జయశంకర్ సమాధానంతో ఆశ్చర్యపోయిన జర్నలిస్ట్

న్యూయార్క్ లో జరిగిన ఫారిన్ రిలేషన్స్ కి సంబంధించి కౌన్సిల్లో జయశంకర్ సమాధానం అందరిని ఆశ్చర్యపరచందని చెప్పుకోవాలి. ఉగ్రవాది నిజ్జర్ హత్యకు సంబంధించిన ప్రశ్న అడిగిన దానికి జయశంకర్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన సమాధానం వైరల్ గా మారింది.  వైరల్ గా మారిన జయశంకర్ సమాధానం:  న్యూయార్క్ లో జరిగిన ఫారెన్ రిలేషన్స్ కౌన్సిల్ కు సంబంధించి సమావేశంలో, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక జర్నలిస్ట్, ఉగ్రవాది […]

Share:

న్యూయార్క్ లో జరిగిన ఫారిన్ రిలేషన్స్ కి సంబంధించి కౌన్సిల్లో జయశంకర్ సమాధానం అందరిని ఆశ్చర్యపరచందని చెప్పుకోవాలి. ఉగ్రవాది నిజ్జర్ హత్యకు సంబంధించిన ప్రశ్న అడిగిన దానికి జయశంకర్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆయన సమాధానం వైరల్ గా మారింది. 

వైరల్ గా మారిన జయశంకర్ సమాధానం: 

న్యూయార్క్ లో జరిగిన ఫారెన్ రిలేషన్స్ కౌన్సిల్ కు సంబంధించి సమావేశంలో, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ మాట్లాడడం జరిగింది. ఈ క్రమంలోనే ఒక జర్నలిస్ట్, ఉగ్రవాది నిజ్జర్ హత్యకు సంబంధించిన గూఢచార సమాచారాన్ని ఐదుగురికి మాత్రమే షేర్ చేసినట్లు వచ్చిన నివేదికల గురించి, జయశంకర్ని అడిగారు. 

అయితే దీనికి సమాధానం ఇచ్చిన జయశంకర్ ఈ విధంగా మాట్లాడారు.. నిజానికి ఐదుగురిలో తాను లేనని, అంతేకాకుండా ఎఫ్బీఐ కి తమకి ఎటువంటి సంబంధం లేదని, అందులో తాము భాగం కాదని, సరైన వ్యక్తికి ప్రశ్న అడుగుంటే బాగుంటుందని జయశంకర్ అభిప్రాయపడ్డారు. అయితే ఆ ఐదుగురిలో ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డం, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ మాత్రమే భాగంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. 

ఏదిఏమైనాప్పటికీ కెనడాలో ఒక అటాక్ ద్వారా ఉగ్రవాది నిజ్జర్ హత్య జరిగిందని తెలిసిన విషయమే. అయితే సరైన ఆధారాలు డాక్యుమెంట్స్ చూపించకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని జయశంకర్ అభిప్రాయపడ్డారు.. అంతేకాకుండా సరైన సమాచారం ఉంటే ముందడుగు వేయచ్చని ఎటువంటి ఆధారాలు లేకుండా, ముందుకు సాగడం కష్టమని మరొకసారి గుర్తు చేశారు జయశంకర్. మరి ముఖ్యంగా భారతీయులకు కొత్త వీసాలను సస్పెండ్ చేసినందుకు కెనడా ప్రభుత్వం మీద మండిపడ్డారు.

కెనడాలో దౌత్యవేత్తలపై వస్తున్న బెదిరింపులు గురించి మరియు భారత కాన్సులేట్‌లపై దాడి చేయడం గురించి జైశంకర్ మాట్లాడుతూ, రాజకీయ కారణాల వల్ల, ఇప్పుడు జరుగుతున్న కొన్ని అంశాలు ఆందోళన కలిగించే విషయంగా ఉన్నాయని.. మన దౌత్యవేత్తలను బెదిరించే పరిస్థితి ఉంది, కాన్సులేట్‌లపై దాడులు జరిగాయి అడ్రస్ స్పష్టం చేశారు. అయితే ఏదైనా విషయం తనకి తెలిసిన పిమ్మట కచ్చితంగా అది పరిగణలోకి తీసుకుంటామని, దాని గురించి మరింత లోతుగా పరిశీలించే అవకాశం ఉంటుందని వెల్లడించారు జైశంకర్.

ఉగ్రవాది నిజ్జర్ హత్య: 

గత జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారత ప్రమేయం తప్పకుండా ఉందని, కెనడా ఆరోపణ చేసింది. అంతేకాకుండా, ప్రతీకారంగా ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది కూడా. జూన్‌లో బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జార్‌ను హతమార్చడంలో భారతీయ ఏజెంట్లకు సంబంధం ఉన్నట్లు విశ్వసనీయమైన ఆరోపణలు చేస్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పార్లమెంటుకు తెలియజేశారు. 

ఎక్స్ పెంటగన్ అఫీషియల్ మాటల్లో: 

కెనడా తన దేశంలో చనిపోయిన ఉగ్రవాది నిజానికి కెనడాలోకి ఒక ఫ్రాడ్ పాస్పోర్ట్ ద్వారా వచ్చాడంటూ గుర్తు చేశారు. అదే విధంగా ఒక ఉగ్రవాది కోసం దేశాల మధ్య చిన్నపాటి యుద్ధం జరగడం సబబు కాదు అన్నారు.  ఎక్స్ పెంటగన్ అఫీషియల్ చెప్పుకొచ్చారు. ముందు ముందు జరిగే వాటి గురించి ఆలోచించకుండా, కెనడా ప్రధానమంత్రి భారతదేశం మీద ఒక ఉగ్రవాది మరణం గురించి ఆరోపణలు చేయడం చాలా మందికి నచ్చలేదని కూడా చెప్పుకొచ్చారు. ఒకవేళ యూఎస్ తన సపోర్ట్ ని కేవలం ఒకే దేశానికి ఇవ్వాలనుకుంటే అది కచ్చితంగా భారతదేశమే అవుతుందని గుర్తు చేశారు.