ఇస్రో అరుదైన ఘనత.. 36 గ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపి..

ఇస్రో మరో అరుదైన ఘనత సాధించింది. వన్‌ వెబ్ఇంటర్నెట్ సంస్థకు చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపి రికార్డు సృష్టించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో అరుదైన ఘనత సాధించింది. ఒకేసారి 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపి అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఉపగ్రహాలు వన్ వెబ్ ఇంటర్నెట్ సంస్థకు చెందినవి. బ్రాడ్ బ్యాండ్  సేవలను మరింత మెరుగుపర్చడానికి జెన్- 1 కాన్స్టెలేషన్ నెట్‌ వర్క్‌ శాటిలైట్లను ప్రయోగించడానికి వెన్ వెబు […]

Share:

ఇస్రో మరో అరుదైన ఘనత సాధించింది. వన్‌ వెబ్ఇంటర్నెట్ సంస్థకు చెందిన 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపి రికార్డు సృష్టించింది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) మరో అరుదైన ఘనత సాధించింది. ఒకేసారి 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపి అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఉపగ్రహాలు వన్ వెబ్ ఇంటర్నెట్ సంస్థకు చెందినవి. బ్రాడ్ బ్యాండ్  సేవలను మరింత మెరుగుపర్చడానికి జెన్- 1 కాన్స్టెలేషన్ నెట్‌ వర్క్‌ శాటిలైట్లను ప్రయోగించడానికి వెన్ వెబు ఇస్రో సహకారాన్ని తీసుకుంది. వన్ వెబ్  ఇంటర్నెట్ బ్రిటన్ కు చెందిన కంపెనీ. బ్రిటన్ కు చెందిన నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ గ్రూప్ లో వన్ వెబ్ ఒకటి. మొత్తం 72 శాటిలైట్లను లో-ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టడానికి ఇస్రోతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అందులో భాగంగా ఇస్రో  36 ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది. ఈ 36 ఉపగ్రహాలను లాంచ్ వెహికల్ మార్క్-3  విజయవంతంగా కక్ష్యలోకి పంపించింది. ఒక్కొక్క ఉపగ్రహం బరువు 150 కిలోలు ఉందని ఇస్రో వివరించింది. 

వివిధ దశల్లో ఉపగ్రహాలు..

ఇస్రో ఈ గ్రహాలు ఒకేసారి కాకుండా.. వివిధ దశల్లో ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించింది. ముందుగా దశలో 1K, 5K, 3K,7K ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపిస్తే.. ఆ తరువాత రెండో దశలో 2A, 4A, 6A, 8A ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించారు. ఇక మూడో దశలో 1A, 3A, 5A, 7A కక్ష్యలోకి ప్రవేశ పెట్టారు. నాలుగో దశలో 2B, 4B, 6B, 8B కక్ష్యలోకి పంపారు. ఆ తర్వాత వివిధ దశల్లో 1B, 3B, 5B,7B, 2C, 4C, 6C, 8C, 1C, 3C, 5C,7C, 2D, 4D, 6D, 8D, 1D, 3D, 5D, 7D ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి  ఈ ప్రయోగం చేశారు. వన్ వెబ్ ఈ ప్రాజెక్ట్ కోసం గతంలో రష్యా సహాయాన్ని కోరింది.  రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో- అంతరిక్ష కార్యకలాపాలు, సోయుజ్ రాకెట్ ప్రయోగాన్ని నిలిపి వేసింది. దాంతో ఇస్రో సహకారాన్ని తీసుకుంది. గ్లోబల్ బ్రాడ్‌ బ్యాండ్ కవరేజీని మరింత మెరుగుపర్చడానికి 588 ఉపగ్రహాల ప్రారంభించాలంటూ వన్ వెబ్ సంస్థ తన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది.

జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ .. 

జియోసింక్రనస్ లాంచ్ వెహికల్  కి అప్‌గ్రేడెడ్ వెర్షన్ అయిన లాంచ్ వెహికల్ మార్క్ -3 ద్వారా ఈ ఉపగ్రహాలను ఇస్రో నింగి లోకి పంపింది. ఎల్‌వీఎం-3 ద్వారా ఇస్రో చేపట్టిన రెండో వాణిజ్య ప్రయోగం ఇది. ఎల్‌ఎంవీ 3 రాకెట్‌ సుమారు నాలుగు టన్నుల బరువైన ఉపగ్రహాలను జియోసింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ వరకు మోసుకెళ్లగలదు. జియోసింక్రనస్ ఆర్బిట్ భూ మధ్య రేఖకు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది.

అంతకు ముందు ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ ఇస్రో అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ సూళ్లూరు పేటలోని చెంగాళమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావాలని మొక్కుకున్నారు. మొత్తానికి ఈ ప్రయోగం విజయవంతం అయింది.