కర్ణాటక బ్యాంకుల్లో 1000 కోట్లు గోల్ మాల్! ఐటీ సోదాలలో విస్తుపోయే నిజాలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరుణంలో భారీ గోల్ మాల్ వ్యవహారం బయటకు వచ్చింది. సరైన పత్రాలు తీసుకోకుండా, పత్రాలు పరిశీలించకుండా సహకార బ్యాంకుల్లో చెక్, డిస్కౌంట్‌ల రూపంలో ఏకంగా 1000 కోట్లు గోల్ మాల్ జరిగిందని ఐటి అధికారులు చేసిన సోదాల్లో వెలుగులోకి రావడంతో హాట్ టాపిక్‌గా మారింది.  బ్యాంకులో మార్చి 31వ తేదీన ఆదాయక పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. సహకార బ్యాంకుల లోని పలు రికార్డులు పరిశీలించిన అధికారులకి దిమ్మ తిరిగిపోయింది. చలామణిలో […]

Share:

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరుణంలో భారీ గోల్ మాల్ వ్యవహారం బయటకు వచ్చింది. సరైన పత్రాలు తీసుకోకుండా, పత్రాలు పరిశీలించకుండా సహకార బ్యాంకుల్లో చెక్, డిస్కౌంట్‌ల రూపంలో ఏకంగా 1000 కోట్లు గోల్ మాల్ జరిగిందని ఐటి అధికారులు చేసిన సోదాల్లో వెలుగులోకి రావడంతో హాట్ టాపిక్‌గా మారింది. 

బ్యాంకులో మార్చి 31వ తేదీన ఆదాయక పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. సహకార బ్యాంకుల లోని పలు రికార్డులు పరిశీలించిన అధికారులకి దిమ్మ తిరిగిపోయింది. చలామణిలో లేని కంపెనీల పేరుతో, అనుమానాస్పద రీతిలో భారీ మొత్తంలో చెక్‌లు డిస్కౌంట్ చేశారని అధికారుల విచారణలో తేలింది. చెక్ లు డిస్కౌంట్ చేసే సమయంలో సహకార బ్యాంకు అధికారులు సిబ్బంది ఖాతాదారుల నుంచి నియామకాలకు అనుగుణంగా వారి కేవైసీ డాక్యుమెంట్స్ ఏమాత్రం పరిశీలించకుండా, కనీసం కేవైసీ పత్రాలను కూడా తీసుకోకుండా.. కోట్లకు కోట్ల డబ్బు చెక్ డిస్కౌంట్ రూపంలో చేతులు మారాయని వేరే ఖాతాలకు డబ్బు బదిలీ చేశారని, చాలామందికి నేరుగా డబ్బులు ఇచ్చేసారని అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి.  

 సహకార బ్యాంకులపై ఐటి అధికారులు దాడులు చేయగా.. సుమారు వెయ్యికోట్ల సొమ్ము ఉన్నట్లు బయటపడింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా కాంట్రాక్టర్లు, పెద్ద కంపెనీలకు చెందిన సహకార బ్యాంకు ఖాతాలో పెద్ద ఎత్తున ఆర్థిక అక్రమాలు జరిగాయని ఐటి అధికారులు చెబుతున్నారు. ఈ బ్యాంకు ఖాతాల ద్వారా నల్లధనం తెల్లదనంగా మారుతుందని అనుమానం వ్యక్తం చేసింది. 

సహకార బ్యాంకులో సక్రమంగా నియమాలు పాటించకుండా సరైన పత్రాలు పరిశీలించకుండా రసీదులు ఇవ్వకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు చెక్ డిస్కౌంట్ రూపంలో 15 కోట్లకు పైగా రుణాలు ఇచ్చేశారని, ఐటి అధికారులు చేసిన సోదాల్లో ఊహించని నిజాలు బయటికి వచ్చాయి. సహకార బ్యాంకుల్లోని వివిధ పేర్లతో ఉన్న అకౌంట్ ల నుంచి హౌసింగ్ సొసైటీల నుంచి వివిధ బోగస్ కంపెనీల పేర్లతో ఉన్న అకౌంట్ల నుంచి సుమారు  1000 కోట్లకు పైగా గోల్మాల్ జరిగిందని వెలుగులోకి వచ్చింది.  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సహకార బ్యాంకులలోని నిర్వహణ వ్యక్తులు తమ వ్యక్తిగత ఉపయోగం కోసం యాజమాన్యంలోని వివిధ సంస్థలు సంస్థల ద్వారా తగిన డాక్యుమెంట్స్ తీసుకోకుండా బ్యాంకు నిధులు మళ్లించారని ఐటి అధికారులు కనుగొన్నారు. ఐటీ అధికారులు సోదాలు చేయడంతో 3.3 కోట్లకు పైగా లెక్క చూపని నగదు , రెండు కోట్లకు పైగా విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

వ్యాపార సంస్థలు ఆదాయపు పన్ను చట్టం 1961 లోని నిబంధనలను కూడా అతిక్రమిస్తున్నాయి. ఇది ఖాతా చెల్లింపుదారు చెక్కు ద్వారా కాకుండా అనుమతించదగిన వ్యాపార వ్యయాన్ని పరిమితం చేస్తుంది. ఈ లబ్ధిదారుల వ్యాపార సంస్థలు బోగస్ అని అధికారుల సోదాల్లో తేలింది. సుమారు 1000 కోట్ల వరకు ఇది జరిగిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.  సహకార బ్యాంకులో తగిన శ్రద్ధ లేకుండా నగదు డిపాజిట్లను ఉపయోగించడం ద్వారా ఫ్ర లను తెరవడానికి అనుమతించడంతో, ఆ తరువాత హామీని ఉపయోగించి రుణాలను మంజూరు చేసినట్లు తెలుసుకున్నారు.. 15 కోట్లకు పైగా లెక్క చూపని నగదు రుణాలను కొందరు కస్టమర్లకు ఇచ్చినట్లు స్వాధీనం చేసుకున్న పత్రాలలో తేలింది.