బెంగ‌ళూరుకు శాపంగా మారిన ఐటీ ఇండ‌స్ట్రీ

బెంగ‌ళూరు ప్రాంతం అంటేనే ఐటీ సంస్థలకు పెట్టింది పేరు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకుని బెంగళూరులో సెటిల్ అవ్వాలని ఎంతగానో కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులో పెరుగుతున్న ఐటీ సర్వీసెస్ వాతావరణానికి పెనుముప్పుగా మారనుంది అని కూడా ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా ఒకవైపు ఆర్థికంగా బలపడుతున్నప్పటికీ, మరోవైపు బెంగుళురిని వెనక్కి లాగుతున్న ఖర్చులు. మరో సిలికాన్ వ్యాలీ:  ఒకప్పుడు చల్లని వాతావరణానికి, గార్డెన్ సిటీగా పేరుపొందిన బెంగళూరు సిటీ ఇప్పుడు సిలికాన్ వ్యాలీగా మారుతున్న […]

Share:

బెంగ‌ళూరు ప్రాంతం అంటేనే ఐటీ సంస్థలకు పెట్టింది పేరు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకుని బెంగళూరులో సెటిల్ అవ్వాలని ఎంతగానో కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులో పెరుగుతున్న ఐటీ సర్వీసెస్ వాతావరణానికి పెనుముప్పుగా మారనుంది అని కూడా ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా ఒకవైపు ఆర్థికంగా బలపడుతున్నప్పటికీ, మరోవైపు బెంగుళురిని వెనక్కి లాగుతున్న ఖర్చులు.

మరో సిలికాన్ వ్యాలీ: 

ఒకప్పుడు చల్లని వాతావరణానికి, గార్డెన్ సిటీగా పేరుపొందిన బెంగళూరు సిటీ ఇప్పుడు సిలికాన్ వ్యాలీగా మారుతున్న క్రమం కల్పిస్తోంది. బెంగుళూరులోని ప్రశాంత వాతవరణానికి పెట్టింది పేరుగా ఉన్న, సాంకీ ట్యాంక్ చుట్టూ జనవరిలో, కిమ్సుక అయ్యర్ అనే బెంగళూరు వాసి షికారు చేస్తున్నప్పుడు, డజన్ల కొద్దీ చెట్లపై ఎరుపు మరియు నలుపు X, O లతో పెయింట్ చేయడాన్ని గమనించారు. 34 ఏళ్ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న అయ్యర్, చెట్లపై ఉన్న గుర్తులను అర్థం చేసుకున్నారు.. వాటి అర్థం చెట్లను నరికి వేయాలని. 

నీటి అంచున హైవే ఓవర్‌పాస్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని. త్వరలోనే చెట్లను నరికే పని మొదలుపెట్టే క్రమం కనిపిస్తుందని, ఈ విషయాన్ని గురించి చుట్టుపక్కల ఉన్న నివాసితులు విసిగిపోయారని వెల్లడించారు అయ్యార్..  కర్ణాటక రెవెన్యూ మినిస్టర్ కృష్ణ బైరగౌడ ప్రకారం, ఒకపక్క బెంగుళూరు ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్నప్పటికీ, బెంగుళూరులో పెరుగుతున్న నివాసితులు కారణంగా డెవలప్మెంట్ కూడా పెరుగుతున్నాయని, అంతేకాకుండా మరిన్ని హౌసింగ్ ప్రాజెక్ట్స్ నిర్మించే పని పడిందని, ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయాలు జరగకుండా ఉండేందుకు రోడ్స్, శానిటేషన్, వాటర్ ఇంట్రెస్ట్రక్చర్ వంటివి చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని.. అక్రమ కట్టడాలు కూడా మరోవైపు ఎక్కువైపోతున్నాయని.. అనవసర ఆర్థిక ఖర్చుకి ఇది కూడా ఒక రకంగా కారణమని ఆయన నొక్కి చెప్పారు.

