షో ఆఫ్ చేయడానికే ప్రతిపక్షాల మణిపూర్ పర్యటన

భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి కూటమి పేరు INDIA గా ఏర్పాటు చేశారు. ఈ కూటమి లోని 21 మంది ఎంపీల బృందం మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు(Manipur Violence)జరిగిన సహాయక శిబిరాలకు చేరుకుని కుకీ నాయకులను కలుసుకోవడం తో పాటు జాతి కలహాల బాధితులను పరామర్శించారు.  విపక్ష కూటమి ఇండియా(India alliance) ఎంపీల బృందం మణిపూర్ వెళ్లడాన్ని కేంద్ర ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఖండించారు. ఇది కేవలం రాజకీయ పర్యాటకం మాత్రమే అని […]

Share:

భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీలు కూటమిగా ఏర్పడి కూటమి పేరు INDIA గా ఏర్పాటు చేశారు. ఈ కూటమి లోని 21 మంది ఎంపీల బృందం మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు(Manipur Violence)జరిగిన సహాయక శిబిరాలకు చేరుకుని కుకీ నాయకులను కలుసుకోవడం తో పాటు జాతి కలహాల బాధితులను పరామర్శించారు. 

విపక్ష కూటమి ఇండియా(India alliance) ఎంపీల బృందం మణిపూర్ వెళ్లడాన్ని కేంద్ర ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఖండించారు. ఇది కేవలం రాజకీయ పర్యాటకం మాత్రమే అని ఎంపీల బృందం గురించి వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల ముందు జరిగిన హింసాకాండ గురించి ప్రతిపక్షాలు ఎందుకు స్పందించలేదు అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాల హయాంలో మణిపూర్ రాష్ట్రం అతలాకుతలం అయినప్పుడు పార్లమెంట్ లో విపక్షాలు ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు అని అడిగారు. 

పశ్చిమ బెంగాల్ లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు పై విపక్ష కూటమి ఎందుకు మౌనంగా ఉంటుంది అని, బెంగాల్ కు వచ్చి ఇక్కడి పరిస్థితులను ఎందుకు పరిశీలించడం లేదు? పశ్చిమ బెంగాల్(West Bengal) లో దారుణంగా హింసించబడిన మహిళల కోసం ఈ 21 మంది ఎంపీల ఆత్మలు క్షోబించడం లేదా? బెంగాల్ కు వస్తె వారి మీద దాడి జరుగుతుంది అని ఎంపీలు భయపడుతూ ఉన్నారా? అని అనురాగ్ ఠాకూర్ ప్రశ్నించారు. 

ప్రతిపక్ష కూటమి ఎంపీలు మణిపూర్ కు వెళ్ళవచ్చు అని కానీ వారు వెళ్ళింది కేవలం రాజకీయం చేయడానికి మాత్రమే అని కూడా అనురాగ్ ఠాకూర్ అంటూ ఇది రాజకీయ పర్యాటకం అని అన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి కేవలం షో ఆఫ్ చేస్తుందని అన్నారు. 

మణిపూర్ రాష్ట్రం నెలల తరబడి మూసి ఉన్నప్పుడు వీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని, సమస్య పరిష్కారం అయ్యాక ఈ ఎంపీలకు పార్లమెంట్ కు రావడానికి అనర్హులు అని కూడా అన్నారు. పార్లమెంటులో మణిపూర్ అల్లర్ల (Manipur Violence)విషయం చర్చించడానికి రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరియు హోమ్ శాఖ మంత్రి అమిత్ షా కూడా సిద్దంగా ఉన్నారు అని కానీ ప్రతిపక్షాలు అనవసరంగా ఈ విషయాన్ని రాజకీయం చేయాలి అని చూస్తున్నారు అని బీజేపీ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేగ్వాల్ కూడా ప్రతిపక్షాలను విమర్సించారు. మణిపూర్ పర్యటన ముసుగులో రాజకీయం చేస్తున్నారు అని, మణిపూర్ లో పరిస్థితి ను విశ్లేషించడానికి బదులుగా విమనాయశ్రయం నుండి ఫోటోలు పెడుతున్నారు , ఇది రాజకీయ పర్యాటకం అని వ్యాఖ్యానించారు. 

మణిపూర్ రాష్ట్రంలో మే నెల నుండి జరుగుతున్న అల్లర్ల  (Manipur Violence) కారణంగా దాదాపు 160 మంది చనిపోయారు, ఇంఫాల్ లోయలో ఉన్న మేయిటీ వర్గానికి మరియు కొండలను ఆక్రమించిన కుకీలకు మధ్య చెలరేగిన వివాదం హింసాత్మకంగా మారింది. జాతి కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రం లో పరిస్థితి అంచనా వేయడానికి ప్రతిపక్ష ఇండియా కూటమికి(India alliance) చెందిన 21 మంది ఎంపీల బృందం రెండు రోజుల పాటు మణిపూర్ రాష్ట్రం లో పర్యటించింది.