Isro: నా కోరిక అదే అంటున్న చీఫ్ సోమ‌నాథ్

2023  ఇస్రో (Isro) కు మరపురాని సంవత్సరంగా మారిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రయాన్ మిషన్ సక్సెస్ తో ఇస్రో (Isro)  పేరు మార్మోగిపోయింది. కేవలం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇస్రో (Isro)  ను అంతా కీర్తించారు. ఇస్రోలో పని చేసే సైంటిస్టుల పేర్లు మార్మోగిపోయాయి. ఇక ఇప్పుడు ఇస్రో (Isro) సంస్థ తన తదుపరి ప్రాజెక్టుకు సిద్ధంఅవుతోంది. ఇన్ని రోజుల పాటు కేవలం ఉపగ్రహాలనే రోదసిలోకి పంపిన ఇస్రో (Isro) ఇక […]

Share:

2023  ఇస్రో (Isro) కు మరపురాని సంవత్సరంగా మారిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. చంద్రయాన్ మిషన్ సక్సెస్ తో ఇస్రో (Isro)  పేరు మార్మోగిపోయింది. కేవలం దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇస్రో (Isro)  ను అంతా కీర్తించారు. ఇస్రోలో పని చేసే సైంటిస్టుల పేర్లు మార్మోగిపోయాయి. ఇక ఇప్పుడు ఇస్రో (Isro) సంస్థ తన తదుపరి ప్రాజెక్టుకు సిద్ధంఅవుతోంది. ఇన్ని రోజుల పాటు కేవలం ఉపగ్రహాలనే రోదసిలోకి పంపిన ఇస్రో (Isro) ఇక ఇప్పుడు మానవ సహిత స్పేస్ మిషన్ ను రోదసిలోకి పంపాలని నిర్ణయించుకుంది. అంతే కాదు ఆ స్పేస్(Space) మిషన్ కు సంబంధించిన పనులను కూడా ఇస్రో (Isro)  మొదలుపెట్టింది.

మనసులోని మాట బయటపెట్టిన ఇస్రో చైర్మన్

ఇస్రో (Isro)  చైర్మన్ సోమనాథ్ గురించి అందరికీ సుపరిచితమే. సక్సెస్ ఫుల్ గా చంద్రయాన్ (Chandrayaan) ను రోదసిలోకి పంపడంలో సోమనాథ్ శ్రమను మనం ఎవరం కాదని చెప్పలేం. తాజాగా సోమనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. తన మనసులోని మాటను బయటపెట్టారు. దేశ అంతరిక్ష యాత్రలో మహిళలకు (Womens) మరింత ప్రాతినిధ్యం కల్పించాలని ఆయన ఆకాంక్షించారు. తనతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ (Modi) కోరిక కూడా ఇదేనని వెల్లడించారు. ఈ కోరిక దేశం మొత్తం ప్రతిధ్వనిస్తోందని తెలిపారు.  అంతరిక్ష యాత్రలలో ఎక్కువ మంది మహిళా వ్యోమగాములు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేవలం నేను మాత్రమే కాదు ఇండియన్ ప్రధాని కూడా అదే కోరికతో ఉన్నారని ఆయన పేర్కొనడం విశేషం. తాజాగా సోమనాథ్ ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. విజయదశమి సందర్భంగా తిరువనంతపురంలోని ఓ ఆలయంలో జరిగిన కార్యక్రమంలో ఇస్రో (Isro)  చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇస్రో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మానవ అంతరిక్ష విమాన కార్యక్రమం గగన్‌యాన్ (Gaganyaan) మిషన్ కోసం మహిళా ఫైటర్ టెస్ట్ (Test) పైలట్‌ లు లేదా మహిళా శాస్త్రవేత్తలను ఇష్టపడుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చారు.

ఇప్పటికే శిక్షణ ఇచ్చాం… 

ఇస్రో (Isro)  తాజాగా గగన్ యాన్ మిషన్ ను చేపట్టింది. గగన్‌యాన్ ప్రారంభ మిషన్‌కు ఇప్పటికే వ్యోమగాములను ఎంపిక చేసి శిక్షణ  (Training) ఇచ్చామని, మహిళల భాగస్వామ్యం ఇప్పట్లో సాధ్యం కాదని సోమనాథ్ చెప్పారు. అయితే, భవిష్యత్ గగన్‌యాన్ మిషన్లలో మహిళల భాగస్వామ్యం తప్పకుండా పెంచుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఇస్రో తన మానవరహిత గగన్‌యాన్ అంతరిక్ష నౌకలో మహిళా హ్యూమనాయిడ్‌ ను – మనిషిని పోలి ఉండే రోబోట్‌ ను పంపుతుందని సోమనాథ్ ఆదివారం తెలిపారు. ప్రతిష్టాత్మక మిషన్ మానవులను మూడు రోజుల పాటు 400 కి.మీ దిగువ భూమి కక్ష్యలో అంతరిక్షంలోకి పంపి వారిని సురక్షితంగా భూమికి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇస్రో గగన్‌యాన్ మిషన్ కోసం సిబ్బంది మాడ్యూల్‌ ను మోసుకెళ్లే టెస్ట్ వాహనం యొక్క ప్రయోగం నిర్వహించింది. మరియు ఈ ప్రయోగం సక్సెస్ అయింది. దీంతో ఇస్రో మరింత ఆనందంగా ఉంది. కేవలం ఇస్రో (Isro)  మాత్రమే కాకుండా యావత్ దేశం కూడా దీనితో ఆనందంగా ఉంది. ఇది ప్రాజెక్టులో కీలక మైలురాయిగా తెలుస్తోంది. ఈ పరీక్షలో ఖాళీ క్రూ మాడ్యూల్‌ ను ప్రారంభించారు. అంతే కాకుండా ఓ అత్యవసర పరిస్థితిని కల్పించి, అత్యవసర సమయంలో ఆ మాడ్యూల్ ఎలా పని చేస్తుందో టెస్ట్ చేశారు. మాడ్యూల్ విజయవంతంగా పని చేసింది. అది నిర్దేశించిన ప్రదేశంలో పడడంతో ఇస్రో బృందం ఫుల్ ఖుషీగా ఉంది. 2025 నాటికి అంతరిక్షంలోకి మనుషులతో కూడిన మిషన్‌ కు సిద్ధమవుతున్నందున ఈ పరీక్ష చాలా ముఖ్యమని ఏజెన్సీ చీఫ్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఇక ఈ టెస్టు కూడా విజయవంతం కావడంతో యావత్ దేశం ఇస్రోకు అభినందనలు తెలియజేస్తోంది. కేవలం రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా అనేక మంది సామాన్యులు కూడా ఇస్రో (Isro)  ను అభినందిస్తున్నారు.