ల్యాండర్, రోవర్‌‌ నిద్రలేవడంపై ఇస్రో ట్వీట్

ఆగస్టు 23న భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఆగస్ట్‌ 23న చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్‌ ల్యాండర్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. దీంతో చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై స్లీప్ మోడ్‌లో ఉన్న ల్యాండర్, రోవర్‌ల గురించి ఇస్రో తాజాగా చేసిన ట్వీట్ మరింత ఉత్కంఠను రేపుతోంది. ఇప్పటికే జాబిల్లి దక్షిణ ధ్రువంపై సూర్యకాంతి రాగా.. […]

Share:

ఆగస్టు 23న భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 ప్రయోగం విజయవంతమైన సంగతి తెలిసిందే. ఆగస్ట్‌ 23న చంద్రుడి దక్షిణ ధృవంపై విక్రమ్‌ ల్యాండర్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. దీంతో చంద్రుని దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై స్లీప్ మోడ్‌లో ఉన్న ల్యాండర్, రోవర్‌ల గురించి ఇస్రో తాజాగా చేసిన ట్వీట్ మరింత ఉత్కంఠను రేపుతోంది. ఇప్పటికే జాబిల్లి దక్షిణ ధ్రువంపై సూర్యకాంతి రాగా.. ల్యాండర్, రోవర్‌లు పని చేస్తాయా లేదా అనే విషయంపై అందరిలోనూ తీవ్ర ఆందోళన కలుగుతున్న వేళ.. ఇస్రో చేసిన ట్వీట్ మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ల్యాండర్, రోవర్‌లతో కమ్యూనికేట్ అయ్యేందుకు తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

చంద్రయాన్ 3 లోని విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఎప్పుడు నిద్రావస్థ నుంచి బయటికి వస్తాయా అని భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై శుక్రవారం సూర్యోదయం కాగా.. ల్యాండర్, రోవర్ పనిచేస్తాయని అంతా భావించారు. అయితే ఈ క్రమంలోనే ఆ ప్రక్రియ వాయిదా శనివారానికి వాయిదా పడినట్లు ఇస్రో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆ విషయం చెప్పిన కొద్ది సేపటికి ఒక ట్వీట్ చేసింది. అయితే ఆ ట్వీట్‌లో కీలక ప్రకటన చేసింది.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై స్లీప్ మోడ్‌లో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను నిద్రలేపే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇస్రో ప్రకటించింది. అయితే ఇప్పటివరకు ల్యాండర్, రోవర్‌లతో కనెక్షన్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. కానీ ఇప్పటిదాకా ఆ రెండు పరికరాల నుంచి ఎలాంటి సిగ్నల్స్ తమకు అందలేదని స్పష్టం చేసింది. అయితే అంతకుముందు ఇస్రో ఒక విషయం తెలిపింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లను నిద్రలేపే ప్రక్రియను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇది జరిగిన కొద్దిసేపటికే ట్వీట్ చేయడం గమనార్హం.

అయితే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ల నుంచి ఇప్పటివరకు తమకు ఎలాంటి సిగ్నల్స్ కానీ.. సమాచారం గానీ లేకపోయినా.. వాటి నుంచి కమ్యూనికేషన్ పునరుద్ధరించేందుకు తమ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని ఇస్రో తేల్చి చెప్పింది. సెప్టెంబర్ 2, 4 తేదీల్లో ప్రజ్ఞాన్ రోవర్-విక్రమ్ ల్యాండర్‌ను స్లీపింగ్ మోడ్‌లో ఉంచారు ఇస్త్రో శాస్త్రవేత్తలు. అయితే చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి పంపించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ల జీవిత కాలం 14 రోజులే కాగా.. అవి పూర్తయ్యాయి. ఆ తర్వాత చంద్రుడిపై 14 రోజుల చీకటి గురువారంతో పూర్తయింది. ఈ నేపథ్యంలోనే స్లీప్ మోడ్‌లో ఉన్న ల్యాండర్, రోవర్‌లపై సూర్యకాంతి పడి మళ్లీ అవి ఛార్జ్ అయి.. పనిచేస్తాయని ఇస్రో ఆశాభావం వ్యక్తం చేసింది.

అయితే ల్యాండర్, రోవర్ మళ్లీ యాక్టివేట్ అయి పనిచేస్తే అది బోనస్‌ గానే లెక్కకు వస్తుందని ఇస్రో చెప్పింది. ఇప్పటివరకు ల్యాండర్, రోవర్ చంద్రుడి ఉపరితలంపై చాలా సమాచారాన్ని సేకరించి తమకు పంపించిందని స్పష్టం చేసింది. అయితే చంద్రుడిపై రాత్రివేళ ఉష్ణోగ్రతలు మైనస్‌ 120 డిగ్రీల సెల్సియస్ నుంచి మైనస్ 200 డిగ్రీల సెల్సియస్‌ వరకూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో పరికరాలు పని చేసే అవకాశం 50 శాతం మాత్రమే.  అలాంటి పరిస్థితులను తట్టుకుని అవి పనిచేస్తే అది అద్భుతమేనని వెల్లడించింది. అయితే ఇప్పటివరకు ల్యాండర్, రోవర్‌లతో కనెక్షన్ అందలేదని.. అంత మాత్రాన తమ ప్రయత్నాలు ఆపకుండా కృషి చేస్తూనే ఉంటామని ఇస్రో తెలిపింది.