కేవలం బొట్టు పెట్టుకున్నందుకు పోయిన ప్రాణం

జార్ఖండ్ లో జరిగిన ఈ సంఘటన అక్కడ ప్రజలను చాలా దిగ్భ్రాంతుకు గురి చేసింది. పదో తరగతి చదువుతున్న ఒక బాలిక తను నుదుటిమీద బింది పెట్టుకుందని తన స్కూల్ టీచర్ చంప మీద కొట్టాడని ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. కేవలం ఆ అమ్మాయి బొట్టు పెట్టుకోవడం వల్లే ఆ అమ్మాయిని కొట్టవలసి వచ్చిందని ఆ స్కూల్ టీచర్ తెలిపారు. బొట్టు పెట్టుకోవడం అంత పెద్ద నేరమా! అసలు బొట్టు పెట్టుకుంటే కొట్టవలసిన అవసరం ఏముంది […]

Share:

జార్ఖండ్ లో జరిగిన ఈ సంఘటన అక్కడ ప్రజలను చాలా దిగ్భ్రాంతుకు గురి చేసింది. పదో తరగతి చదువుతున్న ఒక బాలిక తను నుదుటిమీద బింది పెట్టుకుందని తన స్కూల్ టీచర్ చంప మీద కొట్టాడని ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది. కేవలం ఆ అమ్మాయి బొట్టు పెట్టుకోవడం వల్లే ఆ అమ్మాయిని కొట్టవలసి వచ్చిందని ఆ స్కూల్ టీచర్ తెలిపారు. బొట్టు పెట్టుకోవడం అంత పెద్ద నేరమా! అసలు బొట్టు పెట్టుకుంటే కొట్టవలసిన అవసరం ఏముంది ఆ విద్యార్థిని మనోవేదనతో ఆత్మహత్య చేసుకోవలసి వచ్చింది.

టీచర్ చేసిన నిర్వాకం:

పోలీసు వారు తెలిపిన సమాచారం ప్రకారం జార్ఖండ్ కు చెందిన ఉషా కుమారి అనే విద్యార్థి తను ఎప్పట్లాగే స్కూలుకి వెళ్ళింది. అందరూ ప్రేయర్ కోసం అని చెప్పి ప్రేయర్ హాల్లో విద్యార్థులందరూ చేరుకుంటారు. ఆ సమయంలో విద్యార్థి మొదటి మీద బొట్టు చూసి ఒక టీచర్ ఆమె వద్దకు వచ్చి ఆమె చంపపై సొల్లున కొడతారు అప్పుడు అక్కడ ఉన్న విద్యార్థులు అందరూ ఈమె వైపే చూస్తూ ఉండిపోతారు స్కూల్ ఆవరణలో బొట్టు పెట్టుకోకూడదని చెప్తారు. అయితే ఆ సంఘటన జరిగిన తర్వాత హనుమాన్ గారి కాలనీకి చెందిన విద్యార్థిని బాధను తట్టుకోలేక తన ఇంట్లో ఫీలింగ్ ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ సంఘటన అక్కడ ప్రజలను దిగ్భ్రాంతులకు గురిచేసింది .

ఈ సంఘటన జరిగిన వెంటనే  టేట్లు మారి పోలీసు వారికి ఫిర్యాదు చేశారు. పోలీసు వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేశారు. వారికి అందిన సమాచారం ప్రకారం ఆ విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురైనట్లు స్కూల్లో అందరి ముందు తన పరువు పోయినట్లు కేవలం నుదుటిమీద బిందు పెట్టుకున్నందుకు తన టీచర్ అందరి ముందు తనని కొట్టారని అదేమీ అంత పెద్ద నేరం కాదని ఇలాంటి సంఘటనలు మరెన్నో చోటు చేసుకుంటున్నాయని విద్యార్థిని సూసైడ్ నోట్లో తెలిపింది. ఈ సంఘటనలో తన స్కూల్ ప్రిన్సిపాల్ మరియు వాళ్ల టీచర్ కారుకులని తన సూసైడ్ నోట్లో వివరంగా తెలిపింది. ఇది గమనించిన పోలీసు వారు వాళ్లని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వల్ల వాళ్ల తల్లిదండ్రులు అయినారు ఆ స్కూల్ టీచర్ మరియు ప్రిన్సిపల్ పై వివిధ సెక్షన్ల పై కేసును నమోదు చేసి విచారణ జరిపిస్తున్నారు.

ఇలాంటి సంఘటనలు మరెన్నో:

ఇలాంటి సంఘటనలు మనదేశంలో ముందు వారికే కొన్ని జరిగాయి. ఎక్కువగా సెల్ ఫోన్ వల్ల విద్యార్థులు చాలా అప్డేట్ అవుతున్నారు అదేవిధంగా చాలా దిగజారిపోతున్నారు. సెల్ఫోన్ ఆడుకోవడానికి ఇవ్వలేదని తన తల్లిపై దాడికి దిగాడు ఆ తర్వాత రోజే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని కొంతకాలం క్రితం విద్యార్థినిపై తన స్కూల్ టీచర్ అత్యాచారయత్నం చేశాడని ఫిర్యాదు చేసింది. అతనిపై కఠిన చర్యలు తీసుకున్నారు పోలీసులు. ఇలాంటి సంఘటనలు కూడా చాలానే జరుగుతున్నాయి మనదేశంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వారికి కఠిన చర్యలు తప్పవు.

ఉషాకుమారి కేసులో కూడా తన మనోహెదన వల్లే తను ఆత్మహత్యకు పాల్పడినట్లు తన సూసైడ్ నోట్లో తెలిపింది. దానికి సంబంధించిన వారిని చట్టం విడిచిపెట్టదు. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు టీచర్లపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టి మనం ముందు ప్రవేశపెడతారు.