PSLV-C56  లాంచ్ చేసిన ISRO

PSLV-C56 మిషన్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఆదివారం తెల్లవారుజామున లాంచ్ చేయడం జరిగింది, రెండు వారాల్లో భారత అంతరిక్ష సంస్థ చేసిన రెండవ అతిపెద్ద లాంచ్ ఇది. PSLV-C56 ఇస్రో రెండో లాంచ్:  భారతదేశ అంతరిక్ష రీసెర్చ్కు ఒక ముఖ్యమైన మైలురాయిగా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏడు విదేశీ సాటిలైట్స్ తో అంతరిక్షంలోకి తన 56వ మిషన్‌లో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌ను విజయవంతంగా ప్రారంభించింది. PSLV-C56 మిషన్ శ్రీహరికోటలోని […]

Share:

PSLV-C56 మిషన్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఆదివారం తెల్లవారుజామున లాంచ్ చేయడం జరిగింది, రెండు వారాల్లో భారత అంతరిక్ష సంస్థ చేసిన రెండవ అతిపెద్ద లాంచ్ ఇది.

PSLV-C56 ఇస్రో రెండో లాంచ్: 

భారతదేశ అంతరిక్ష రీసెర్చ్కు ఒక ముఖ్యమైన మైలురాయిగా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఏడు విదేశీ సాటిలైట్స్ తో అంతరిక్షంలోకి తన 56వ మిషన్‌లో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్‌ను విజయవంతంగా ప్రారంభించింది. PSLV-C56 మిషన్ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఆదివారం తెల్లవారుజామున లాంచ్ చేయడం జరిగింది, రెండు వారాల్లో భారత అంతరిక్ష సంస్థ చేసిన రెండవ అతిపెద్ద లాంచ్ ఇది.

PSLV-C56 మిషన్ ప్రైమరీ పేలోడ్ DS-SAR సాటిలైట్, ఇది సింథటిక్-ఎపర్చరు రాడార్ (SAR), ఇది రెండు డైమెన్షనల్ ఇమేజ్‌లను క్రియేట్ చేయడంలో సహాయపడుతుంది. అంటే, 2డి అలాగే 3d ఇమేజెస్ కూడా క్రియేట్ చేయగలడు. సింగపూర్ ప్రభుత్వం, ST ఇంజనీరింగ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న DSTA మధ్య పార్ట్నర్ షిప్ తో డెవలప్ చేసిన DS-SAR సాటిలైట్, వివిధ సింగపూర్ ప్రభుత్వ ఏజెన్సీల అదే విధంగా, ST ఇంజనీరింగ్ వాణిజ్య అవసరాలను తీరుస్తుంది. శ్రీహరికోట నుంచి లాంచ్ చేసిన తర్వాత, దాదాపు 20 నిమిషాల తర్వాత మొత్తం ఏడు ఉపగ్రహాలు తమ అనుకున్న ఆర్బిట్ లోకి విజయవంతంగా చేరుకున్నాయని సెంటర్ పేర్కొంది.

360 కిలోల బరువున్న DS-SAR ఉపగ్రహాన్ని 535 కి.మీ ఎత్తులో నియర్-ఈక్వటోరియల్ ఆర్బిట్ (NEO)లోకి ప్రవేశపెట్టారు. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (IAI) డెవలప్ చేసిన SAR పేలోడ్‌, రాకెట్ లో ఒక భాగం, ఇది అన్ని వాతావరణ, పగలు మరియు రాత్రి కవరేజీని ఫుల్ ఫిల్ చేస్తుంది. 

ఇస్రో లాంచ్ చేసిన చంద్రయాన్-3 విషయాలు: 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో(ISRO) చంద్రుడిపైకి తన మూడవ మిషన్, చంద్రయాన్-3ని, జులై 14 వ తారీఖున,2.35 గంటలకు ఆంధ్రప్రదేశ్‌ శ్రీహరికోటలో లాంచ్ చేయడం జరిగింది. ల్యాండింగ్ విజయవంతమైతే, యునైటెడ్ స్టేట్స్, రష్యా మరియు చైనా తర్వాత ఈ అద్భుతమైన విజయాన్ని సాధించిన నాల్గవ దేశంగా భారతదేశం అవుతుంది. 

అయితే భూమి నుంచి చంద్రుడిని చేరుకోవటానికి సుమారు ఒక నెల రోజులపాటు సమయం పడుతుంది అంటున్నారు సైంటిస్టులు. అంటే ఆగస్టు 23 వ తారీఖున, లాంచ్ చేసిన మిషన్ చందమామ మీద అడుగు పెట్టబోతోంది అని అంటున్నారు. 

అయితే చందమామ మీద లాంచ్ అయిన అనంతరం సుమారు 14 రోజులు రీసర్చ్ కండక్ట్ చేస్తారు. అంటే చందమామ మీద ఒక రోజుతో సమానం. ముఖ్యంగా అక్కడ చందమామ మీద ఉండే లూనార్ మట్టి మీద పరిశోధన జరుగుతుంది. అంతే కాకుండా 14 రోజులపాటు చందమామ మీద భూమిపైన కొన్ని విశేషాలను సేకరిస్తారు. ఈ LVM-3 లిఫ్ట్‌ఆఫ్ మిషన్ సుమారు 43.5 మీటర్ల ఎత్తులో మరియు 4 మీటర్ల వ్యాసంతో, 640 టన్నుల బరువు ఉంటుంది. దీని స్ట్రెంత్ 8,000 కిలోగ్రాముల వరకు పేలోడ్‌లను రవాణా చేయడానికి అనుకూలంగా తయారు చేశారు. అంతేకాకుండా ఇది సుదూర గమ్యస్థానాలకు, ఇది సుమారుగా 4,000 కిలోగ్రాముల పేలోడ్‌ను మోయగలదు. 

ISRO ప్రకారం, ఇటీవల డెవలప్ చేసిన ఈ అద్భుతమైన మిషన్ పార్ట్స్ అనేవి కొన్ని క్లిష్టమైన సందర్భంలో కూడా విజయవంతమైన ల్యాండింగ్‌ జరిగేలా చూస్తాయని సైంటిస్టు నొక్కి మరి చెప్తున్నారు. సెన్సార్ పనిచేయకపోవడం, ఇంజిన్ బ్రేక్‌డౌన్, అల్గారిథమిక్ గ్లిచ్‌లు అంతేకాకుండా ఇంక ఎటువంటి లోపాలు వచ్చినప్పటికీ, అది చేయాల్సిన పని మాత్రం విజయవంతంగా చేసేందుకు ఆటోమేటిక్ రిపేర్ సిస్టం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.