ఆత్మహత్య చేసుకున్న ఇండోర్ హోటల్ వ్యాపారి

ఎక్కడ చూసినా ఆత్మహత్యలు కలవరం రేపుతున్నాయి. చిన్న విషయాలకు మనసు కలత చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు యువత. అమ్మ ఫోన్ చూడొద్దన్నాదని, నాన్న తిట్టాడని, పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని, మంచి జాబు తెచ్చుకోలేకపోయానని, ఇలా పలు రకాలుగా మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నారు చాలామంది. కానీ ఇండోర్ లోని  30 ఏళ్ల వయసు ఉన్న ఒక ఒక హోటల్ వ్యాపారి మాత్రం తన చనిపోతూ ఒక వింత విషయాన్ని నోటు రాసి చనిపోయాడు.  సూసైడ్ నోట్ […]

Share:

ఎక్కడ చూసినా ఆత్మహత్యలు కలవరం రేపుతున్నాయి. చిన్న విషయాలకు మనసు కలత చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు యువత. అమ్మ ఫోన్ చూడొద్దన్నాదని, నాన్న తిట్టాడని, పరీక్షల్లో మంచి మార్కులు రాలేదని, మంచి జాబు తెచ్చుకోలేకపోయానని, ఇలా పలు రకాలుగా మనస్థాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నారు చాలామంది. కానీ ఇండోర్ లోని  30 ఏళ్ల వయసు ఉన్న ఒక ఒక హోటల్ వ్యాపారి మాత్రం తన చనిపోతూ ఒక వింత విషయాన్ని నోటు రాసి చనిపోయాడు. 

సూసైడ్ నోట్ లో ఏముంది: 

మధ్యప్రదేశ్ ఇండోర్ కి చెందిన 30 సంవత్సరాలు ఉన్న ఒక హోటల్ వ్యాపారి, ఏడు పేజీల సూసైడ్ నోట్ రాసి చనిపోవడం జరిగింది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, మధ్యప్రదేశ్, ఇండోర్, హిరానగర్ లొకాలిటీలో నివాసం ఉంటున్న 30 సంవత్సరాల హోటల్ వ్యాపారి గురువారంనాడు రక్తపు మడుగులో కనిపించాడు. అయితే తాను తన దగ్గర ఉన్న గన్ తో షూట్ చేసుకుని చనిపోయినట్లు, అక్కడ దొరికిన సూసైడ్ నోట్ ద్వారా వెల్లడించారు పోలీసులు. 

అయితే 2016 నుంచి తన సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఒక పిస్టోల్ అనేది, హోటల్ వ్యాపారి దగ్గర ఉన్నట్లు వెల్లడించారు పోలీసులు. ఇక విషయానికి వస్తే, ఏడు పేజీల సూసైడ్ నోట్ రాసి చనిపోయిన హోటల్ వ్యాపారి ఎందుకు చనిపోయాడో విషయాలు తెలుసుకుని కంగుతిన్నరు పోలీసులు. నిజానికి తన చావుకి ఎవరు కారణం కాదని, అంతేకాకుండా తన జీవితంలో ఎటువంటి కష్టాలు కూడా లేవని, సూసైడ్ నోట్ లో స్పష్టంగా రాశాడు హోటల్ వ్యాపారి. నిజానికి తాను తొమ్మిది సంవత్సరాల క్రితమే, తనకు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత తన జీవితాన్ని ముగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు నోట్ ద్వారా చనిపోయిన వ్యాపారి చెప్పడం జరిగింది. 

ఏడు పేజీల సూసైడ్ నోట్ చదివిన పోలీసులు, ఆత్మహత్య చేసుకున్న హోటల్ వ్యాపారి మతిస్థిమితం సరిగా ఉండకపోవచ్చు అని, కొన్ని హెల్త్ ఇష్యూస్ కారణంగానే తను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు అని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కానీ ఏది ఏమైనాప్పటికీ ప్రస్తుతానికి అన్ని కోనాలలోని ఇన్వెస్టిగేషన్ అనేది తప్పకుండా జరుగుతుంది అని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ధైషీల్ యేవాలే కేసు విషయం గురించి ప్రకటించారు. 

ఫోన్ చూడొద్దన్నందుకు ఆత్మహత్య: 

హైదరాబాద్ లోని కెపిహెచ్బి ప్రాంతంలో నివాసం ఉంటున్న కాలేజీ చదువుతున్న ఒక అమ్మాయి మనస్థాపనతో ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకుంది. కాలేజీ చదువుతున్న ఆ అమ్మాయి ఎక్కువగా మొబైల్ ఫోన్ చూస్తున్నందువలన, తన తల్లికి కోపం వచ్చి గట్టిగా తిట్టి ఫోను ఎక్కువగా వాడొద్దు అంటూ మందలించింది. అయితే తన అమ్మ తనని ఫోను ఎక్కువగా వాడొద్దు అంటూ తిట్టడాన్ని తట్టుకోలేని ఆ అమ్మాయి మనస్థాపానికి గురై మరుసటి రోజు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది. 

అయితే తర్వాత ఆ అమ్మాయి కాలేజీకి వెళ్లలేనట్లు తన తల్లికి తెలిసింది. వెంటనే హోట హోటన తన తల్లి తన కూతురు గురించి జరిగినదంతా చెప్పి కేపిహెచ్బి పోలీస్స్టేషన్లో చెప్పి కనిపించట్లేదు అంటూ ఫిర్యాదు చేసింది. అయితే విషయాన్ని అర్థం చేసుకున్న కేపిహెచ్బి పోలీసులు కొన్ని టెక్నికల్ క్లూస్, అదేవిధంగా అమ్మాయి గురించి గుర్తులన్నీ సేకరించి వెంటనే రంగంలోకి దిగారు. అయితే కాలేజీకి వెళ్లాను అని చెప్పి ఆత్మహత్య చేసుకోవడానికి ఆ అమ్మాయి దుర్గం చెరువుకి వెళ్లినట్లు తెలిసింది అప్పుడు వెంటనే కెపిహెచ్బి పోలీసులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి అలర్ట్ చేశారు. అయితే ఆ దుర్గమ్మ చెరువు పరిసరాల్లో ఉన్న పోలీసులు అదేవిధంగా ఐటీ టీం తో కలిసి ఆ అమ్మాయి ఎక్కడుందో కనిపెట్టారు. 

అయితే అప్పటికే ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి దుర్గమ్మ చెరువులో దూకేసినట్టు తెలిసింది. అయితే ఆ అమ్మాయి ఉన్నచోటిని కనిపెట్టి వెంటనే తనని బోట్ల ద్వారా కాపాడటం జరిగింది. అనంతరం ఆ అమ్మాయిని తమ కుటుంబ సభ్యులకి అప్పగించారు.