ఇండియాలో ఖ‌రీదైన‌, చ‌వ‌కైన న‌గ‌రాలు

ఇండియాలో నివ‌సించ‌డానికి ఖ‌రీదైన‌, చ‌వ‌కైన న‌గ‌రాల జాబితా రిలీజ్ అయింది. అన్నింటి గురించి పట్టించుకోవడం అందరికీ సాధ్యం కాదు కానీ టాప్-10లో ఉన్న నగరాల జాబితా గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటూ ఉంటారు. అంతే కాకుండా తాము నివాసం ఉంటున్న నగరం ఆ జాబితాలో ఎక్కడ ఉందో కూడా చూసుకుంటూ ఉంటారు. అటువంటి నగరాల జాబితాను ఏటా కొన్ని సంస్థలు రిలీజ్ చేస్తూ ఉంటాయి. అలా రిలీజ్ చేసిన నగరాల జాబితా గురించి ఇక్కడ ఉంది.  ఒకప్పుడు […]

Share:

ఇండియాలో నివ‌సించ‌డానికి ఖ‌రీదైన‌, చ‌వ‌కైన న‌గ‌రాల జాబితా రిలీజ్ అయింది. అన్నింటి గురించి పట్టించుకోవడం అందరికీ సాధ్యం కాదు కానీ టాప్-10లో ఉన్న నగరాల జాబితా గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటూ ఉంటారు. అంతే కాకుండా తాము నివాసం ఉంటున్న నగరం ఆ జాబితాలో ఎక్కడ ఉందో కూడా చూసుకుంటూ ఉంటారు. అటువంటి నగరాల జాబితాను ఏటా కొన్ని సంస్థలు రిలీజ్ చేస్తూ ఉంటాయి. అలా రిలీజ్ చేసిన నగరాల జాబితా గురించి ఇక్కడ ఉంది. 

ఒకప్పుడు ఇండియా అంటే నగరాలు అంత డెవలప్ అయి ఉండేవి కావు. కానీ ప్రస్తుతం రోజులు మారాయి. మన దేశంలో ఉన్న నగరాలు కూడా అన్నింటా డెవలప్ అవుతున్నాయి. మన దేశంలో ఉన్న నగరాల జాబితా ఆధారంగా ఆ నగరంలో ప్లాట్లకు ధర నిర్ణయం అవుతూ ఉంటుంది. ఇంత‌కీ ఆ న‌గ‌రాలు ఏంటో చూద్దాం.

నైట్ ఫ్రాంక్ నివేదిక ఇదే.. 

ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్ అయిన నైట్ ఫ్రాంక్ ఇండియాలో అత్యంత సరసమైన నగరంగా అహ్మదాబాద్ ను సెలెక్ట్ చేసింది. ఈ నివేదిక వలన అహ్మదాబాద్ కు పెద్ద పేరొచ్చింది. అందువల్ల అనేక మంది ఈ నగరంలో అనేక ప్లాట్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మన జీతంలో 50 శాతం కంటే ఎక్కువ emi చెల్లించాల్సి వస్తే అది భరించలేనిదిగా ఉంటుంది. ఎందుకంటే దీనిని బ్యాంకులు కూడా భరించలేవు. కావున అటువంటి పరిస్థితుల్లో లోన్లు ఇచ్చేందుకు ఏ బ్యాంకులు కూడా ముందుకు రావు. కావున ఫ్లాట్ తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. 

ఖరీదైన మార్కెట్ గా నిలిచిన ముంబై

ముంబై నగరం మన ఇండియాలో ఖరీదైన నగరంగా నిలిచింది. ఇక్కడ emi చెల్లించే ఆదాయ నిష్పత్తి 55  శాతంగా ఉంది. కావున ఇటువంటి తరుణంలో ఇంటి రుణం మంజూరు చేసేందుకు ఎటువంటి బ్యాంకులు కూడా ముందుకు రావు. కావున ఇల్లు తీసుకోవడం చాలా కష్టం అవుతుంది.  కావున ఇక్కడ సొంతింటి కల అనేది చాలా కష్టంగా మారుతుంది. ఎవరూ కూడా సొంతింటి కలను నిజం చేసుకోలేరు. 

మన హైదరాబాద్ ఎక్కడంటే.. 

ఈ జాబితాలో మన హైదరాబాద్ రెండవ అత్యంత ఖరీదైన నగరంగా ఉంది. ఇక్కడ 31 శాతం emi టూ ఆదాయ నిష్పత్తి నమోదైంది. అంటే మన నగరంలో ఒక వ్యక్తి జీతంలో 31 శాతం ఇంటి రుణానికే చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణం చేతే నగరంలో కొన్నిరోజుల నుంచి ఇంటి కొనుగోళ్లు మందగించాయి. ఇక ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్) నిలిచింది. ఇక్కడ ఒక వ్యక్తికి వచ్చే ఆదాయంలో దాదాపు 30 శాతం emi చెల్లించాలి. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు మరియు తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై 28 శాతంemi తో జాబితాలో తర్వాతి అత్యంత ఖరీదైన నగరాలుగా నిలిచాయి. ఇక మహారాష్ట్రలోని ఫేమస్ టౌన్ అయిన పూనే నగరం తర్వాతి స్థానంలో ఉంది. ఈ సిటీలో emiగా ఒక వ్యక్తి తన సగటు జీతంలో 26 శాతం చెల్లించాల్సి వస్తోంది. ఇక పశ్చిమ బెంగాల్ లోని రాజధాని కోల్ కతాలో కూడా ఇదే రేటు ఉంది. ఇక్కడ emiగా ఒక వ్యక్తి తన జీతంలోని 26 శాతం వెళ్తోంది. 

అహ్మదాబాద్ దే సరసమైన రేటు

మన దేశంలో కేవలం గుజరాత్ లోని అహ్మదాబాద్ నగరం సరసమైన నగరంగా ఉంది. ఇక్కడ ఒక సగటు కుటుంబం గృహ రుణ emi ల కోసం వారి ఆదాయంలో కేవలం 23 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఇటువంటి నిష్పత్తి గత కొద్ది రోజులుగా ఇదే ప్రథమం. మన దేశంలోని నగరాల లిస్టును నైట్ ఫ్రాంక్ మాత్రమే కాకుండా మరిన్ని సంస్థలు కూడా వెల్లడిస్తున్నాయి.