జగన్ కు కావాల్సింది అదొక్కటే

ఏపీ రాజకీయాలు రంజు మీద నడుస్తున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఏపీ ఏసీబీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన దగ్గరి నుంచి రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. వైసీపీ పై టీడీపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇవి ప్రతికార రాజకీయాలని దుయ్యబడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తప్పకుండా బుద్ది చెబుతామని అంటున్నారు. ముత్యం లాంటి చంద్రబాబు అరెస్ట్ చేయడం చాలా పొరపాటని అంటున్నారు.  రెచ్చిపోతున్న బాలయ్య.. చంద్రబాబు అరెస్ట్ తర్వాత హిందూపురం ఎమ్మెల్యే, […]

Share:

ఏపీ రాజకీయాలు రంజు మీద నడుస్తున్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో ఏపీ ఏసీబీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిన దగ్గరి నుంచి రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. వైసీపీ పై టీడీపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇవి ప్రతికార రాజకీయాలని దుయ్యబడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తప్పకుండా బుద్ది చెబుతామని అంటున్నారు. ముత్యం లాంటి చంద్రబాబు అరెస్ట్ చేయడం చాలా పొరపాటని అంటున్నారు. 

రెచ్చిపోతున్న బాలయ్య..

చంద్రబాబు అరెస్ట్ తర్వాత హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరో బాలకృష్ణ సర్వం తానై టీడీపీని నడిపిస్తున్నారు. మరో పక్క ఇదే కేసులో చంద్రబాబు తనయుడు లోకేష్ కూడా అరెస్ట్ అవుతాడని అంతా భావిస్తుండడంతో ఇక బాలయ్య టీడీపీకి పెద్ద దిక్కుగా మారతారని టాక్ నడుస్తోంది. ఇప్పటికే అధికార వైసీపీ మీద బాలయ్య సెటైర్లు వేస్తూ ఫైర్ అవుతున్నారు. దు:ఖంలో ఉన్న పార్టీ కార్యకర్తలను ఓదారుస్తున్నారు. సీఎం జగన్ కు ప్రతీకార రాజకీయాలు ఒక్కటే తెలుసని అందుకే తాను 16 సంవత్సరాలు జైలులో ఉన్నాడు కాబట్టే చంద్రబాబును కనీసం 16 నిమిషాలైనా జైలులో ఉంచాలని అతడు కంకణం కట్టుకున్నాడని దుయ్యబట్టాడు. 

ప్రజలారా జాగ్రత్త… 

అధికార వైసీపీని దుయ్యబట్టడం మాత్రమే కాదు బాలయ్య బాబు రాష్ట్ర ప్రజలకు కూడా కీలక సూచనలు చేశారు. అభివృద్ధిని చూసి ప్రజలు తమ ఓటు హక్కును తెలివిగా వినియోగించుకోవాలని కోరారు. ప్రతీకార రాజకీయాలు చేసే వ్యక్తులను దూరం పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ…  ప్రతి పౌరుడు సైనికుడిగా మారాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అంతే కాకుండా రాష్ట్రాన్ని మనమంతా కలిసి కాపాడుకుందామని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని ఆరోపించారు. వైసీపీ నేతలకు ప్రతీకార రాజకీయాల మీద తప్ప అభివృద్ధి మీద ధ్యాస లేదని అన్నారు. అందుకే ఇలా ప్రతిపక్ష నాయకులను జైల్లో వేస్తూ శునకానందం పొందుతున్నారని తెలిపారు. 

అవును నాయకత్వం వహిస్తా.. 

చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత టీడీపీని ఎవరు నడిపిస్తారనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య తానున్నానంటూ ముందుకు వచ్చారు. పెద్ద దిక్కు అరెస్ట్ అయి దిక్కు తోచని పరిస్థితిలో ఉన్న పార్టీని ముందుకు నడిపిస్తానని అన్నారు. ఆయన మాట్లాడుతూ… అవినీతి, అణిచివేతపై పోరులో ప్రజలు ముందుంటారని తెలిపారు. వారికి తాను తప్పకుండా నాయకత్వం వహిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రతీకారాన్ని చల్లార్చుకోవడంపైనే దృష్టి సారించారని,  అభివృద్ధిపై తనకు కనీసం పట్టింపు లేదని ఆరోపించారు. కానీ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. చంద్రబాబు నాయుడుపై కచ్చితమైన సాక్ష్యాలు లేకపోయినా కేవలం కేసులో ఇరికించారని బాలయ్య దుయ్యబట్టారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా ఈ కేసు నుంచి బయటపడతారని తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవడానికే జగన్ ఆసక్తి చూపుతున్నారని ఎద్దేవా చేశారు.

జగన్ ప్లాన్ అదే… 

జగన్ జైలుకు వెళ్లినందుకే టీడీపీ నేతలందరినీ జైలుకు పంపే ఆలోచనలో తను ఉన్నాడని బాలకృష్ణ అన్నారు. జగన్ పీడీ యాక్ట్, ఈడీ, సీబీఐ కేసులు ఎదుర్కొంటున్నారని, గత పదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, ఇప్పుడు చంద్రబాబును కూడా ఇలా కోర్టుల చుట్టూ తిరిగేలా చేయాలని జగన్ ఆశిస్తున్నట్లు తెలిపారు. పేదల విద్య కోసం చంద్రబాబు నాయుడు ఎన్నో పాఠశాలలు నిర్మించారని.. అటువంటి చంద్రబాబును అసలు కేసే లేకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమని అన్నారు. వాస్తవానికి స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం అనేది గుజరాత్‌లో ప్రారంభించబడిందని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్‌ లో కి ఎంటరైందని పేర్కొన్నారు. రూ. 3,281 కోట్ల నిధులతో ఈ కార్యక్రమం చేపట్టామని బాలకృష్ణ తెలిపారు. సీమెన్స్ సాఫ్ట్‌ వేర్‌ ను అందించగా, డిజైన్ టెక్ శిక్షణను అందించిందని తెలిపారు. తన నియోజకవర్గం హిందూపూర్‌ లో స్కిల్ డెవలప్‌ మెంట్ మేళా నిర్వహించి దాదాపు 1200 మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా 2.13 లక్షల మంది యువతకు శిక్షణ ఇచ్చామని, వారిలో 72 వేల మందికి ఉద్యోగాలు లభించాయని పేర్కొన్నారు.