పేదల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జగన్

అందరి కోసం అమరావతి: అమరావతిలోని ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతిపాదిక ప్రకారం గానే, 50,703 ఇళ్ల హౌసింగ్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి. అమరావతి కొంతమంది ధనవంతులకు బలవంతులది కాదని, అన్ని వర్గాల ప్రజలకు చెందుతుందని, గృహనిర్మాణ ప్రాజెక్ట్ సామాజిక న్యాయ యుగానికి నాంది పలుకుతుందని అన్నారు జగన్. గ్రామంలో ఒక లబ్ధిదారునికి కేటాయించిన స్థలంలో పేదల కోసం నిర్మించిన మోడల్‌ ఇంటిని జగన్‌ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ […]

Share:

అందరి కోసం అమరావతి:

అమరావతిలోని ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రతిపాదిక ప్రకారం గానే, 50,703 ఇళ్ల హౌసింగ్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి. అమరావతి కొంతమంది ధనవంతులకు బలవంతులది కాదని, అన్ని వర్గాల ప్రజలకు చెందుతుందని, గృహనిర్మాణ ప్రాజెక్ట్ సామాజిక న్యాయ యుగానికి నాంది పలుకుతుందని అన్నారు జగన్. గ్రామంలో ఒక లబ్ధిదారునికి కేటాయించిన స్థలంలో పేదల కోసం నిర్మించిన మోడల్‌ ఇంటిని జగన్‌ ప్రారంభించారు.

అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కోర్టులను ఆశ్రయించి ఇళ్ల స్థలాల ‘పట్టా’ పంపిణీలో అడ్డంకులు సృష్టించిన దుష్ట శక్తులపై ఈ ఇళ్ల పునాది కార్యక్రమం విజయం సాధించిందన్నారు. మూడు సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత పేదలు సామాజిక న్యాయం సాధించినందున ఈరోజు ప్రత్యేకంగా నిలిచిపోతుందని, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఇక నుండి అందరికీ ఇల్లు అని జగన్ ప్రకటించారు.

పేదలకు ఇళ్ల నిర్మాణాలను వ్యతిరేకిస్తూ అమరావతిలో ఉంటున్న కొంతమందిని రెచ్చగొట్టి ప్రతిపక్షాలు పబ్బం కడుపుకోవాలని చూస్తున్నట్టు, ఇలాంటి నీచ రాజకీయాలు ఎప్పుడు చూడలేదని జగన్ మోహన్ రెడ్డి ఒక పార్టీని ఉద్దేశిస్తూ మాట్లాడారు. 

శంకుస్థాపన సక్సెస్: 

హౌసింగ్ ప్రాజెక్ట్ కోసం తమ ప్రభుత్వం ₹1829.57 కోట్లు ఖర్చు చేస్తోందని జగన్ చెప్పారు. ఇళ్ల నిర్మాణానికి ₹1371.41 కోట్లు, రోడ్లు, విద్యుత్తు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ₹384.42 కోట్లు ఖర్చు చేయనున్నారు. జగనన్న కాలనీలుగా పేరు పెట్టిన ఈ హౌసింగ్ కాలనీలలోని నివాసితుల విద్య మరియు ఆరోగ్య అవసరాలను తీర్చడానికి 11 అంగన్‌వాడీ కేంద్రాలు, 11 పాఠశాలలు, 11 డిజిటల్ లైబ్రరీలు మరియు 12 ఆసుపత్రులతో సహా 45 సామాజిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం ₹73.74 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన చెప్పారు. నిర్మాణం పూర్తయితే, ఇప్పుడు ₹ 2.3 లక్షలతో నిర్మిస్తున్న ఒక్కో ఇంటి విలువ దాదాపు ₹ 12 లక్షలకు పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం, మొత్తం రాజధాని ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగా అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా ఇందులో 9 ప్రత్యేకమైన అంశాలు – ప్రభుత్వ నగరం, న్యాయ నగరం, ఫైనాన్స్ సిటీ, ఎడ్యుకేషన్ & నాలెడ్జ్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, కల్చరల్ సిటీ, ఎలక్ట్రానిక్స్ సిటీ మరియు టూరిజం సిటీ.

ఎవరు ఆపినా ఆగదు..: 

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డి నరేంద్ర విమర్శిస్తూ, ఇప్పుడు, రాజధాని ప్రాంతంలో ఇళ్ళు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రంథాలయాలు మరియు మార్కెట్ యార్డులు ఏర్పాటు చేయడం, నిజానికి సాధారణంగా రాజధాని నగరం కోసం ఏర్పాటుచేసిన ఒక ప్రణాళికను పక్కదారి పట్టించడమే అంటూ మాట్లాడారు. 

అసెంబ్లీ ఎన్నికల తరుణంలో పేదలను మభ్యపెట్టడానికే జగన్ హడావుడిగా హౌసింగ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉన్నా లేదన్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శలు కురిపిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం స్థలాలు ఇచ్చిన పేదల కోసం ఇలాంటి ఇళ్ల నిర్మాణాలను ఆయన ముందుగా ఎందుకు చేపట్టలేదు? ఇది ఇళ్ల పేరుతో పేదలను మోసం చేయడం తప్ప మరొకటి కాదు అని టీడీపీ నేత ఆరోపించారు. 

హేళన చేసిన వైయస్సార్ పార్టీ: 

కార్యక్రమం అనంతరం ట్విట్టర్ లో వైయస్సార్ పార్టీ కార్యకర్తలు కార్యక్రమానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ, టిడిపి పార్టీ నాయకులను కన్నీళ్లు తుడుచుకోవడానికి టిష్యూ పేపర్లు రెడీ పెట్టుకోమని హేళన చేయడం జరిగింది.