చంద్రయాన్-3కు ముప్పు: ఇస్రో చీఫ్ సోమనాథ్

భారతదేశం గర్వించదగ్గ విషయం చంద్రయాన్-3 సక్సెస్ గురించి ప్రస్తావించిన ఇస్రో చీఫ్ సోమనాథ్ మరో విషయం గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఇస్రో చీఫ్ చంద్రయాన్-3 గురించి ఒక ఆసక్తికర విషయం బయట పెట్టారు, విక్రమ్ ల్యాండర్ చాలా బాగా పనిచేస్తుందని, ప్రస్తుతం దాని పనితీరు అంతా బాగానే ఉందని మాట్లాడారు. ఇంకా చంద్రుడు మీద ఎటువంటి వాతావరణం లేకపోవడం కారణంగా, బయట నుంచి వచ్చే ఉల్కల వల్ల మిషన్ కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని […]

Share:

భారతదేశం గర్వించదగ్గ విషయం చంద్రయాన్-3 సక్సెస్ గురించి ప్రస్తావించిన ఇస్రో చీఫ్ సోమనాథ్ మరో విషయం గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఇస్రో చీఫ్ చంద్రయాన్-3 గురించి ఒక ఆసక్తికర విషయం బయట పెట్టారు, విక్రమ్ ల్యాండర్ చాలా బాగా పనిచేస్తుందని, ప్రస్తుతం దాని పనితీరు అంతా బాగానే ఉందని మాట్లాడారు. ఇంకా చంద్రుడు మీద ఎటువంటి వాతావరణం లేకపోవడం కారణంగా, బయట నుంచి వచ్చే ఉల్కల వల్ల మిషన్ కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని బయటపెట్టారు. 

చంద్రయాన్-3కు ముప్పు: 

చంద్రుడు మీద ముఖ్యంగా దక్షిణ దృవం మీద మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్ ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు ఇస్రో చీఫ్ సోమనాథ్. ముఖ్యంగా, భూమి మీద వాతావరణంతో కంపేర్ చేస్తే, చంద్రుడు మీద వాతావరణం ఏమీ ఉండదని, దాని కారణంగా అంతరిక్షంలో ప్రయాణిస్తూ ఉండే ఉల్కల కారణంగా చంద్రయాన్ 3 మిషన్ కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుందని ప్రస్తావించారు. విక్రమ్ ల్యాండర్ మీద బయట నుంచి వచ్చే రాడు పడితే గనుక, ఏదైనా బలంగా తగిలితే డామేజ్ జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. 

ఉల్కలు ప్రతి గ్రహం మీద నుంచి ప్రయాణిస్తున్నప్పటికీ భూమి మీద ఉండే వాతావరణం కారణంగా బయట నుంచి ఉల్కలు వచ్చినప్పటికీ అవి, భూమి వాతావరణం లో అడుగుపెట్టగానే బూడిదైపోతాయని గుర్తు చేశారు ఇస్రో చీఫ్ సోమనాథ్. 

చంద్రయాన్-3 విశేషాలు: 

భూమి నుంచి చంద్రుడిని చేరుకోవటానికి సుమారు ఒక నెల రోజులపాటు సమయం పట్టింది. అంటే ఆగస్టు 23 వ తారీఖున, లాంచ్ చేసిన మిషన్ చందమామ మీద అడుగు పెట్టింది. అయితే చందమామ మీద లాంచ్ అయిన అనంతరం సుమారు 14 రోజులు రీసర్చ్ కండక్ట్ చేయడం స్టార్ట్ అయింది. 14 రోజులు అంటే చందమామ మీద ఒక రోజుతో సమానం. ముఖ్యంగా అక్కడ చందమామ మీద ఉండే లూనార్ మట్టి మీద పరిశోధన జరుగుతుంది. అంతే కాకుండా 14 రోజులపాటు చందమామ మీద కొన్ని విశేషాలను సేకరిస్తారు. 

GSLV మార్క్ 3 (LVM 3) హెవీ-లిఫ్ట్ లాంచ్ వెహికల్‌పై అంతరిక్ష నౌకను ప్రయోగించనున్నారు. ఈ శక్తివంతమైన మూడు-దశల మీడియం-లిఫ్ట్ లాంచ్ వెహికల్ ISRO ద్వారా పంపిస్తున్న అత్యంత బలమైన వెహికల్ అని చెప్పుకోవచ్చు. ఈ LVM-3 లిఫ్ట్‌ఆఫ్ మిషన్ సుమారు 43.5 మీటర్ల ఎత్తులో మరియు 4 మీటర్ల వ్యాసంతో, 640 టన్నుల బరువు ఉంటుంది. దీని స్ట్రెంత్ 8,000 కిలోగ్రాముల వరకు పేలోడ్‌లను రవాణా చేయడానికి అనుకూలంగా తయారు చేశారు. అంతేకాకుండా ఇది సుదూర గమ్యస్థానాలకు, ఇది సుమారుగా 4,000 కిలోగ్రాముల పేలోడ్‌ను మోయగలదు. ఇక బడ్జెట్ విషయానికి వస్తే, మునుపు తయారు చేసిన చంద్రయాన్-2 బడ్జెట్ 900 కోట్లు , మరి ఇప్పుడు విజయవంతంగా చంద్రుడు మీద అడుగుపెట్టిన చంద్రయాన్-3 బడ్జెట్ 600 కోట్లు.

ISRO ప్రకారం, ఇటీవల డెవలప్ చేసిన ఈ అద్భుతమైన మిషన్ పార్ట్స్ అనేవి కొన్ని క్లిష్టమైన సందర్భంలో కూడా విజయవంతమైన ల్యాండింగ్‌ జరిగేలా చూస్తాయని సైంటిస్టు నొక్కి చెప్పిన విధంగానే ఇప్పుడు ఇస్రో సాధించి చూపించింది. సెన్సార్ పనిచేయకపోవడం, ఇంజిన్ బ్రేక్‌డౌన్, అల్గారిథమిక్ గ్లిచ్‌లు అంతేకాకుండా ఇంక ఎటువంటి లోపాలు వచ్చినప్పటికీ, అది చేయాల్సిన పని మాత్రం విజయవంతంగా చేసేందుకు ఆటోమేటిక్ రిపేర్ సిస్టం కూడా ఉండడం వల్ల మిషన్ విజయవంతమైంది.