వాట్సాప్ మెసేజ్‌లలో వచ్చే యాప్‌లను ఇన్స్టాల్ చెయ్యొద్దని IRCTC హెచ్చరిక

ఇటీవల కాలంలో ఫేక్ మెసేజ్‌లు ఎక్కువ వస్తున్న సంగతి తెలిసిందే.. సైబర్ నేరగాళ్లు జనాలను బురిడీ కొట్టించాలని కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో భాగంగానే ఎమర్జెన్సీ అప్డేట్ అంటూ కొన్ని లింక్స్ పంపిస్తున్నారు.. వాటికి పొరపాటున ఓపెన్ చేశామో! ఇక మన అకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం.. ఇలాంటి ఘటనలు దేశంలో ఎక్కడో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి.. బ్యాంకింగ్, రైల్వేస్ ఇలా ప్రభుత్వానికి సంబందించిన వాటిని కూడా హ్యాక్ చేస్తున్నారు.. ఇలాంటి వాటిని అస్సలు నమ్మొద్దు […]

Share:

ఇటీవల కాలంలో ఫేక్ మెసేజ్‌లు ఎక్కువ వస్తున్న సంగతి తెలిసిందే.. సైబర్ నేరగాళ్లు జనాలను బురిడీ కొట్టించాలని కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో భాగంగానే ఎమర్జెన్సీ అప్డేట్ అంటూ కొన్ని లింక్స్ పంపిస్తున్నారు.. వాటికి పొరపాటున ఓపెన్ చేశామో! ఇక మన అకౌంట్ ఖాళీ అవ్వడం ఖాయం.. ఇలాంటి ఘటనలు దేశంలో ఎక్కడో చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి.. బ్యాంకింగ్, రైల్వేస్ ఇలా ప్రభుత్వానికి సంబందించిన వాటిని కూడా హ్యాక్ చేస్తున్నారు.. ఇలాంటి వాటిని అస్సలు నమ్మొద్దు అని పోలీసులు ఎంతగా మొత్తుకొని చెప్పినా కూడా ఎక్కడో చోట ఇలాంటివాటికి జనాలు బలవుతున్నారు.. ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న లింక్స్ ఓపెన్ చెయ్యడం మంచిది కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు.. తాజాగా రైల్వే శాఖ ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు.. అందులో భాగంగా వాట్సాప్ తదితర సోషల్ మీడియా యాప్‌లలో వచ్చే లింక్స్ ఓపెన్ చేసి యాప్ డౌన్లోడ్ చెయ్యొద్దని హెచ్చరించింది. అసలు ఆ యాప్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ‘irctcconnect.apk’ అనే అనుమానాస్పద ఆండ్రాయిడ్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయవద్దని ప్రజలను కోరుతూ పబ్లిక్ అడ్వైజరీని విడుదల చేసింది. IRCTC ఈ apk ఫైల్ హానికరమని, పొరపాటున ఇన్‌స్టాల్ చేస్తే మీ మొబైల్ ఫోన్‌కు హాని కలిగించవచ్చని హెచ్చరించింది. ఇంకా, ఈ యాప్ వెనుక ఉన్న మోసగాళ్ళు IRCTC అధికారుల వలె నటించి, మీ UPI వివరాలు, అలాగే ఇతర ముఖ్యమైన బ్యాంకింగ్ సమాచారం వంటి మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందేందుకు ప్రయత్నిస్తారు. అందువల్ల, ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేయకుండా ఉండటం, తద్వారా ఇలాంటి అనుమానాస్పద అప్లికేషన్‌ల పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం… 

IRCTC యొక్క పూర్తి హెచ్చరిక సందేశాన్ని ఇక్కడ చదవండి.

ఫిషింగ్ వెబ్‌సైట్ (https://irctc.creditmobile.site)లో హోస్ట్ చేయబడిన హానికరమైన Android అప్లికేషన్ (irctcconnect.apk) తక్షణ సందేశ ప్లాట్‌ ఫారమ్‌ల ద్వారా ప్రసారం చేయబడుతుందని నివేదించబడింది ఉదా. WhatsApp, టెలిగ్రామ్, మొదలైనవి. ఈ Android యాప్ (APK ఫైల్) హానికరమైనది..  మీ మొబైల్ పరికరాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ మోసగాళ్లు భారీ స్థాయిలో ఫిషింగ్ లింక్‌ను పంపుతున్నారు.. అంతేకాదు ఈ యాండ్రాయిడ్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని వినియోగదారులను ఉసిగొల్పి, డౌన్లోడ్ చేసుకున్నాక UPI వివరాలు, క్రెడిట్/ డెబిట్ కార్డ్ సమాచారం మొదలైన వారి సున్నితమైన నెట్ బ్యాంకింగ్ ఆధారాలను బహిర్గతం చేసేలా బాధితులను మోసగించడానికి IRCTC అధికారి వలె నటించారు.

దీని దృష్ట్యా, దయచేసి ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయవద్దని, అదే విధంగా అలాంటి మోసగాళ్ల నుండి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోవాలని మీకు సలహా ఇస్తున్నారు. Google Play Store లేదా Apple Store నుండి IRCTC యొక్క అధీకృత ‘IRCTC రైల్ కనెక్ట్’ మొబైల్ యాప్‌ని ఎల్లప్పుడూ డౌన్‌లోడ్ చేసుకోండి… IRCTC తన వినియోగదారులు/కస్టమర్‌లను వారి పిన్, OTP, పాస్‌వర్డ్, క్రెడిట్/ డెబిట్ కార్డ్ వివరాలు, నెట్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్ లేదా UPI వివరాల కోసం కాల్ చేయదని దయచేసి గమనించండని, మోసపోవద్దు అని హెచ్చరించింది.. ఇలాంటి అసత్యపు మెసేజ్‌లను ప్రభుత్వం ఎప్పుడూ పంపించదని ఏదైనా కస్టమర్లకు నేరుగా చెబుతుందని స్పష్టం చేసింది. ఏదైనా ఒకటికి రెండు సార్లు కనుక్కొని చెయ్యడం మంచిదని అధికారులు చెబుతున్నారు.