భారతదేశంలోనే సంపన్న గణేశుడు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు గణేష్ చతుర్థి సంబరాలు అంబరాన అంటుకునేలా కన్నుల పండుగగా చేసుకున్నారు. అయితే గణేష్ చతుర్థి వస్తుంది అంటేనే ప్రతి ఒక్కరూ పోటాపోటీగా తమ ప్రతిమల గురించి ఉత్సాహంగా అంచనాలు పెంచేస్తూ ఉంటారు. ఒకరిని మించి మరొకరు తమ ప్రతిమ గురించి ఊహాగానాలు వేస్తూ ఉంటారు. వినూత్నంగా ఆలోచించాలని కొందరు, ఆడంబరంగా ఉండాలని కొందరు, ప్రతి ఒక్కరి కళ్ళు తమ గణేశుడు మీదే ఉండాలని మరికొందరు.. ఇలా వినాయక చవితి రోజున తాము నెలకొల్పే […]

Share:

ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు గణేష్ చతుర్థి సంబరాలు అంబరాన అంటుకునేలా కన్నుల పండుగగా చేసుకున్నారు. అయితే గణేష్ చతుర్థి వస్తుంది అంటేనే ప్రతి ఒక్కరూ పోటాపోటీగా తమ ప్రతిమల గురించి ఉత్సాహంగా అంచనాలు పెంచేస్తూ ఉంటారు. ఒకరిని మించి మరొకరు తమ ప్రతిమ గురించి ఊహాగానాలు వేస్తూ ఉంటారు. వినూత్నంగా ఆలోచించాలని కొందరు, ఆడంబరంగా ఉండాలని కొందరు, ప్రతి ఒక్కరి కళ్ళు తమ గణేశుడు మీదే ఉండాలని మరికొందరు.. ఇలా వినాయక చవితి రోజున తాము నెలకొల్పే గణేశుడు గురించి ఊహాగానాలు వేస్తూ ఉంటారు. ఇలానే ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది GSB సేవా మండల్ ఏర్పాటుచేసిన గణేశుడి ప్రతిమ. 

ప్రత్యేకతలు తెలుసుకుందాం రండి: 

GSB సేవా మండల్‌లోని ‘మహాగణపతి’, బహుశా భారతదేశంలోనే అత్యంత సంపన్న విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. దానిని అలంకరించిన విధానం నగరంలో చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే, ఈ సంవత్సరం 66.5 కిలోగ్రాముల బంగారు ఆభరణాలతో, 295 కిలోగ్రాముల వెండితో పాటు, ఇతర విలువైన వస్తువులతో గణపతి కనువిందు చేశాడు. 

నగరంలోని తూర్పు ప్రాంతంలోని కింగ్స్ సర్కిల్ మండలం 69వ వార్షికోత్సవం జరుపుకుంటుందని, భద్రతా ఏర్పాట్లలో భాగంగా మొదటి సారిగా ఫేషియల్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు GSB సేవా మండల్ ప్రతినిధి సోమవారం తెలిపారు. అయితే ఈ మేరకు, మండలం ఈ సంవత్సరం ₹ 360.40 కోట్ల ఇన్సూరెన్స్ రక్షణను కూడా తీసుకున్నట్లు.. భక్తుల కోసం, నిర్వాహకులు QR కోడ్.. అంతేకాకుండా డిజిటల్ లైవ్ మెకానిజమ్‌లను ప్రవేశపెట్టినట్లు ప్రతినిధి తెలియజేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని విజయవంతంగా నిర్మాణం జరగాలని తొందరిలోనే ఆ ఏం చేస్తున్నారు కోసం హోమం అలాగే ఇతర ఆచారాలు జరుగుతాయని ప్రతినిధి తెలిపారు. 

మట్టి ప్రతిమలు: 

ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తూ వినాయక చవితి సంబరాలు అంబరాన అంటుకునేలా జరుపుకున్నారు. ముఖ్యంగా చాలామంది మట్టి ప్రతిమలను ముఖ్యంగా ఎంపిక చేసుకోవడం జరిగింది. పండుగల సందర్భంలో కూడా పర్యావరణానికి హాని కలిగించకుండా, మట్టి ప్రతిమలను ఎన్నుకోవడం మంచి విషయం అంటూ చాలామంది తమ ఇంటికి మట్టి ప్రతిమలను తీసుకునివెళ్లారు. 

జల కాలుష్యం ముఖ్యంగా జరగకూడదని, హాని కలిగించే కెమికల్స్ కలిగిన రంగులను ఉపయోగించకుండా.. పూర్తిగా పర్యవర్ణానికి మేలును చేసే మంచి మట్టితో చేసిన ప్రతిమలకు ఎక్కువగా ఆదరాభిమానాలు దక్కాయి. మరి ముఖ్యంగా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా చిన్న మట్టి విగ్రహాలను తమ ఇళ్లకు తీసుకువెళ్లి మరొకసారి ఆడంబరాలకి పోకుండా, తమ ఇష్ట దైవాన్ని పూజించుకున్నారు. 

ముఖ్యంగా కెమికల్స్ ఉన్న రంగులను పూసిన విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో జల కాలుష్యం ఎక్కువగా వాటిల్లుతుందని ఎప్పటినుంచో వాదన వినిపిస్తోంది. వినాయక చవితి తరువాత జరిగే నిమజ్జనాల సందర్భంలో పలు చెరువులలో, సముద్రాలలో, జల రాశులలో పిహెచ్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతున్నాయని, నీటి కాలుష్యం వల్ల నీళ్లు కాలుష్యం అవ్వడమే కాకుండా, అందులో ఉన్న చేపలు ముఖ్యంగా చనిపోవడం జరుగుతుందని, దీనికి ఒకే ఒక్క నివారణ మట్టి ప్రతిమలు అని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యంగా పెద్ద నాయకుల దగ్గర నుంచి పెద్దపెద్ద సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలకు ప్రాధాన్యతనిస్తూ భారతదేశంలోనే కాకుండా అనేక దేశాలలో ఉన్న భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. సోషల్ మీడియాలో చాలామంది ప్రముఖులు తమ ఇంటికి మట్టి ప్రతిమలను తీసుకువెళ్లిన ఫోటోలను షేర్ చేసి, ప్రజలకు మరింత స్ఫూర్తిని అందిస్తున్నారు. దైవాన్ని పూజించేందుకు ఆడంబరాలకు పోనక్కర్లేదని, చిన్న మట్టి ప్రతిమ కూడా మన కష్టాలను తీర్చే దైవంగా మారుతుందని మరొకసారి చాటి చెప్పారు.