నాలుగో రోజుకు చేరుకున్న అనంతనాగ్ ఆపరేషన్

ఇటీవల బుధవారం నాడు అనంతనాగ్ జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు ఆఫీసర్లు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం భారతదేశంలో విషాద ఛాయాలు అలుముకునేలా చేసింది. అయితే ఈ ఆపరేషన్ ప్రస్తుతానికి నాలుగో రోజుకు చేరుకోగా ఇప్పటికీ టెర్రరిస్టుల ఆచూకీ కోసం వెతుకులాట కొనసాగుతూనే ఉంది.  ట్రైనింగ్ తీసుకున్న ఉగ్రవాదులు:  ఇటీవల కాలంలో జరిగిన ఆపరేషన్లలో, ఇప్పుడు నాలుగో రోజుకు చేరుకున్న అనంత టెర్రరిస్టుల వెతుకులాట కోసం, జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న ఆపరేషన్ కాస్త క్లిష్టమైనదని చెప్పుకోవచ్చు. నిజానికి […]

Share:

ఇటీవల బుధవారం నాడు అనంతనాగ్ జరిగిన ఎన్కౌంటర్ లో ముగ్గురు ఆఫీసర్లు ప్రాణాలు పోగొట్టుకున్న విషయం భారతదేశంలో విషాద ఛాయాలు అలుముకునేలా చేసింది. అయితే ఈ ఆపరేషన్ ప్రస్తుతానికి నాలుగో రోజుకు చేరుకోగా ఇప్పటికీ టెర్రరిస్టుల ఆచూకీ కోసం వెతుకులాట కొనసాగుతూనే ఉంది. 

ట్రైనింగ్ తీసుకున్న ఉగ్రవాదులు: 

ఇటీవల కాలంలో జరిగిన ఆపరేషన్లలో, ఇప్పుడు నాలుగో రోజుకు చేరుకున్న అనంత టెర్రరిస్టుల వెతుకులాట కోసం, జమ్మూ కాశ్మీర్ లో జరుగుతున్న ఆపరేషన్ కాస్త క్లిష్టమైనదని చెప్పుకోవచ్చు. నిజానికి ఉగ్రవాదుల స్థావరాల గురించి సమాచారం అందిన దగ్గర నుంచి జరుగుతున్న ఆపరేషన్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అంటే ఆ ఉగ్రవాదులు ఎంత కరుడ గట్టిన ఉగ్రవాదులో, ఎంత ట్రైనింగ్ తీసుకున్నారు చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వాళ్ళు ఉంటున్న ప్రదేశం దట్టమైన అడవులు, వాతావరణ వారికి అనుకూలంగా మారడంతో మరింత క్లిష్టమైన పరిస్థితుల్లో పడింది ఆపరేషన్. ఇప్పటివరకు జరిగిన ఆపరేషన్ లో సుమారు మూడుసార్లు ఎన్కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. పూంచ్ మరియు రాజౌరి జిల్లాలను కవర్ చేసే పిర్ పంజాల్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాల పెరుగుదల మధ్య ఈ ఆపరేషన్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్పీ వైద్ మాట్లాడుతూ, అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు వారి మద్దతుదారుల వ్యూహంలో మరో మార్పు తీసుకువచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు.

ఉగ్రవాదులు కోకెర్‌నాగ్‌లోని గాదుల్ అడవుల్లోని కొండపై ఉన్న ఒక గుహలో దాక్కున్నారు, ఇది వారికి రక్షణతో పాటు వారిని చుట్టుముట్టిన జాయింట్ ఆర్మీ మరియు పోలీసు బృందం ప్రతి అడుగును గమనించే విధంగా వారికి సహాయపడుతుంది. గుహకు దారితీసే ఇరుకైన మార్గం, ఉగ్రవాదులకు ప్లస్ పాయింట్ గా మారింది. బుధవారం తెల్లవారుజామున బృందం వారి మొదటి దాడిని ప్రారంభించినందున ముగ్గురు సిబ్బంది వారి ప్రాణాలను కోల్పోయారు. 

ఇది కూడా వారికి ప్లస్ పాయింట్: 

ఉగ్రవాదుల దగ్గర కావాల్సింది ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ముందుగానే అంచనా వేసుకున్న ఆహార నిల్వలు ఉన్నాయి. ఈ ప్లానింగ్ కారణంగా వారు 90 గంటలకు పైగా ఉగ్రవాదులు ఒకే చోట ఉండగలుగుతున్నారు. అంతేకాకుండా వారు దాక్కున్న చోటులో ఇద్దరు-ముగ్గురి కంటే ఉగ్రవాదుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి నివేదికలు.

ఇటీవల లష్కరే తోయిబా రిక్రూట్ అయిన ఉజైర్ ఖాన్ కూడా గుహలో చిక్కుకున్న ఉగ్రవాదుల్లో ఉన్నట్లు ఇప్పటికే సమాచారం. అతనికి ఈ ప్రాంతం గురించి బాగా తెలుసునని, ఇది వాళ్లకి ప్లస్ పాయింట్ అని, దీని కారణంగా ఉగ్రవాదులు లబ్ధి పొందుతున్నారని భావిస్తున్నారు అధికారులు. 

మరోవైపు దట్టమైన అడవుల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎక్కడ ఏ ఉంటున్నాయో ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకునే పరిస్థితి కూడా.. తెలుసుకోలేని పరిస్థితిగా మారింది. ముఖ్యంగా అడవుల కారణంగా దట్టమైన చీకటి, మరోపక్క ఉగ్రవాదులు తల దాచుకున్న గుహలు దగ్గరలో మంటలు దట్టమైన పొగ కారణంగా.. డ్రోన్స్ ని పంపించే అవకాశం కూడా లేకపోయింది.  అక్కడున్న వాతావరణం కారణంగా రెచ్చిపోయిన ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడుతున్నారు. అయితే మంగళవారం మొదలైన కాల్పులలో ఇప్పటికే ముగ్గురు ఉగ్రవాదులు, బరముల్లా ప్రాంతం నుంచి కాశ్మీర్ వైపుగా బోర్డర్ దాటుతున్న క్రమంలో ఎన్కౌంటర్లో మృతి చెందినట్లు సమాచారం. 

అంతేకాకుండా ఇది వరకు రోజుల్లా కాకుండా చాలా పకడ్బందీగా ప్లాన్లు వేస్తున్నారు ఉగ్రవాదులు. ముఖ్యంగా దట్టమైన అడవుల మధ్యలో కొండ ప్రాంతాలలో తలదాచుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు. దీని కారణంగా ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు, అంతే కాకుండా వారిని చుట్టుముట్టిన అధికారుల నుంచి తప్పించుకుని వారికి ప్రాణహాని కలిగించవచ్చే అని ఆలోచన కూడా చేస్తున్నారు ఉగ్రవాదులు.