రైల్వే స్టేషన్‌లో ట్రాన్స్‌జెండర్లు టీ అమ్ముతున్నారు

దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్ టీ స్టాల్ ప్రారంభించబడింది అసోంలోని గౌహతి రైల్వే స్టేషన్‌లో ట్రాన్స్ టీ స్టాల్ ప్రారంభించడం జరిగింది. ఈ టీ స్టాల్‌ను పూర్తిగా ట్రాన్స్‌జెండర్లు మాత్రమే నడుపుతున్నారు. అసోంలోని గౌహతి రైల్వే స్టేషన్‌లో ట్రాన్స్ టీ స్టాల్ ప్రారంభమైంది. ఈ టీ స్టాల్‌ను పూర్తిగా ట్రాన్స్‌జెండర్లు నడుపుతున్నారు. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఈ తరహాలో మన దేశంలో ప్రారంభించిన  తొలి దుకాణం ఇదే. కాగా.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ టీ స్టాల్ ఫోటోను […]

Share:

దేశంలోనే మొట్టమొదటి ట్రాన్స్ టీ స్టాల్ ప్రారంభించబడింది

అసోంలోని గౌహతి రైల్వే స్టేషన్‌లో ట్రాన్స్ టీ స్టాల్ ప్రారంభించడం జరిగింది. ఈ టీ స్టాల్‌ను పూర్తిగా ట్రాన్స్‌జెండర్లు మాత్రమే నడుపుతున్నారు.

అసోంలోని గౌహతి రైల్వే స్టేషన్‌లో ట్రాన్స్ టీ స్టాల్ ప్రారంభమైంది. ఈ టీ స్టాల్‌ను పూర్తిగా ట్రాన్స్‌జెండర్లు నడుపుతున్నారు. రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఈ తరహాలో మన దేశంలో ప్రారంభించిన  తొలి దుకాణం ఇదే. కాగా.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ టీ స్టాల్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్  చేశారు.

ఇక రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్..  ఫోటోకు క్యాప్షన్ కూడా ఇచ్చారు. గౌహతి రైల్వే స్టేషన్‌లోని రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్ టీ స్టాల్ అని రాశారు.

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి సాధికారత కల్పించేందుకే ఈ చొరవ

నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే ప్రతినిధి సబ్యసాచి డే ప్రకారం.. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి సాధికారత కల్పించడానికి NEFR ఈ చొరవ తీసుకుంది. ఆల్ అస్సాం ట్రాన్స్‌జెండర్ అసోసియేషన్ కూడా ట్రాన్స్ టీ స్టాల్స్ ఏర్పాటుకు సహకరించింది. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే.. ఇతర రైల్వే స్టేషన్లలో కూడా ఇటువంటి టీ స్టాల్స్‌ను మరిన్ని ప్రారంభించాలని యోచిస్తోంది.

ప్లాట్‌ఫారమ్ నంబర్ వన్‌పై టీ స్టాల్

స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నంబర్ 1లో ఈ టీ స్టాల్ ఉంది. దీనిని NF రైల్వే GM అన్షుల్ గుప్తా ప్రారంభించారు. ప్రభుత్వ రంగ సంస్థలలో ఇటువంటి కార్యక్రమాలలో ఇదే మొదటిదని అన్షుల్ గుప్తా అన్నారు.

అసోం ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డ్ అసోసియేట్ వైస్ చైర్మన్ స్వాతి బిధాన్ బారుహ్ మాట్లాడుతూ రాబోయే కాలంలో ఇలాంటి ప్రభుత్వ పథకాల కింద చాలా ట్రాన్స్‌జెండర్లకు పునరావాసం లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సాధికారతకు మూలస్తంభం

అంతకుముందు, ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే తరపున ట్వీట్ చేస్తూ, భారతీయ రైల్వేలో మొదటిసారిగా, గౌహతి రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ 1లో టీ స్టాల్ ప్రారంభించబడిందని, దీనిని ట్రాన్స్‌జెండర్లు మాత్రమే నిర్వహిస్తారని చెప్పారు.  ఇది ‘సబ్కా సాథ్ సబ్‌కా వికాస్’ పిలుపుకు నిదర్శనమని, ఈ స్టాల్ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి సాధికారతకు స్తంభంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రాన్స్ జెండర్ ల పునరావాసం, సంక్షేమం కోసం జీవనోపాధి, వారికి మద్దతునిచ్చే సమగ్ర పథకాన్ని గత సంవత్సరం ఆమోదించింది.

గత ఏడాది ఏప్రిల్‌లో ‘ట్రాన్స్ టీ స్టాల్’ కార్యక్రమం కింద అసోం మొదటి ట్రాన్స్ జెండర్ టీ స్టాల్‌ను పొందడం గమనార్హం. గౌహతిలోని అమింగ్‌గావ్‌లోని కమ్రూప్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో ఈ స్టాల్‌ను ప్రారంభించారు. గత సంవత్సరం ప్రారంభోత్సవంలో, అసోసియేట్ VC బారుహ్ మాట్లాడుతూ, ‘ఆ సంస్థ ట్రాన్స్ జెండర్ల పట్ల ఉన్న అపోహలను తొలగించి, వారికి సాధికారత కల్పించే లక్ష్యంతో అనేక జిల్లా పరిపాలనలను సంప్రదించింది. వారి విన్నపాలను చాలా వరకు పట్టించుకోలేదు, ఎట్టకేలకు డీసీ కమ్రూప్ రూరల్ సానుకూలంగా స్పందించడంతో, వారు తమ కలను సాకారం చేసుకోగలిగారు.’ అని చెప్పారు.

ఏప్రిల్ 15, 2015న ఒక చారిత్రాత్మక తీర్పులో, సుప్రీంకోర్టు ట్రాన్స్ జెండర్ సంఘాన్ని థర్డ్ జెండర్‌గా గుర్తించింది.