమురం భీమ్‌గా తన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఏడాదిన్నరకు మళ్లీ మరో సినిమాను చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అదే ‘దేవర’. తనకు జనతా గ్యారేజ్‌ లాంటి సూపర్‌‌ హిట్ సినిమాను అందించిన కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మరో షెడ్యూల్ తాజాగా మొదలైంది.

యాక్షన్ మొదలైంది..

‘దేవర’ కొత్త షెడ్యూల్ ప్రారంభమైందంటూ సోషల్‌ మీడియా వేదికగా మూవీ టీమ్ అప్‌డేట్ ఇచ్చింది. ఇటీవల సినిమాకు బ్రేక్ ఇవ్వగా.. తాజాగా మరో షెడ్యూల్ ప్రారంభమైందని చెప్పింది. ‘‘చిన్నబ్రేక్, కొన్ని రిహారల్స్‌ తర్వాత మళ్లీ సెట్స్‌పైకి వచ్చేశాం” అని ప్రకటించింది. హైదరాబాద్‌లో షూటింగ్‌ చేయనున్నట్లు వెల్లడించింది. ఇందులో భారీ వాటర్ సీక్వెన్స్‌లు ఉండనున్నట్లు చెప్పింది. దేవర సినిమాకు ఈ పోరాట సన్నివేశాలు చాలా కీలకమని సమాచారం. దాదాపు 10 రోజులపాటు ఈ సన్నివేశాల్ని తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ఇటీవల కూడా ఓ యాక్షన్ సీన్‌ను షూట్ చేశారు. ముందు యాక్షన్ పార్ట్‌ మొత్తం పూర్తి చేసి.. తర్వాత టాకీ మొదలుపెట్టాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం.

తొలిసారి తెలుగులోకి బాలీవుడ్ స్టార్లు

దేవర సినిమాను కేవలం తెలుగులో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. దీంతో ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్ స్టార్లను కూడా మూవీ టీమ్ భాగం చేస్తోంది. శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, హీరో సైఫ్ అలీఖాన్‌ తదితరులు ఇందులో భాగమయ్యారు. జాన్వీ హీరోయిన్‌గా, సైఫ్‌ విలన్‌గా కనిపించనున్నారు. వీరిద్దరికీ తెలుగులో ఇదే తొలి సినిమా కావడం గమనార్హం. మలయాళ నటుడు, ‘దసరా’ సినిమా విలన్.. షైన్ టామ్ చాకో కూడా ‘దేవర’లో కీలక పాత్రలో కనిపించనున్నాడు. మరోవైపు తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్.. మ్యూజిక్ అందించనున్నాడు. సినిమాటోగ్రఫర్‌‌గా రత్నవేలు, ఆర్ట్ డైరెక్టర్‌‌గా సాబు సిరిల్, ఎడిటర్‌‌గా శ్రీకర్ ప్రసాద్ పని చేస్తున్నారు. ఇందులో భాగమవుతున్న స్టార్లతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 2024 ఏప్రిల్ 5వ తేదీన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దేవర విడుదల కానుంది. ఆ రోజు బాక్స్‌ ఆఫీస్‌ వద్ద ‘మ్యాన్ ఆఫ్ మాసెస్‌’ విధ్వంసం ఖాయమంటూ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

జనతా గ్యారేజ్ తర్వాత మరోసారి

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా దేవర. గతంలో 2016లో జనతా గ్యారేజ్ వీరిద్దరి కాంబోలో వచ్చింది. ప్రకృతి గురించిన మెసేజ్‌తోపాటు మాస్‌ ఎలిమెంట్స్‌తో సినిమా సూపర్‌‌ హిట్‌ అయింది. ఈసినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రలో కనిపించారు. జనతా గ్యారేజ్ తర్వాత దాదాపు ఏడేళ్లకు ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి పని చేస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్‌‌’ విజయంతో తిరుగులేని ఇమేజ్‌ను ఎన్టీఆర్ సొంతం చేసుకోగా.. ‘ఆచార్య’ పరాజయంతో కొరటాల శివ తొలి సారి సక్సెస్ ట్రాక్ తప్పాడు. రెండు దశాబ్దాల తన కెరియర్‌‌లో సోలోగా ఫెయిల్యూర్‌‌ను కొరటాల శివ ఎదుర్కొన్నాడు. మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను వంటి సూపర్‌‌హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న సమయంలో ఆచార్యతో బ్రేక్ పడింది. ఆ సినిమా ఫలితం కొరటాలపై పెద్ద ఎఫెక్ట్‌నే చూపింది. దీంతో దేవరతో మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు అందకు తగ్గట్లుగా సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.