GPS: బెయిల్ మీద విడుదలైన ఉగ్రవాదుల కోసం జిపిఎస్ పట్టీలు

GPS: జమ్ము కాశ్మీర్ (J&K)లోని పోలీసులు (Police) నిందితులు తప్పించుకోకుండా ఉండేందుకు జిపిఎస్ (GPS) పట్టీ (Anklet)లు ప్రవేశ పెట్టడం జరిగింది. బెయిల్ మీద విడుదలైన నిందితులు ఎక్కడికి వెళ్ళిపోకుండా ట్రాక్ (Tracking) చేసేందుకు సులభమైన పద్ధతి జిపిఎస్ (GPS) పట్టీలు (Anklet).  వీటిని ఎలా ఉపయోగిస్తారు.. ఎలా ట్రాక్ (Tracking) చేస్తారు అనే విషయం గురించి జమ్మూ కాశ్మీర్ పోలీసులు (Police) స్పష్టంగా చూపించారు. తప్పించుకునే మార్గం లేదు:  బెయిల్‌పై విడుదలైన ఉగ్రవాద నిందితులను పర్యవేక్షించేందుకు […]

Share:

GPS: జమ్ము కాశ్మీర్ (J&K)లోని పోలీసులు (Police) నిందితులు తప్పించుకోకుండా ఉండేందుకు జిపిఎస్ (GPS) పట్టీ (Anklet)లు ప్రవేశ పెట్టడం జరిగింది. బెయిల్ మీద విడుదలైన నిందితులు ఎక్కడికి వెళ్ళిపోకుండా ట్రాక్ (Tracking) చేసేందుకు సులభమైన పద్ధతి జిపిఎస్ (GPS) పట్టీలు (Anklet).  వీటిని ఎలా ఉపయోగిస్తారు.. ఎలా ట్రాక్ (Tracking) చేస్తారు అనే విషయం గురించి జమ్మూ కాశ్మీర్ పోలీసులు (Police) స్పష్టంగా చూపించారు.

తప్పించుకునే మార్గం లేదు: 

బెయిల్‌పై విడుదలైన ఉగ్రవాద నిందితులను పర్యవేక్షించేందుకు జమ్మూ కాశ్మీర్‌లోని పోలీసులు (Police) తొలిసారిగా జీపీఎస్ (GPS) ట్రాకర్ (Tracking) యాంక్‌లెట్‌ను (Anklet) ప్రవేశపెట్టారు. శనివారం బెయిల్‌పై విడుదలైన తర్వాత నిందితుడికి జిపిఎస్ (GPS) పట్టీ (Anklet)లు పెట్టారు. నిందితుడి ప్రతి క్షణాన్ని పర్యవేక్షించేందుకు పోలీసులు (Police) ఇటువంటి వినూత్న ప్రయత్నాన్ని చేయడం భారతదేశంలో ఇదే మొదటి కేసు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, బెయిల్‌పై ఉన్న నిందితులపై నిఘా ఉంచేందుకు అమెరికా, బ్రిటన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ట్రాకర్ (Tracking) యాంక్‌లెట్లు ఇప్పటికే వాడుకలో ఉన్నాయి. నిందితుడి కదలికలను ట్రాక్ (Tracking) చేయడానికి, బెయిల్‌పై బయటకు వచ్చిన వ్యక్తికి జిపిఎస్ (GPS) ట్రాకింగ్ (Tracking) డివైస్ కాలికి కట్టడం జరుగుతుంది

జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాద (terrorist) కార్యకలాపాలను పరిష్కరించడానికి భద్రతా దళాలు తీసుకునే కీలక చర్యల్లో ఎలక్ట్రానిక్ నిఘా ఒకటి. బెయిల్‌పై ఉన్న నిందితుడికి ట్రాకర్ (Tracking) పట్టి (Anklet) కట్టడం అనేది, దర్యాప్తులో కీలకపాత్ర పోషించనున్నట్లు పోలీసులు (Police) వెల్లడిస్తున్నారు జమ్మూలోని ప్రత్యేక NIA కోర్టు ఆదేశాల మేరకు ఈ పరికరాన్ని ప్రవేశపెట్టినట్లు పోలీసులు (Police) తెలిపారు. ఉగ్రవాదానికి సంబంధించిన కేసులో అరెస్టయిన వ్యక్తికి జీపీఎస్ ట్రాకర్ (Tracking) పట్టి (Anklet) తప్పనిసరిగా కట్టాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. నిందితుడు గులాం మహ్మద్ భట్ తీవ్రవాద (terrorist) నిరోధక చట్టం UAPA కింద తీవ్రవాద (terrorist) నిధుల కేసులో అరెస్టయ్యాడు. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

బెయిల్ షరతులలో భాగంగా భట్‌ను కఠినంగా పర్యవేక్షించాలని కోర్టు కోరింది. నిందితుడికి GPS ట్రాకర్ (Tracking) పట్టి (Anklet) తప్పకుండా పట్టి (Anklet) కట్టాలని పోలీసులను ఆదేశించింది.

హద్దు మీరుతున్న ఉగ్రవాదం:

గత జూన్‌లో ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా (Canada) ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ  (Khalistani) ఉగ్రవాది  (terrorist) హర్‌దీప్ సింగ్ నిజ్జార్ (Hardeep Singh Nijjar)‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) పార్లమెంటుకు తెలియజేశారు. కానీ ఇప్పటివరకు ఈ హత్య (Murder) కేసు (Case)లో, భారత దేశ హస్తం ఉందని ఎటువంటి ఆధారాలు లేవంటూ భారత్ (India) తేల్చి చెబుతోంది. ఇదిలా ఉండగా మరోవైపు నవంబర్ 19న విమానాన్ని (Plane) పేల్చి వేస్తామంటూ ఖలిస్తానీ (Khalistani) టెర్రరిస్ట్ (terrorist) బెదిరించడం జరిగింది. 

నవంబర్ 19న ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయం (Plane) మూసివేయబడుతుందని, దాని పేరు మార్చబడుతుందని ఖలిస్తానీ (Khalistani) టెర్రరిస్ట్ (terrorist) పన్నూన్ (Gurpatwant Singh Pannun) పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్‌లో, ఫైనల్ మ్యాచ్ జరిగేది అదే రోజు అని గుర్తుంచుకోమని సవాల్ విసిరాడు ఖలిస్తానీ (Khalistani) టెర్రరిస్ట్ (terrorist). అయితే నిజానికి, SFJ చీఫ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) బెదిరింపులు జారీ చేయడం ఇదే మొదటిసారి కాదు. సెప్టెంబరులో, ఖలిస్తానీ (Khalistani) ఉగ్రవాది (terrorist) హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై భారతదేశం – కెనడా మధ్య వివాదం జరుగుతున్న కారణంగా హిందూ-కెనడియన్లు కెనడాను విడిచిపెట్టాలని ఆయన కోరారు.

గురుపత్వంత్ సింగ్ పన్నూన్ (Gurpatwant Singh Pannun) చేసిన వీడియో (Video) ఇప్పుడు పలు సోషల్ మీడియా మాధ్యమల్లో స్ప్రెడ్ అవ్వడంతో, హిందూ ఫోరమ్ కెనడా లాయర్లు, కెనడాలోకి పన్నూన్ (Gurpatwant Singh Pannun) ప్రవేశాన్ని నిషేధించాలని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రిని కోరారు.