జైలు అధికారుల పొరపాటు..మరో 3 ఏళ్ల జైలు శిక్ష

గుజరాత్ ప్రభుత్వంలో ఒక నిందితుడికి, అనుకోని సంఘటన కారణంగా మరో మూడు సంవత్సరాల జైలు శిక్ష పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు సంవత్సరాల క్రితం మెయిల్ ద్వారా వచ్చిన బెయిల్ ఆర్డర్ అటాచ్మెంట్ ఓపెన్ చేయడం అవ్వట్లేదు అని చెప్పిన అధికారులు, నిందితుడికి మరో మూడు సంవత్సరాల శిక్ష పడేలా చేసినట్లు అయింది. ఇందుకుగాను స్పందించిన గుజరాత్ హైకోర్టు నిందితుడికి విడుదలైన 14 రోజులలోగా, లక్ష రూపాయల నగదు పరిహారం అందించాల్సిందిగా కోరింది.  మరో […]

Share:

గుజరాత్ ప్రభుత్వంలో ఒక నిందితుడికి, అనుకోని సంఘటన కారణంగా మరో మూడు సంవత్సరాల జైలు శిక్ష పడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు సంవత్సరాల క్రితం మెయిల్ ద్వారా వచ్చిన బెయిల్ ఆర్డర్ అటాచ్మెంట్ ఓపెన్ చేయడం అవ్వట్లేదు అని చెప్పిన అధికారులు, నిందితుడికి మరో మూడు సంవత్సరాల శిక్ష పడేలా చేసినట్లు అయింది. ఇందుకుగాను స్పందించిన గుజరాత్ హైకోర్టు నిందితుడికి విడుదలైన 14 రోజులలోగా, లక్ష రూపాయల నగదు పరిహారం అందించాల్సిందిగా కోరింది. 

మరో మూడేళ్ల జైలు శిక్ష: 

బెయిల్ ఆర్డర్ అటాచ్‌మెంట్‌ను తెరవలేమని అధికారులు చెప్పడంతో మూడేళ్లపాటు అదనంగా జైలులో గడిపిన దోషికి గుజరాత్ ప్రభుత్వం రూ.లక్ష పరిహారం చెల్లించేందుకు సిద్ధమైంది. నష్టపరిహారం ఇవ్వాలని గుజరాత్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 27 ఏళ్ల చందంజీ ఠాకోర్‌ అనే ఒక నిందితుడు, హత్య కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్నప్పుడు, అతని శిక్ష సెప్టెంబర్ 29, 2020న సస్పెండ్ చేయడం జరిగింది.

అయితే, హైకోర్టు రిజిస్ట్రీ తమకు పంపిన బెయిల్ ఆర్డర్‌ను తెరవలేమని జైలు అధికారులు పేర్కొనడంతో, అతను 2023 వరకు జైలులోనే ఉన్నాడు.. అయితే నిందితుడు తాజాగా బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం జస్టిస్ ఏఎస్ సుపెహియా, జస్టిస్ ఎంఆర్ మెంగ్డేలతో కూడిన డివిజన్ బెంచ్ దోషికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లా సెషన్స్ కోర్టుకు కూడా ఈమెయిల్ పంపినప్పటికీ, దోషిని బెయిల్‌పై విడుదల చేసే ఉత్తర్వు సక్రమంగా అమలయ్యేలా చూడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని కోర్టు పేర్కొంది.

అభ్యర్థి, నిజానికి మూడు సంవత్సరాల క్రితమే విడుదల అవ్వాల్సి ఉన్నప్పటికీ, ఈ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుకు సంబంధించి రిజిస్ట్రీ లేదా సెషన్స్ కోర్టును సంప్రదించడానికి జైలు అధికారులు శ్రద్ధ చూపనందున మాత్రమే జైలులోనే ఉండవలసి వచ్చింది అని పేర్కొంది.  బెయిల్ పొందినప్పటికీ దాదాపు మూడేళ్ల జైలు జీవితం గడిపిన ఖైదీ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు అతనికి పరిహారం మంజూరు చేయడానికి మొగ్గు చూపుతున్నట్లు తెలిపింది.

ఈ కేసుపై, కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ కేసులో అవసరమైన చర్యలు తీసుకోలేకపోయామని జైలు అధికారులు పేర్కొన్నారు. మెయిల్‌తోపాటు వచ్చిన అటాచ్‌మెంట్‌ను కూడా తెరవలేకపోయామని చెప్పారు. కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, గుజరాత్ హైకోర్టు కూడా బెయిల్ మంజూరైన ఖైదీల వివరాలను సేకరించాల్సిందిగా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA)లను ఆదేశించింది. 

ఇందులో తప్పు ఎవరిది: 

నిజానికి హత్య చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీ, మూడు సంవత్సరాల క్రితమే తన స్వేచ్ఛను తిరిగి పొందాల్సిన అవసరం ఉంది. మూడు సంవత్సరాల క్రితమే తన జీవిత ఖైదీ శిక్షను సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. కానీ అనుకోని సంఘటన కారణంగా, అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పుకోదగ్గ సంఘటన కారణంగా, నిందితుడు మరో మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. 

అంతేకాకుండా ఒకవేళ బెయిల్ ఆర్డర్ మెయిల్ ద్వారా వచ్చినప్పటికీ ఒకవేళ ఆ అటాచ్మెంట్ ఓపెన్ అవ్వనప్పటికీ, పై అధికారులను సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అవన్నీ పక్కనపెట్టిన అధికారుల మీద విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాధితులు వాపోతున్నారు. ఇందులో తప్పు కచ్చితంగా అధికారుల మీద ఉంది అని, నిందితుడికి న్యాయం జరగాలి అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో తప్పుచేసి జైలుకు వెళ్లిన నిందితుడిది తప్ప? మెయిల్ ద్వారా వచ్చిన బెయిల్ పక్కన పెట్టిన అధికారులది తప్ప? మీరు ఏమనుకుంటున్నారు?