Vinayakan: ‘జైలర్‌’ నటుడు వినాయకన్‌ అరెస్టు..!

‘జైలర్’ సినిమా(Jailer Movie)తో కొంత విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల్లోనూ పాపులర్ అయిన మలయాళ నటుడు వినాయకన్ (Vinayakan). ఆయనను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ‘జైలర్'(Jailer) సినిమాలో విలన్ రోల్ చేసిన మలయాళ నటుడు వినాయకన్ (Vinayakan) గుర్తు ఉన్నారా? ప్రేక్షకులు ఇప్పట్లో ఆయనను మర్చిపోవడం కష్టమే. సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోయిజం ముందు వినాయకన్ చూపించిన విలనిజం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘జైలర్’ విజయంతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో ఆయన పాపులర్ అయ్యారు. […]

Share:

‘జైలర్’ సినిమా(Jailer Movie)తో కొంత విరామం తర్వాత తెలుగు ప్రేక్షకుల్లోనూ పాపులర్ అయిన మలయాళ నటుడు వినాయకన్ (Vinayakan). ఆయనను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.

‘జైలర్'(Jailer) సినిమాలో విలన్ రోల్ చేసిన మలయాళ నటుడు వినాయకన్ (Vinayakan) గుర్తు ఉన్నారా? ప్రేక్షకులు ఇప్పట్లో ఆయనను మర్చిపోవడం కష్టమే. సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోయిజం ముందు వినాయకన్ చూపించిన విలనిజం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘జైలర్’ విజయంతో తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో ఆయన పాపులర్ అయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయన పేరు వార్తల్లో నిలిచింది. అందుకు కారణం… పోలీస్ కేసు..! పూర్తి వివరాల్లోకి వెళితే… 

Read More: Chandrababu: చంద్రబాబు లేఖపై డీజీపీ సీరియస్..

మద్యం మత్తులో గొడవ

వినాయకన్(Vinayakan) మలయాళీ. కేరళలోని ఎర్నాకుళం(Ernakulam)లో ఉంటున్నారు. మద్యం(Alcohol) సేవించి అపార్ట్మెంట్ వాసులకు సమస్యలు కలిగించిన ఘటనలో ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్ స్టేషన్ అధికారులు ఆయనను అరెస్ట్(Arrest) చేశారు. పోలీస్ స్టేషనుకు తీసుకు వచ్చిన తర్వాత కూడా వినాయకన్ గొడవ చేశారని సమాచారం. దాంతో కొచ్చికి ఆయనను షిఫ్ట్ చేశారట.  ప్రస్తుతం కేరళ పోలీసుల అధీనంలో వినాయకన్ ఉన్నారు. వైద్య పరీక్షల కోసం ఆయనను ఆస్పత్రికి తీసుకు వెళ్లినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. 

అయితే వినాయకన్‌ (Vinayakan) అరెస్ట్ తర్వాత అతని గురించి చాలా విషయాలు బయటికి వస్తున్నాయి. ఇంతకు ముందు కూడా అతనిని పోలీసులు అరెస్ట్‌ చేశారని, కానీ ఆయనలో మార్పు మాత్రం రావడం లేదంటూ సోషల్ మీడియా(Social Media)లో కొన్ని వార్తలు దర్శనమిస్తున్నాయి. గతంలో ఓ మోడల్‌ను వేధించిన కేసులో అతడిని అరెస్ట్‌ చేయగా.. ఆ తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారని అక్కడి మీడియా సర్కిల్స్‌లో సైతం వార్తలు వినిపిస్తుండటం గమనార్హం. మంచి నటుడు, కానీ ఇలాంటి చేష్టలతో వచ్చిన నేమ్, ఫేమ్‌ని నాశనం చేసుకుంటున్నాడని.. అతని అభిమానులు సైతం విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన బెయిల్‌పై బయటికి వచ్చినట్లుగా తెలుస్తోంది.

‘జైలర్’ విజయాన్ని ఊహించలేదు

‘జైలర్’ విడుదలైన తర్వాత ఇంత ఘన విజయం సాధిస్తుందని తాను కలలో కూడా ఊహించలేదని వినాయకన్(Vinayakan) చెప్పారు. సినిమా గ్రాండ్ సక్సెస్ గురించి ఆయన మాట్లాడుతూ ”మా సినిమాలో ఓ డైలాగ్ ఉంది కదా! ‘కలలో కూడా ఊహించకండి’ అని! ప్రస్తుతం నా పరిస్థితి కూడా అదే” అని చెప్పారు. ‘జైలర్’ కంటే ముందు ఓ తమిళ సినిమాలో వినాయకన్ నటించారు. విశాల్ ‘తిమిరు’ (తెలుగులో ‘పొగరు’ పేరుతో విడుదల అయ్యింది)లో ఆయన విలన్ రోల్ చేశారు.

త్వరలో విక్రమ్ ‘ధ్రువ నక్షత్రం’లోనూ…

‘జైలర్’ కంటే ముందు తమిళంలో వినాయకన్ ఓ సినిమా చేశారు. అది విడుదల కావడం ఆలస్యం అయ్యింది. అదే చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘ధ్రువ నక్షత్రం’ (Dhruva Natchathiram). మంగళవారం ఆ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ఆ రోజే వినాయకన్ అరెస్ట్ అయ్యారు.

‘జైలర్'(Jailer) కంటే ముందు ‘ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'(RRR), ‘కెజియఫ్'(KGF) సినిమాల్లో తనకు విలన్ రోల్స్ ఆఫర్ చేసినప్పటికీ… చేయలేదని చెప్పారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’లో కనుక వినాయకన్ నటించి ఉంటే… తెలుగులో మరింత పాపులర్ అవ్వడమే కాదు, ఆస్కార్ అవార్డు సాధించిన ‘నాటు నాటు’ పాట ఉన్న సినిమాలో భాగం అయ్యేవారు. ‘కెజియఫ్’ కూడా జాతీయ స్థాయిలో భారీ విజయం సాధించింది. ఈ రెండు సినిమాలు మిస్ చేసుకోవడం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు మిస్ అయ్యారని చెప్పుకోవాలి.