ఆ పేపర్ ను తొలగించిన ఢిల్లీ యూనివర్సిటీ

యూనివర్సిటీల్లో పలు పేపర్లను తొలగించడం చాలా కామన్. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగా లేవని కొన్ని పేపర్లను తొలగిస్తే మరీ పాతకాలం నాటి ఆచారాలంటూ మరికొన్ని యూనివర్సిటీలు పేపర్లను తొలగిస్తుంటాయి. ఇలా పేపర్లను తొలగించడం ఇదేం కొత్త కాదు. ఇది మొదటిసారి కాదు. ఇదే చివరి సారి కూడా కాదు.  ఆ పేపర్లు తొలగింపు..  ఢిల్లీ యూనివర్సిటీ తాజాగా రెండు పేపర్లను తొలగించింది. పితృస్వామ్యానికి సంబంధించిన అధ్యాయలలో అసమానత, బ్రహ్మానైజేషన్ అనే రెండు పేపర్లను తొలగించింది. వాటి […]

Share:

యూనివర్సిటీల్లో పలు పేపర్లను తొలగించడం చాలా కామన్. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగా లేవని కొన్ని పేపర్లను తొలగిస్తే మరీ పాతకాలం నాటి ఆచారాలంటూ మరికొన్ని యూనివర్సిటీలు పేపర్లను తొలగిస్తుంటాయి. ఇలా పేపర్లను తొలగించడం ఇదేం కొత్త కాదు. ఇది మొదటిసారి కాదు. ఇదే చివరి సారి కూడా కాదు. 

ఆ పేపర్లు తొలగింపు.. 

ఢిల్లీ యూనివర్సిటీ తాజాగా రెండు పేపర్లను తొలగించింది. పితృస్వామ్యానికి సంబంధించిన అధ్యాయలలో అసమానత, బ్రహ్మానైజేషన్ అనే రెండు పేపర్లను తొలగించింది. వాటి స్థానంలో మాతృత్వానికి సంబంధించిన సిలబస్ ను చేర్చింది. ఢిల్లీ యూనివర్సిటీ దాని అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు నుంచి ఈ రెండు పేపర్లను తొలగించింది. బ్రాహ్మనైజేషన్ భావన పాతకాలం నాటి పోకడలను సూచిస్తుందని పలువురు అధ్యాపకులు తెలియజేశారు. ప్రస్తుతం సమాజంలో మార్పు వచ్చింది కాబట్టి ఇటువంటి సిలబస్ అవసరం లేదని వారు తెలిపారు. ఈ అధ్యాయం దేనిని సూచిస్తుందో సరైన విధమైన స్పష్టత లేదు. ఇది వివాదం కావడంతో యూనివర్సిటీ అధికారులు దీనిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

వాటి స్థానంలో అవి… 

తొలగించిన అధ్యాయాల స్థానంలో మాతృస్వామ్య థృక్ఫథాల గురించి యాడ్ చేశారు. దీంతో సిలబస్ మళ్లీ కామన్ అయింది. ఈ మార్పు గురించి ఢిల్లీ సౌత్ యూనివర్సిటీ డీన్ ప్రకాశ్ సింగ్ మాట్లాడుతూ.. ఇప్పుడు మరింత వైవిధ్యం మరియు మరింత సమాచారం అందించబడుతుందని ఆయన తెలిపారు. ఈ నిర్ణయానికి అకడమిక్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపిందని.. ఈ విషయంలో ఎటువంటి అసమ్మతి లేదని ఆయన తెలిపారు. స్టాండింగ్ కమిటీ సూచనలను కూడా అందించిందని ఆయన పేర్కొన్నారు. 

మొదలైన వివాదం.. 

వీర్ సావర్కర్ కు సంబంధించిన అధ్యాయానికి ఎక్కువ ప్రాధాన్యత నివ్వాలని అధ్యాపకుల బృందం భావించింది. దీంతో ఈ నిర్ణయానికి మే 26 న అకడమిక్ కౌన్సిల్, జూన్ 9 న ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపాయి. దీంతో ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ నిర్ణయం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదని వారు అంటున్నారు. 

కరికులమ్ మార్పులపై స్పందించిన డీన్ 

ఈ మార్పులపై ఢిల్లీ యూనివర్సిటీ డీన్ స్పందించారు. ఈ మార్పులను అకడమిక్ కౌన్సిల్ ఆమోదించిందని ఆయన పేర్కొన్నారు. అందుకోసమే ఎటువంటి రెండో ఆలోచన లేకుండా మార్పులను అమలు చేశామని తెలిపారు. అయినా ఇప్పటి ఆధునిక యుగంలో కూడా బ్రాహ్మనైజేషన్ వంటి టాపిక్స్ అవసరం లేదని అన్నారు. పితృస్వామ్యం ఒకప్పటి పోకడ అని తెలిపారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం మారిందని ఇప్పటి రోజులకు, మరియు ఇప్పుడున్న యువత కు ఆ టాపిక్ అవసరం లేదన్నారు. అందుకోసమే సిలబస్ నుంచి ఆ టాపిక్ ను తొలగించామని తమ నిర్ణయాన్ని ఆయన సమర్ధించుకున్నారు. మేము అంతా సరిగ్గానే చేశామని ఆయన తెలిపారు. రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.

స్త్రీ గొప్పతనం వివరించేలా.. 

పితృస్వామ్య పోకడలకు సంబంధించిన సిలబస్ ను తొలగించిన యూనివర్సిటీ పెద్దలు ఆ స్థానంలో స్త్రీ గొప్పతనాన్ని చాటి చెప్పే మాతృస్వామ్యం గురించి దాని గొప్పతనం గురించి యాడ్ చేశారు. మాతృత్వం అనేది ఎంతో గొప్పదని, ఆ గొప్పతనాన్ని మాటల్లో చెప్పలేమని వారు చెబుతున్నారు. అయితే ఇదిలా ఉంటే.. ఇలా సిలబస్ లో మార్పులు చేయడాన్ని కొంత మంది వ్యతిరేకిస్తున్నారు. ఇలా ఇష్టం వచ్చినట్లు మార్పులు చేయడం సరికాదని వారు వాదిస్తున్నారు. ఎన్నో రోజుల నుంచి వస్తున్న సిలబస్ లో మార్పులు చేయాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు.