ఇన్‌స్టాగ్రామ్ చాట్ స్క్రీన్‌ను పోలిన కేక్!

సోషల్ మీడియా లో ఇంస్టాగ్రామ్ అనేది అత్యంత పవర్ ఫుల్ టూల్ అనే విషయం అందరికీ తెలిసిందే. వయస్సు తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు ఈ యాప్ ని బాగా వాడుతారు. ముఖ్యంగా మన ఇండియా లో టిక్ టాక్ ని బ్యాన్ చేసిన తర్వాత అక్కడి యూజర్లు మొత్తం ఇంస్టాగ్రామ్ కి షిఫ్ట్ అయ్యారు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత రీల్స్ చెయ్యడం సర్వసాధారణం అయిపోయింది. ఈ రీల్స్ కి అత్యధిక వ్యూస్ మరియు […]

Share:

సోషల్ మీడియా లో ఇంస్టాగ్రామ్ అనేది అత్యంత పవర్ ఫుల్ టూల్ అనే విషయం అందరికీ తెలిసిందే. వయస్సు తో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరు ఈ యాప్ ని బాగా వాడుతారు. ముఖ్యంగా మన ఇండియా లో టిక్ టాక్ ని బ్యాన్ చేసిన తర్వాత అక్కడి యూజర్లు మొత్తం ఇంస్టాగ్రామ్ కి షిఫ్ట్ అయ్యారు. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత రీల్స్ చెయ్యడం సర్వసాధారణం అయిపోయింది. ఈ రీల్స్ కి అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ వస్తే ఇంస్టాగ్రామ్ సంస్థ డబ్బులు కూడా ఇచ్చే సంగతి మన అందరికీ తెలిసిందే. అందుకే ఈ యాప్ ని అంత మంది ఉపయోగిస్తుంటారు, అడిక్ట్ కూడా అయిపోతుంటారు. స్టార్ హీరోలు మరియు స్టార్ హీరోయిన్లు తమ ఫోటోలను కేవలం ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చెయ్యడం కోసం ప్రత్యేకంగా ఫోటో షూట్స్ కూడా చేయించుకుంటారు. ఆ ఫోటోలు మరియు వీడియోలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ మరియు లైక్స్ రావడం, వాటి ద్వారా కోట్ల రూపాయిలు సంపాదించడం వంటివి ఈమధ్య కాలం లో చాలా కామన్ అయిపోయింది.

ఇక పోతే రీసెంట్ గా ప్రముఖ ఆర్టిస్టు పాబ్లో చేత ఇంస్టాగ్రామ్ సంస్థ ఒక అందమైన కేకుని తయారు చేయించింది. ఈ కేకు ఇంస్టాగ్రామ్ లోని చాట్ బాక్స్ ఎలా ఉంటుందో, అచ్చు గుద్దినట్టు  అదే రకంగా ఉండేలాగా డిజైన్ చేసాడు. అంతే కాదు ఈ చాట్ లో మెసేజిలు కూడా ఉన్నాయి. రో చాట్ అనే అబ్బాయి తన స్నేహితుడికి ‘పుట్టునరోజు శుభాకాంక్షలు,నేను నీకోసం ఒక కేక్ తయారు చేస్తున్నాను’ అని అంటాడు. అప్పుడు అతను ఆ మెసేజి కి హార్ట్ సింబల్ వేసి , థాంక్యూ అని అంటాడు. ‘నేను ఆ కేకుని ఇలా తయారు చేయబోతున్నాను’ అని అంటాడు, అవతలి వ్యక్తి ‘ఎలా?’ అని అంటాడు. ‘అచ్చు గుద్దినట్టు ఇలాగే ఉంటుంది మన చాట్ లాగా’ అని అంటాడు. అప్పుడు అతను ఓకే అని రిప్లై ఇస్తాడు, పాబ్లో కూడా ఎమోజి సింబల్ ఒకటి వేస్తాడు.

ఇక ఆ తర్వాత పాబ్లో తన సృజనాత్మకత చూపిస్తూ తెల్లని కేకుని కట్ చెయ్యగా, ఆ కేక్ లోపల లేయర్స్ ని చూసి ఆశ్చర్యపోతాడు. ఆ లేయర్స్ అచ్చు గుద్దినట్టుగా తన ఇంస్టాగ్రామ్ చాట్ లో ఎలా అయితే ఉంటుందో అలా ఉంది. చివరికి అతను హార్ట్ సింబల్ రియాక్షన్ తో పాటుగా అందులో ఉండడాన్ని చూసి షాక్ కి గురి అవుతాడు సదరు వ్యక్తి. ఈ వీడియో కి అక్షరాలా 24 లక్షలా లైక్స్ వచ్చాయి. పాబ్లో కి ఇదొక్కటే కాదు, ఇలాంటి వెరైటీ కేకులు ఎన్నో ఉన్నాయి. అతని ఇంస్టాగ్రామ్ ఫాలోయర్స్ 12 లక్షల మంది ఉంటారు, ఇతనిని స్వయంగా ఇంస్టాగ్రామ్ సంస్థ హైర్ చేసుకుంది. ఇతను ఇలాంటి వీడియోస్ ద్వారా నెలకు కోట్ల రూపాయలలో డబ్బులు సంపాదిస్తున్నాడు. ఒక్కసారి ఇంస్టాగ్రామ్ లో ఉన్న వాళ్ళు ‘పాబ్లో రో చాట్’ అని సెర్చ్ చేసి అతని ప్రొఫైల్ చూసి ఫాలో అవ్వండి. అతని ప్రొఫైల్ లో ఉన్న కేకులు చూస్తే నోరు ఊరక తప్పదు. కేవలం ఇలాంటి కేకులు తయారు చెయ్యడం మాత్రమే కాదు, ఇలాంటి క్రేజీ ఆలోచనలతో వివిధ ప్రోడక్ట్స్ తో అతను చేసిన ప్రయోగాలు చూస్తే నోరెళ్లబెడుతారు, అతని టాలెంట్ సెల్యూట్ చేస్తారు.