ఆదిత్య L1 బడ్జెట్ ఎంతో తెలుసా..!

సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట నుంచి ఆదిత్య L లాంచ్ చేయడం జరిగింది. ఇది అంతరిక్షంలో భారతదేశం యొక్క మొట్టమొదటి సౌర అబ్జర్వేటరీ. 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థలోని మొదటి ‘లాగ్రాంజ్ పాయింట్’ (L1) చుట్టూ హాలో ఆర్బిట్ లో తిరగబోతోంది ఆదిత్య L1. సోలార్ స్టోర్మ్స్ వంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టనుంది ఆదిత్య L1.  ఆదిత్య L1 బడ్జెట్:  ప్రత్యేకించి సూర్యుని మీద రీసెర్చ్ […]

Share:

సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట నుంచి ఆదిత్య L లాంచ్ చేయడం జరిగింది. ఇది అంతరిక్షంలో భారతదేశం యొక్క మొట్టమొదటి సౌర అబ్జర్వేటరీ. 1.5 మిలియన్ కి.మీ దూరంలో ఉన్న సూర్య-భూమి వ్యవస్థలోని మొదటి ‘లాగ్రాంజ్ పాయింట్’ (L1) చుట్టూ హాలో ఆర్బిట్ లో తిరగబోతోంది ఆదిత్య L1. సోలార్ స్టోర్మ్స్ వంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టనుంది ఆదిత్య L1. 

ఆదిత్య L1 బడ్జెట్: 

ప్రత్యేకించి సూర్యుని మీద రీసెర్చ్ చేయడానికి బయలుదేరిన ఆదిత్య L1 మిషన్ బడ్జెట్ 300 కోట్లు. అంటే ఇటీవల చంద్రుడు మీదకి చేరుకున్న చంద్రయాన్-3 మిషన్ బడ్జెట్ కన్నా సగానికి తక్కువ. అంతేకాకుండా మరెన్నో దేశాల మిషన్ల తయారీతో పోలిస్తే, మన దేశ ఇస్రో ద్వారా తయారు చేయబడిన ఆదిత్య L1, చంద్రయాన్-3 మిషన్ల బడ్జెట్ చాలా చాలా వరకు తక్కువ అని చెప్పుకోవాలి. భారతదేశ ఇస్రో తన ఖాతాలో మరో విజయాన్ని ఆదిత్య L1 మిషన్ ద్వారా సాధిస్తుందని అభిప్రాయపడుతున్నారు శాస్త్రవేత్తలు. అంతేకాకుండా ఒకవేళ ఈ మిషన్ సక్సెస్ అయితే సూర్యుడి మీద రీసెర్చ్ చేయడానికి వెళ్లిన నాలుగో దేశంగా గుర్తింపు పొందుతుంది భారతదేశం.

మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి?: 

L1 పాయింట్ అంటే ఎల్ వన్ చుట్టూ ఉండే హాలో ఆర్బిట్ మీదగా తిరిగే ఆదిత్య L1 అంతరిక్ష నౌక ద్వారా మనం సూర్యుని యొక్క అధిక-రిజల్యూషన్ ఫొటోస్ అదేవిధంగా సూర్యుడు చుట్టూ ఉండే మరిన్ని లేయర్స్ గురించి రీసెర్చ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సూర్యుడు భూమి నుండి 150 మిలియన్ కి.మీ దూరంలో ఉన్నప్పటికీ మరియు L1 పాయింట్ కేవలం 1.5 మిలియన్ కి.మీ దూరం. అంతరిక్ష నౌక సూర్యుడిని అత్యంత దగ్గర నుంచి అదే విధంగా 24 గంటలు రీసెర్చ్ చేయడానికి సరిగ్గా సరిపోతుంది. మొదటిది, తెల్లవారుజామున నుండి సాయంత్రం వరకు మాత్రమే సూర్యుని చూసి అవకాశం ఉంటుందని.. రెండవది, సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో మాత్రమే మనం సూర్యుని బయటి పొర =లేకుండా చూడగలమని.. కానీ ఇప్పుడు ఆదిత్య మిషన్ ద్వారా 24 గంటలు సూర్యుడి మీద పరిశోధన జరిపే అవకాశం ఉంటుందని విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, ఆదిత్య-ఎల్1లో ప్రైమరీ పేలోడ్ అయిన VELCకి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ అయిన రమేష్ అన్నారు.

120 రోజుల ప్రయాణం: 

శ్రీహరికోట నుంచి రాకెట్‌ బయల్దేరిన తర్వాత దానిని భూమి చుట్టూ ఉన్న భూమి కక్ష్య (LEO)లో ఉంచుతారు. తర్వాత, వేరే ఆర్బిట్ కు మెల్లమెల్లగా పంపించుకుంటూ వెళ్తారు. అయితే ముఖ్యంగా ఇక్కడ గ్రావిటేషనల్ ఫుల్ అనే ప్రిన్సిపల్ ఉపయోగించే, భూమికి సంబంధించిన ఆర్బిట్ నుంచి దూరంగా L1 పాయింట్ వైపుకు ముందుకు పంపడం జరుగుతుంది. ఆదిత్య-ఎల్1 అది కచ్చితంగా చేరుకోవలసిన ఆర్బిట్ ను చేరుకోవడానికి దాదాపు నాలుగు నెలల సమయం పడుతుంది. ఇస్రో నిర్వహించే ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్ (ఐడీఎస్‌ఎన్) ద్వారా డేటాను అందజేస్తామని సీనియర్ శాస్త్రవేత్త తెలిపారు. 

ఆదిత్య-ఎల్1, ఇస్రోతో సన్నిహిత సహకారంతో IIA చే అభివృద్ధి చేయబడిన VELCతో సహా ఏడు పేలోడ్‌లను తీసుకువెళుతుంది. ఇతర పేలోడ్‌లు సూర్యుని చుట్టూ ఉండే కొన్ని లేయర్స్ ను చిత్రించడానికి ప్రయత్నిస్తాయి – ఫోటోస్పియర్ మరియు క్రోమోస్పియర్, సోలార్ స్టోర్మ్స్ వంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెడతాయి. సూర్యుడి ఎల్ 1 పాయింట్ ద‌గ్గ‌రికి చేరుకోడానికి ఆదిత్య ఎల్ 1కు 120 రోజులు ప‌డుతుంది.