ఆదిత్య L1 గురించి ఇస్రో కీలక ప్రకటన

ఎప్పుడైతే ఇస్రో చంద్రయాన్ ని ప్రయోగించేందో అప్పటి నుంచి ఇస్రో లెవలే మారిపోయింది. కేవలం మన ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా ఇస్రోకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ ను చూసి ఇస్రో మురిసిపోకుండా చంద్రయాన్ సక్సెస్ వెంటే మరో మిషన్ ను ప్రయోగించింది. జాబిల్లి కాకుండా ఈ సారి సూర్యుడిని టార్గెట్ గా చేసుకుంది.  ఈ సారి టార్గెట్ సూర్యుడే…  చందమామ మీద మనం విజయం సాధించాక ఇస్రోకు కూడా చందమామ మీద […]

Share:

ఎప్పుడైతే ఇస్రో చంద్రయాన్ ని ప్రయోగించేందో అప్పటి నుంచి ఇస్రో లెవలే మారిపోయింది. కేవలం మన ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా ఇస్రోకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ ను చూసి ఇస్రో మురిసిపోకుండా చంద్రయాన్ సక్సెస్ వెంటే మరో మిషన్ ను ప్రయోగించింది. జాబిల్లి కాకుండా ఈ సారి సూర్యుడిని టార్గెట్ గా చేసుకుంది. 

ఈ సారి టార్గెట్ సూర్యుడే… 

చందమామ మీద మనం విజయం సాధించాక ఇస్రోకు కూడా చందమామ మీద పరిశోధనలంటే బోర్ కొట్టినట్లుగా ఉంది. ఈ సారి ఏకంగా సూర్యుడినే టార్గెట్ చేసింది. సూర్యుడి వద్ద ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో అందరికీ తెలిసిందే. అటువంటి సూర్యుడిని ఇస్రో టార్గెట్ చేసుకుంది. చంద్రుడి గురించి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్న తర్వాత సూర్యుడి మీద ఫుల్ ఫోకస్ చేసింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన మిషన్ ను కూడా సక్సెస్ ఫుల్ గా లాంచ్ చేసింది. ఆ మిషన్ ను గురించిన అప్డేట్ ను ఇస్రో తాజాగా రివీల్ చేసింది. 

సరైన మార్గంలోనే మిషన్

సూర్యుడి మీద పరిశోధనల కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 మిషన్ కు సంబంధించిన అప్డేట్ ను ఇస్రో తాజాగా అందజేసింది. ఈ వాహన నౌక ప్రస్తుతం ఆరోగ్యకరంగానే ఉన్నదని ఇస్రో తెలిపింది. అంతేకాకుండా ఇది తన సరైన కక్ష్యలోనే పయనిస్తున్నట్లు కూడా చెప్పింది. త్వరలోనే ఈ నౌక లాగ్రేంజ్ పాయింట్ 1 (ఎల్1)కి చేరుకుంటుందని ప్రకటించింది. లాంగ్రేజ్ పాయింట్ అనేది భూమికి దాదాపు 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్టోబర్ 6వ తేదీన ఈ అంతరిక్ష నౌక దాదాపు 16 సెకన్ల పాటు TCM విజయవంతంగా నిర్వహించిందని అంతరిక్ష సంస్థ ఇస్రో తెలిపింది. L1 చుట్టూ హాలో ఆర్బిట్ చొప్పించడం వైపు అంతరిక్ష నౌక దాని ఉద్దేశించిన మార్గంలో ఉందని ఈ TCM నిర్దారిస్తుందని ఇస్రో ట్విటర్ (ప్రస్తుతం ఎక్స్) లో పోస్ట్ చేసింది. 

ముందుకెళ్తూనే ఉంది…. 

ముందుకెళ్లు బంటి అని ఒక యాడ్ లో ఉన్న విధంగా ఇస్రో ప్రయోగించిన వాహన నౌక కూడా ముందుకు కదులుతూనే ఉందని ఇస్రో ప్రకటించింది. కొన్ని రోజుల్లో మాగ్నెటోమీటర్ మళ్లీ ఆన్ చేయబడుతుందని ఇస్రో ప్రకటించింది. ఇప్పటివరకు వ్యోమనౌక విజయవంతంగా నాలుగు భూ-బౌండ్ యుక్తులు మరియు ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ యుక్తులను విజయవంతంగా నిర్వహించింది. అంతే కాకుండా ఈ అంతరిక్ష నౌక భూమి యొక్క ప్రభావ గోళం నుంచి కూడా తప్పించుకుందని ఇస్రో ప్రకటించింది. 

అసలేంటీ ఆదిత్య??

చంద్రయాన్-3 తర్వాత ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఆదిత్య ఎల్-1. అసలేంటీ ఆదిత్య ఎల్-1 అని అంతా అనుకుంటున్నారు. సూర్యుడి మీద ప్రయోగాల కోసం ఇస్రో ప్రయోగించిన వాహన నౌకే ఆదిత్య ఎల్-1. చంద్రయాన్-3 సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న ఇస్రో.. సెప్టెంబర్ 2న ఈ మిషన్ ను లాంచ్ చేసింది. ఎప్పటి లానే ఆంధ్రప్రదేశ్‌ లోని శ్రీహరికోటలో గల స్పేస్‌పోర్ట్ నుంచి ఆదిత్య-ఎల్1 అంతరిక్ష నౌకను ప్రయోగించింది. ఈ వ్యోమనౌక సౌర కరోనా యొక్క రిమోట్ పరిశీలనలను అందించడానికి ఉపయోగపడుతుంది. అంతే కాకుండా సూర్యుడు-భూమి లాగ్రాంజియన్ పాయింట్ వద్ద సౌర గాలి ప్రదేశంలో పరిశీలనలను నిర్వహించడానికి కూడా ఉద్దేశించబడింది. 

ఈ వాహన నౌక పంపించిన డేటా శాస్త్రవేత్తలకు భూమి చుట్టూ ఉన్న కణాల ప్రవర్తనను విశ్లేషించడంలో సహాయపడుతుంది. ఆదిత్య-ఎల్1 వాహన నౌక భూమికి దాదాపు 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉంటుంది. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపిన వివరాల ప్రకారం… సన్ మిషన్ ఖచ్చితమైన వ్యాసార్థాన్ని చేరుకోవడానికి 125 రోజులు పడుతుందట. ఇది సూర్యునిపైకి దిగే ప్రసక్తే లేదని సోమనాథ్ పేర్కొన్నారు. అంతే కాకుండా సూర్యుడి దగ్గరకు కూడా ఇది వెళ్లదు. సూర్యుడి వద్ద విపరీతమై ఉష్ణం ఉంటుంది. సూర్యుడు మండే అగ్ని గోళం. సూర్యుడి వద్దకు వెళ్తే వాహన నౌకే కాదు ఎవరైనా సరే మాడి మసి కావల్సిందే.