ఐటీ వ్యవస్థలోనే ముందంజలో ఉన్న బెంగుళూరు నగరం, నేడు విపరీతమైన అభివృద్ధి ఖర్చులను భరిస్తున్నట్లు తెలుస్తోంది. భారతదేశ $194 బిలియన్ల ఐటీ సేవల పరిశ్రమ, బెంగళూరును దేశంలోని సిలికాన్ వ్యాలీగా మార్చిన వైనం కనిపిస్తోంది. ఆర్థిక వృద్ధి కారణంగా,  1990 నుండి 13 మిలియన్లకుపైగా బెంగుళూరు నివాసులు మూడు రెట్లు పెరిగారని.. 1970లలో బెంగుళూరులో 70% చెట్లు మాత్రమే కనిపించేవి.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రకారం నేడు, బెంగళూరులో అనుకోకుండా చెట్లు ఆక్రమణ రేటు కేవలం 3% కంటే తక్కువగా ఉంది. నావిగేషన్ సాఫ్ట్‌వేర్ డెవలపర్ టామ్‌టామ్ గత సంవత్సరం ఈ నగరాన్ని భారతదేశంలో అత్యంత ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రదేశంగా, 5వ ర్యాంక్ కూడా ఇచ్చింది.

వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు: 

అక్రమ కట్టడాలు కారణంగా చాలా కాల్వల ప్రవాహానికి అడ్డంకుగా మారాయి, ఇది వర్షాల సమయంలో తీవ్ర వరదలకు దారి తీస్తుంది. మేలో కురిసిన వర్షాల కారణంగా, బెంగుళూరులోని రోడ్లమీద ప్రవహించిన వరదలకు, IT ఇన్ఫోసిస్ లిమిటెడ్‌లో ఒక ఉద్యోగిని కొట్టుకుపోయింది. ఈ క్రమంలోనే వరదల ముంపు ప్రాంతంగా బెంగుళూరు కనిపించింది. వరదల్లో మునిగిపోయిన ఎన్నో విలాసవంతమైన భవనాలు, రోడ్లు సోషల్ మీడియాలో చుక్కల్లో కొట్టాయి. మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ క్యాంపస్‌లు ఉన్న ఔటర్ రింగ్ రోడ్‌ను మూసివేయవలసి వచ్చింది.

బెంగుళూరు తుఫాను కాలువలను అన్‌లాక్ చేయడం ప్రారంభించాలని, మురుగునీటి శుద్ధి చేసి ప్రత్యేకమైన మౌలిక సదుపాయాలను నిర్మించాలని మరియు వాతావరణ మార్పులకు ఎదుర్కొనే విధంగా పనిచేసేందుకు.. వరల్డ్ బ్యాంకును $362 మిలియన్లు బైరే గౌడ లోన్ కోరారు. నగరాన్ని పునర్మించడానికి చాలా వరకు సమయం పడుతుందని, అది అంత సులభమైన పని కాదని ఆయన పేర్కొన్నారు.

ఆందోళనకు దిగిన పబ్లిక్: 

అక్రమ కట్టడాలతో, పూర్తిగా చెట్లను నరికి వేయడాన్ని చూస్తూ విసుగు చెందిన నివాసితులు ఫిబ్రవరిలో ఒక ఆదివారం ఉదయం సరస్సు చుట్టూ సైలెంట్ నిరసనను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. సిటీ సెంటర్‌లోని నిరసనల పరిమితులను పక్కనపెట్టి, ఎక్కువ ప్రాంతాలలో నిరసనలు వ్యాపించేలా లక్ష్యంగా పెట్టుకున్నారని, అంతేకాకుండా పాల్గొనేవారికి పూర్తిగా నలుపు రంగు బట్టలు వేసుకోవాలని సూచించారు. అయితే బ్యానర్‌లను తీసుకెళ్లడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం వంటివి చేయకూడదని కూడా నిర్ణయించడం జరిగింది. 

అయితే నిరసనకు సిద్ధమవుతుండగా, రద్దు చేయమని సలహా ఇస్తూ పోలీసుల నుండి కొంతమంది నిర్వాహకులకు కాల్‌స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత, నిరసన జరిగిన ఒక నెల తర్వాత, 70 మంది నిరసనదారుల మీద ఇన్వెస్టిగేషన్ కూడా జరిగిన వైనం కనిపించింది.రోడ్లు పెంచితే కేవలం, శబ్ద, వాయు కాలుష్యాలు పెరుగుతాయని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారని.. కేవలం చెట్లు కొట్టొద్దు అంటూ దిగిన నిరసనకు, క్రిమినల్స్ లా చూడడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు పబ్లిక్.