ఇస్రో అద్భుతం.. శాటిలైట్ తో ఇండియాను క్యాప్చర్ చేసిన ఫోటోలు వైరల్..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో- ISRO) ఇటీవల అంతరిక్షం నుంచి భూమి ఫోటోలు తీసింది. ఓషన్‌శాట్-3 గా పిలిచే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-06) ద్వారా తీసిన అద్భుతమైన భూమికి సంబంధించిన ఫోటోలు తన ట్విట్టర్‌ హ్యాండిల్ లో పోస్ట్‌ చేసింది. ఓషన్ కలర్ మానిటర్ (OCM) సాంకేతికతో కూడిన మొజాయిక్‌ ఫోటోలను నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) రూపొందించినట్లు ఇస్రో తెలిపింది. భూమి, ప్రత్యేకంగా భారత్‌ దేశానికి సంబంధించిన ఈ ఫోటోలు ప్రజలను […]

Share:

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో- ISRO) ఇటీవల అంతరిక్షం నుంచి భూమి ఫోటోలు తీసింది. ఓషన్‌శాట్-3 గా పిలిచే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (EOS-06) ద్వారా తీసిన అద్భుతమైన భూమికి సంబంధించిన ఫోటోలు తన ట్విట్టర్‌ హ్యాండిల్ లో పోస్ట్‌ చేసింది. ఓషన్ కలర్ మానిటర్ (OCM) సాంకేతికతో కూడిన మొజాయిక్‌ ఫోటోలను నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) రూపొందించినట్లు ఇస్రో తెలిపింది. భూమి, ప్రత్యేకంగా భారత్‌ దేశానికి సంబంధించిన ఈ ఫోటోలు ప్రజలను ఆశ్చర్యపరుస్తాయని తెలిపింది.

ఓషన్‌శాట్-3 ద్వారా భూమి ఫోటోలు..

ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 15 మధ్య ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ద్వారా తీసిన సుమారు 3 వేల ఇమేజ్‌ లను ఓషన్ కలర్ మానిటర్ (OCM) సాంకేతికతో కూడిన మొజాయిక్‌ ఫోటోలుగా రూపొందించినట్లు ఇస్రో తెలిపింది. భూమిపై ఉన్న మహాసముద్రాలు, సముద్ర జీవజాలం, ప్రపంచ వృక్ష సంపదకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఓషన్‌శాట్-3 ద్వారా భూమిని 13 విభిన్న తరంగ దైర్ఘ్యాలతో చిత్రీకరించినట్లు పేర్కొంది. మంత్రముగ్దులను చేసే ఈ ఇమేజెస్ ట్విట్టర్‌లో ఇస్రో పోస్ట్‌ చేసింది.

ఇస్రో బుధవారం పోస్ట్‌ చేసిన భూమికి సంబంధించిన శాటిలైట్‌ చిత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఒక్క రోజులోనే సుమారు 4.5 లక్షల మంది వీటిని వీక్షించారు. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయంటూ ఇస్రోను ప్రశంసించారు. భారతీయుడిని కావడం గర్వంగా ఉందని ప్రైడ్ ఇండియన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. భూమి తోపాటు మార్స్‌కు సంబంధించిన మరిన్ని శాటిలైట్‌ ఫోటోలను కూడా తీసి పోస్ట్‌ చేయాలని కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు.

ఈ రంగులో ఎందుకు.. 

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భూమికి సంబంధించి 5 ఇమేజెస్ ను విడుదల చేయగా అవి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ ఫోటోని మీరు గమనించినట్లయితే ఆ ఫొటోల్లో భూమి ఎరుపు రంగులో కనిపించడం మనం గమనించవచ్చు. బ్లూ కలర్ బదులు ఎరుపు రంగులో ఎందుకు కనబడుతోందని అంతా ఆశ్చర్యపోతున్నారు. అంతరిక్షంలోని శాటిలైట్స్ నుంచి చూస్తే భూమి ఇలాగే కనిపిస్తుందని ఇస్రో వివరించింది.

మరి ఈ రంగులో ఎందుకు అనే అనుమానం కలుగుతుంది కదా..  EOS-06 శాటిలైట్ నుంచి భూమి ఈ రంగుల్లో కనిపించింది. ఈ శాటిలైట్‌ కి ఓషన్ కలర్ మానిటర్ ఉంది. అందువలన భూమి ఇలా కనిపించిందని సమాచారం. శాటిలైట్ ఇచ్చే డేటాను తీసుకొని.. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వారు ఇస్రోతో కలిసి… 2939 ఫొటోలను కలిపి ఈ 5 ఫొటోలను రూపొందించారు. 2939 ఫొటోలు. ఒక్కొక్కటీ.1 కిలోమీటర్ ప్రదేశానికి రిజల్యూషన్ కలిగి వున్నాయి. ఇలా మొత్తం 300 GB డేటాను ప్రాసెస్ చేశారు. దాంతో భూమి సరికొత్తగా కనిపించింది.

ఈ ఫొటోలు 2023 ఫిబ్రవరి 1 నుంచి 15 మధ్య తీసినట్లు ఇస్రో( ISRO )  చెప్పింది. ఇస్రోకి చెందిన ఓషన్ కలర్ మానిటర్ మన భూమిని 13 రకాల వేవ్‌లెంగ్త్స్‌లో పరిశీలించి భూమి, నీరు, సముద్రాల డేటాను అత్యంత వివరింగా చెబుతుంది. OCM గురించి మీకు తెలిసే ఉండచ్చు. ఇది సముద్రాల లోపల ఎక్కడో ఉన్న అడవుల్ని కూడా కనిపెడుతుంది.