చంద్రయాన్ 3 పంపిన మొదటి డేటా ఏంటంటే!

చంద్రయాన్ -3 ఒక సంచలనాన్ని సృష్టించి, మన భారతదేశ గౌరవాన్ని ప్రపంచదేశాలకు తెలియజేసింది. ప్రపంచదేశాలకు సాధ్యం కానిది మన భారతదేశానికి సాధ్యం అయ్యింది. ఎవరు కూడా చంద్రుని దక్షిణ దృవ ప్రాంతానికి చేరుకున్న ఛాయలు కనిపించలేదు. మొట్టమొదటిసారిగా  దానిని సాధించిన ఘనత మన భారతదేశానిదే. ISRO ( indian space research organisation) శాస్తవ్రేత్తలు చంద్రయాన్ -3 ద్వారా చంద్రుడి దక్షిణ ఉపరితలం దగ్గరలో సాప్ట్ లాండింగ్ సాధించారు. చంద్రయాన్ -2 విఫలమైనప్పటికీ దానినే ఇన్స్పిరేషన్ గ […]

Share:

చంద్రయాన్ -3 ఒక సంచలనాన్ని సృష్టించి, మన భారతదేశ గౌరవాన్ని ప్రపంచదేశాలకు తెలియజేసింది. ప్రపంచదేశాలకు సాధ్యం కానిది మన భారతదేశానికి సాధ్యం అయ్యింది. ఎవరు కూడా చంద్రుని దక్షిణ దృవ ప్రాంతానికి చేరుకున్న ఛాయలు కనిపించలేదు. మొట్టమొదటిసారిగా  దానిని సాధించిన ఘనత మన భారతదేశానిదే.

ISRO ( indian space research organisation) శాస్తవ్రేత్తలు చంద్రయాన్ -3 ద్వారా చంద్రుడి దక్షిణ ఉపరితలం దగ్గరలో సాప్ట్ లాండింగ్ సాధించారు. చంద్రయాన్ -2 విఫలమైనప్పటికీ దానినే ఇన్స్పిరేషన్ గ తీసుకొని , మరొక మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తూ చంద్రయాన్ -3 ని చంద్రుడి మీదకు పంపించారు. అది గొప్ప విజయాన్ని సాధించి, మన దేశ ఖ్యాతిని చందమామ మీద రెపరెపలాడెలా చేసింది. కొన్ని వందల మంది శాస్త్రవేత్తల కృషి మరియు పట్టుదలతో, కొన్ని కోట్ల మంది ప్రజల ఆకాంక్ష ను నిలబెట్టారు. చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతానికి చేరుకున్న విక్రమ్ లాండర్, దానిలోని ధర్మల్ ప్రోబ్ సహాయంతో చంద్రుని ఉపరితల, అంతర్గత మరియు బాహ్య ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉన్నాయనే సమాచారాన్ని శాస్త్రవేత్తలకు తెలియజేసింది. ఈ సమాచారమే చంద్రుని నుండి చంద్రయాన్ -3 ద్వారా మొదటిసారిగా వచ్చిన సైంటిఫిక్ డేటా. 

చంద్రుని మీద వాతావరణం ఏ రీతిలో ఉంది, అది మానవ మనుగడకు సరితూగుతుందా.. జీవరాశి సంచారణకు వాతావరణం తగినవిధంగా ఉందా.. అనే విషయాలను దృష్టిలో పెట్టుకొని చంద్రయాన్ -3 ని శాస్త్రవేత్తలు చంద్రుని యొక్క దక్షిణ ధృవ ప్రాంతానికి పంపారు. విక్రమ్ లాండర్  అక్కడి ఉపరితల  ఉష్ణోగ్రతల్ని ChaSTE (chandra’s surface thermophysical experiment) ని ఉపయోగించి కనుగొన్నది. దీనిలో ఉష్ణోగ్రతని లెక్కించే ప్రోబ్ పరికరాలు అలాగే నియంత్రణతో కూడి 10cm దూరం చంద్రుని ఉపరితలం లోనికి చొచ్చుకుపోయే యంత్రాంగాన్ని కలిగిఉంది. అందులోని ప్రోబ్ 10 రకాల సెన్సార్స్ ని కలిగిఉంది. 

ISRO శాస్త్రవేత్తలు ఒక గ్రాఫ్ రూపంలో చంద్రుని మీద ఉన్న ఉష్ణోగ్రతలను చూపించారు. అందులో చంద్రుని ఉపరితల భాగం నుండి అంతర్గత భాగానికి వెళ్లేకొద్ది అక్కడి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వచ్చాయి. ఇదే చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతం యొక్క మొదటి సమాచారం అని ISRO శాస్త్రవేత్తలు తెలియజేశారు. ISRO శాస్త్రవేత్తలకే ఆశ్చర్యాన్ని కలిగించిన సంఘటన, అదేంటంటే వాళ్లు అనుకున్న దానికంటే అక్కడి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్లు 20-30 °C ఉంటుంది అని భావించారు. కానీ అక్కడ ఉష్ణోగ్రతలు 70°C ఉంది అని చెప్పుకొచ్చారు. అనుకున్న విధంగానే చంద్రయాన్ -3 మిషన్ చంద్రుని యొక్క వాతావరణ పరిస్థితులు, అక్కడి మట్టి మరియు మినరల్స్ గురించిన విశ్లేషణ పంపించింది. ఇవి ప్రపంచంలోనే సైంటిఫిక్ కమ్యూనిటీ  కి మొట్టమొదటివి అవుతాయని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు. ఎక్కువ ఉష్ణోగ్రతల తేడా వలన అక్కడ సంచరించడం కొంచెం కష్టమే అని కూడా  వెల్లడించారు. 

చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతానికి పంపించిన విక్రమ్ లాండర్ లోని అతి ముఖ్యమైనది ChaSTE. ఇది 10 థర్మల్ సెన్సార్స్ ని కలిగిఉంది. అవి చంద్రుని అంతర్గత భాగంలోకి 10 cm చొచ్చుకుపోయి అక్కడ ఉష్ణోగ్రతలను అధ్యాయనం చేస్తాయి. Thermophysical properties ని అధ్యాయనం చెయ్యడానికి ఉపయోగించిన మొట్టమొదటి ప్రయోగం ఇదే. 

చంద్రుని పగలు, రాత్రి సమయాలలో చంద్రుని ఉపరితలం మార్పులకు గురవుతుంది. చంద్రుని అర్ధరాత్రి సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రత (minus )100°C కంటే తక్కువగా మరియూ మధ్యాహ్న సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 100°C కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా చంద్రుని పై ఉష్ణోగ్రతలు ఉన్నాయి. విక్రమ్ లాండర్ ఆగస్టు 23 న చంద్రుని మీద దిగింది. ఆ పాయింటే శివశక్తి పాయింట్ అని పిలువబడింది. ఇది మన దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందెలా చేసింది. ISRO శాస్త్రవేత్తల మీద మరింత నమ్మకాన్ని కలిగించింది. వారిలోని ఆత్మస్థైర్యాన్ని నింపింది. ఇప్పుడు వారు చంద్రుని మీదకే కాదు సూర్యుని మీదకు కూడా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రయాన్ -3 విజయంతో అంతరిక్ష పరిశోధనలో భారత్ కు బాగా డిమాండ్ పెరిగింది.